< Süleyman'In Özdeyişleri 5 >

1 Oğlum, bilgeliğime dikkat et, Akıllıca sözlerime kulak ver.
కుమారా, నేను బోధించే జ్ఞానవాక్కులు విను. నా తెలివి గల మాటలు శ్రద్ధగా ఆలకించు.
2 Böylelikle her zaman sağgörülü olur, Dudaklarınla bilgiyi korursun.
అప్పుడు నువ్వు జ్ఞానయుక్తంగా నడుచుకుంటావు. నీ తెలివితేటలను బట్టి నీ నోరు మాట్లాడుతుంది.
3 Zina eden kadının bal damlar dudaklarından, Ağzı daha yumuşaktır zeytinyağından.
వ్యభిచారిణి పెదవుల నుండి తేనెలాంటి మాటలు వెలువడతాయి. దాని నోటి మాటలు నూనె కంటే మృదువుగా ఉంటాయి.
4 Ama sonu pelinotu kadar acı, İki ağızlı kılıç kadar keskindir.
చివరికి ఆమె వసనాభి కాయలాగా ఉంటుంది. రెండంచుల కత్తి వలే ఉంటుంది.
5 Ayakları ölüme gider, Adımları ölüler diyarına ulaşır. (Sheol h7585)
దాని ప్రవర్తన మరణంలో పడిపోవడానికి దారితీస్తుంది. దాని మార్గం సూటిగా పాతాళానికి చేరుస్తుంది. (Sheol h7585)
6 Yaşama giden yolu hiç düşünmez, Yolları dolaşıktır, ama farkında değil.
జీవమార్గం గురించి వ్యభిచారిణి ఎంతమాత్రం ఆలోచించదు. ఆమె ఎటు వెళ్తుందో ఆమెకే తెలియక అటూ ఇటూ సంచరిస్తుంది.
7 Oğlum, şimdi beni dinle, Ağzımdan çıkan sözlerden ayrılma.
కుమారులారా, నేను చెప్పే బోధ ఆలకించండి. నేను చెప్పే ఉపదేశం నుండి పక్కకు మళ్ళుకోవద్దు.
8 Öyle kadınlardan uzak dur, Yaklaşma evinin kapısına.
వ్యభిచారిణి నివసించే స్థలాల నుండి నీ అడుగులు దూరం చేసుకో. ఆమె యింటి వాకిలి వైపు పోవద్దు.
9 Yoksa onurunu başkalarına, Yıllarını bir gaddara kaptırırsın.
నువ్వు గనుక వ్యభిచారిణి దగ్గరికి వెళ్లిన పక్షంలో నీ ప్రతిష్ట నవ్వుల పాలౌతుంది. నీ జీవిత కాలమంతా దుష్టుల చేతిల్లోకి వెళ్తుంది.
10 Varını yoğunu yer bitirir yabancılar, Emeğin başka birinin evini bayındır kılar.
౧౦అన్యులు నీ ఆస్తిని అనుభవిస్తారు. నీ కష్టార్జితమంతా పరుల ఇల్లు చేరుతుంది.
11 Ah çekip inlersin ömrünün son günlerinde, Etin, bedenin tükendiğinde.
౧౧చివరికి నీ కండరాలు, నీ శరీరం క్షీణించిపోతాయి.
12 “Eğitilmekten neden bu kadar nefret ettim, Yüreğim uyarıları neden önemsemedi?” dersin.
౧౨అప్పుడు నువ్వు, అయ్యో, ఉపదేశాన్ని నేనెందుకు లక్ష్యపెట్టలేదు? నా మనస్సాక్షి గద్దింపును ఎందుకు తిరస్కరించాను?
13 “Öğretmenlerimin sözünü dinlemedim, Beni eğitenlere kulak vermedim.
౧౩నా బోధకులు చెప్పిన మంచి మాటలు వినలేకపోయాను. నా గురువుల ఉపదేశాలను పట్టించుకోలేదు.
14 Halkın ve topluluğun arasında Tam bir yıkımın eşiğine gelmişim.”
౧౪సమాజంలో నేను అన్ని రకాల కీడులకు దగ్గరగా వచ్చాను, అని నీకు నువ్వు చెప్పుకుంటూ మధనపడతావు.
15 Suyu kendi sarnıcından, Kendi kuyunun kaynağından iç.
౧౫నీ ఇంటి బావిలో ఉబుకుతున్న నీళ్ళు, నీ సొంత కుండలోని నీళ్లు తాగు.
16 Pınarların sokakları, Akarsuların meydanları mı sulamalı?
౧౬నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా?
17 Yalnız senin olsun onlar, Paylaşma yabancılarla.
౧౭పరాయి వ్యక్తులు నీతోబాటు వాటిని అనుభవించకూడదు. ఆ నీరు నీ కోసమే ఉండాలి గదా.
18 Çeşmen bereketli olsun Ve gençken evlendiğin karınla mutlu ol.
౧౮నీ జలాశయం దీవెనలు పొందుతుంది. నీ యవ్వన కాలంలో పెళ్ళాడిన నీ భార్యతో సంతోషించు.
19 Sevimli bir geyik, zarif bir ceylan gibi, Hep seni doyursun memeleri. Aşkıyla sürekli coş.
౧౯ఆమె నీకు రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడూ తృప్తి కలిగించనియ్యి. ఆమె ప్రేమకు బద్ధుడివై చిరకాలం జీవించు.
20 Oğlum, neden ahlaksız bir kadınla coşasın, Neden başka birinin karısını koynuna alasın?
౨౦కుమారా, నువ్వు ఎందుకు వ్యభిచారిణి వలలో పడిపోయి ఉంటావు? ఆమె రొమ్మును ఎందుకు కౌగలించుకుంటావు?
21 RAB insanın tuttuğu yolu gözler, Attığı her adımı denetler.
౨౧మనుషుల ప్రవర్తన యెహోవాకు తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడు.
22 Kötü kişiyi kendi suçları ele verecek, Günahının kemendi kıskıvrak bağlayacak onu.
౨౨దుష్టుడు చేసే పనులు వాణ్ణి ఇరకాటంలో పడవేస్తాయి. వాడు తన పాప కార్యాల వల్ల శిక్షకు గురౌతాడు.
23 Aşırı ahmaklığı onu yoldan çıkaracak, Terbiyeyi umursamadığı için ölecek.
౨౩అలాంటివాడు క్రమశిక్షణ లేకపోవడం వల్ల పరమ మూర్ఖుడై దారి తప్పి నాశనానికి గురౌతాడు.

< Süleyman'In Özdeyişleri 5 >