< Süleyman'In Özdeyişleri 6 >

1 Oğlum, eğer birine kefil oldunsa, Onun borcunu yüklendinse,
కుమారా, నీ పొరుగువాడి కోసం హామీగా ఉన్నప్పుడు, పొరుగువాడి పక్షంగా వాగ్దానం చేసినప్పుడు,
2 Düştünse tuzağa kendi sözlerinle, Ağzının sözleriyle yakalandınsa,
నువ్వు పలికిన మాటలే నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి. నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడతావు.
3 O kişinin eline düştün demektir. Oğlum, şunu yap ve kendini kurtar: Git, yere kapan onun önünde, Ona yalvar yakar.
కుమారా, నీ పొరుగువాడి చేతిలో చిక్కుబడినప్పుడు నువ్వు త్వరగా వెళ్లి నిన్ను విడుదల చేయమని అతణ్ణి బతిమాలుకో.
4 Gözlerine uyku girmesin, Ağırlaşmasın göz kapakların.
నీ కళ్ళకు నిద్ర రాకుండా, నీ కనురెప్పలకు కునుకుపాట్లు రానివ్వకుండా ఈ విధంగా చేసి దాని నుండి తప్పించుకో.
5 Avcının elinden ceylan gibi, Kuşbazın elinden kuş gibi kurtar kendini.
వేటగాడి బారి నుండి లేడి తప్పించుకున్నట్టు, బోయవాడి వల నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో.
6 Ey tembel kişi, git, karıncalara bak, Onların yaşamından bilgelik öğren.
సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో.
7 Başkanları, önderleri ya da yöneticileri olmadığı halde,
వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు.
8 Yazın erzaklarını biriktirirler, Yiyeceklerini toplarlar biçim mevsiminde.
అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.
9 Ne zamana dek yatacaksın, ey tembel kişi? Ne zaman kalkacaksın uykundan?
సోమరీ, ఎంతసేపటి వరకూ నిద్రపోతూ ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు?
10 “Biraz kestireyim, biraz uyuklayayım, Ellerimi kavuşturup şöyle bir uyuyayım” demeye kalmadan,
౧౦ఇంకా ఎంతసేపు కునికిపాట్లు పడుతూ “కొంచెం సేపు నిద్రపోతాను, కాస్సేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను” అనుకుంటావు?
11 Yokluk bir haydut gibi, Yoksulluk bir akıncı gibi gelir üzerine.
౧౧అందువల్ల దోపిడీ దొంగ వచ్చినట్టు దరిద్రం నీకు ప్రాప్తిస్తుంది. ఆయుధం ధరించిన శత్రువు వలే లేమి నీ దగ్గరికి వస్తుంది.
12 Ağzında yalanla dolaşan kişi, Soysuz ve fesatçıdır.
౧౨కుటిలంగా మాట్లాడేవాడు దుర్మార్గుడు, నిష్ప్రయోజకుడు.
13 Göz kırpar, bir sürü ayak oyunu, El kol hareketleri yapar,
౧౩వాడు కన్ను గీటుతూ కాళ్లతో సైగలు చేస్తాడు. చేతి వేళ్లతో గుర్తులు చూపిస్తాడు.
14 Ahlaksız yüreğinde kötülük tasarlar, Çekişmeler yaratır durmadan.
౧౪వాడి హృదయం దుష్ట స్వభావంతో ఉంటుంది. వాడు ఎప్పుడూ కీడు తలపెట్టాలని చూస్తాడు.
15 Bu yüzden ansızın yıkıma uğrayacak, Birdenbire çaresizce yok olacak.
౧౫అలాంటివాడి మీదికి హఠాత్తుగా ప్రమాదం ముంచుకు వస్తుంది. ఆ క్షణంలోనే వాడు తిరిగి లేవకుండా కూలిపోతాడు.
16 RAB'bin nefret ettiği altı şey, İğrendiği yedi şey vardır:
౧౬యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.
17 Gururlu gözler, Yalancı dil, Suçsuz kanı döken eller,
౧౭అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు,
18 Düzenbaz yürek, Kötülüğe seğirten ayaklar,
౧౮దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు,
19 Yalan soluyan yalancı tanık Ve kardeşler arasında çekişme yaratan kişi.
౧౯లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.
20 Oğlum, babanın buyruklarına uy, Annenin öğrettiklerinden ayrılma.
౨౦కుమారా, నీ తండ్రి బోధించే ఆజ్ఞలు పాటించు. నీ తల్లి చెప్పే ఉపదేశాన్ని నిర్ల్యక్షం చెయ్యకు.
21 Bunlar sürekli yüreğinin bağı olsun, Tak onları boynuna.
౨౧వాటిని ఎల్లప్పుడూ నీ హృదయంలో పదిలం చేసుకో. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో.
22 Yolunda sana rehber olacak, Seni koruyacaklar yattığın zaman; Söyleşecekler seninle uyandığında.
౨౨నీ రాకపోకల్లో, నువ్వు నిద్రపోయే సమయంలో అవి నిన్ను కాపాడతాయి. నువ్వు మెలకువగా ఉన్నప్పుడు అవి నీతో సంభాషిస్తాయి.
23 Bu buyruklar sana çıra, Öğretilenler ışıktır. Eğitici uyarılar yaşam yolunu gösterir.
౨౩దేవుని ఆజ్ఞలు దీపం లాంటివి. ఉపదేశం వెలుగు వంటిది. క్రమశిక్షణ కోసం చేసే దిద్దుబాట్లు జీవానికి సోపానాలు.
24 Seni kötü kadından, Başka birinin karısının yaltaklanan dilinden Koruyacak olan bunlardır.
౨౪వ్యభిచారిణి దగ్గరికి వెళ్ళకుండా, చెడ్డ స్త్రీ చెప్పే మోసపు మాటలకు లోబడకుండా అవి నిన్ను కాపాడతాయి.
25 Böyle kadınların güzelliği seni ayartmasın, Bakışları seni tutsak etmesin.
౨౫దాని అందం చూసి నీ హృదయంలో మోహించకు. అది తన కనుసైగలతో నిన్ను లోబరుచుకోవాలని చూస్తే దాని వల్లో పడవద్దు.
26 Çünkü fahişe yüzünden insan bir lokma ekmeğe muhtaç kalır, Başkasının karısıyla yatmak da kişinin canına mal olur.
౨౬వేశ్యలతో సాంగత్యం చేసేవాళ్ళకు కేవలం రొట్టెముక్క మాత్రమే మిగులుతుంది. వ్యభిచారి నీ విలువైన ప్రాణాన్ని వేటాడుతుంది.
27 İnsan koynuna ateş alır da, Giysisi yanmaz mı?
౨౭ఒకడు తన ఒడిలో నిప్పు ఉంచుకుంటే వాడి బట్టలు కాలిపోకుండా ఉంటాయా?
28 Korlar üzerinde yürür de, Ayakları kavrulmaz mı?
౨౮ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి కాళ్ళు కాలకుండా ఉంటాయా?
29 Başkasının karısıyla yatan adamın durumu budur. Böyle bir ilişkiye giren cezasız kalmaz.
౨౯తన పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు ఆ విధంగానే నాశనం అవుతాడు. ఆమెను తాకిన వాడికి శిక్ష తప్పదు.
30 Aç hırsız karnını doyurmak için çalıyorsa, Kimse onu hor görmez.
౩౦బాగా ఆకలి వేసిన దొంగ భోజనం కోసం దొంగతనం చేసినప్పుడు వాణ్ణి ఎవ్వరూ తిరస్కారంగా చూడరు గదా.
31 Ama yakalanırsa, çaldığının yedi katını ödemek zorunda; Varını yoğunu vermek anlamına gelse bile.
౩౧అయినప్పటికీ వాడు దొరికిపోతే వాడు దొంగిలించిన దానికి ఏడు రెట్లు చెల్లించాలి. అందుకోసం తన యింటిని అమ్మివేయాలిసి వచ్చినా దాన్ని అమ్మి తప్పక చెల్లించాలి.
32 Zina eden adam sağduyudan yoksundur. Yaptıklarıyla kendini yok eder.
౩౨వ్యభిచారం చేసేవాడు కేవలం బుద్ధి లేనివాడు. ఆ పని చేసేవాడు తన సొంత నాశనం కోరుకున్నట్టే.
33 Payına düşen dayak ve onursuzluktur, Asla kurtulamaz utançtan.
౩౩వాడు గాయాలకు, అవమానాలకు గురి అవుతాడు. వాడికి కలిగే అవమానం ఎప్పటికీ తొలగిపోదు.
34 Çünkü kıskançlık kocanın öfkesini azdırır, Öç alırken acımasız olur.
౩౪భర్తకు వచ్చే రోషం తీవ్రమైన కోపంతో కూడి ఉంటుంది. ప్రతీకారం చేసే సమయంలో అతడు కనికరం చూపించడు.
35 Hiçbir fidye kabul etmez, Gönlünü alamazsın armağanların çokluğuyla.
౩౫ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇచ్చే దేనినీ అతడు లక్ష్యపెట్టడు. ఎన్ని విలువైన కానుకలు ఇచ్చినా అతడు తీసుకోడు.

< Süleyman'In Özdeyişleri 6 >