< От Матфея святое благовествование 22 >

1 И отвещав Иисус, паки рече им в притчах, глаголя:
యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు,
2 уподобися Царствие Небесное человеку царю, иже сотвори браки сыну своему
“పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది.
3 и посла рабы своя призвати званныя на браки: и не хотяху приити.
ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు.
4 Паки посла ины рабы, глаголя: рцыте званным: се, обед мой уготовах, юнцы мои и упитанная исколена, и вся готова: приидите на браки.
అప్పుడు ఆ రాజు, ‘ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి’ అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు.
5 Они же небрегше отидоша, ов убо на село свое, ов же на купли своя:
కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు.
6 прочии же емше рабов его, досадиша им и убиша их.
మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు.
7 И слышав царь той разгневася, и послав воя своя, погуби убийцы оны и град их зажже.
కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.
8 Тогда глагола рабом своим: брак убо готов есть, званнии же не быша достойни:
అప్పుడతడు, ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు.
9 идите убо на исходища путий, и елицех аще обрящете, призовите на браки.
కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి’ అని తన దాసులతో చెప్పాడు.
10 И изшедше раби они на распутия, собраша всех, елицех обретоша, злых же и добрых: и исполнися брак возлежащих.
౧౦ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారిని, మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది.
11 Вшед же царь видети возлежащих, виде ту человека не оболчена во одеяние брачное,
౧౧“రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు.
12 и глагола ему: друже, како вшел еси семо не имый одеяния брачна? Он же умолча.
౧౨రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు.
13 Тогда рече царь слугам: связавше ему руце и нозе, возмите его и вверзите во тму кромешнюю: ту будет плачь и скрежет зубом:
౧౩కాబట్టి రాజు, ‘ఇతని కాళ్ళు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి’ అని తన పరిచారకులతో చెప్పాడు.
14 мнози бо суть звани, мало же избранных.
౧౪ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.”
15 Тогда шедше фарисее, совет восприяша, яко да обольстят Его словом.
౧౫అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు.
16 И посылают к Нему ученики своя со иродианы, глаголюще: Учителю, вемы, яко истинен еси, и пути Божию воистинну учиши, и нерадиши ни о комже: не зриши бо на лице человеком:
౧౬వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు. వారు ఆయనతో, “బోధకా, నీవు యథార్ధవంతుడివనీ, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ, ఎవరినీ లెక్క చేయవనీ, ఎలాటి పక్షపాతం చూపవనీ మాకు తెలుసు.
17 рцы убо нам, что Ти ся мнит? Достойно ли есть дати кинсон кесареви, или ни?
౧౭సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు” అని అడిగారు.
18 Разумев же Иисус лукавство их, рече: что Мя искушаете, лицемери?
౧౮యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, “కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు?
19 Покажите Ми златицу кинсонную. Они же принесоша Ему пенязь.
౧౯ఏదీ, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి” అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు.
20 И глагола им: чий образ сей и написание?
౨౦ఆయన, “దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారినడిగాడు. వారు, “అవి సీజరు చక్రవర్తివి” అన్నారు.
21 (И) глаголаша Ему: кесарев. Тогда глагола им: воздадите убо кесарева кесареви, и Божия Богови.
౨౧ఆయన వెంటనే, “అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అని వారితో చెప్పాడు.
22 И слышавше дивишася: и оставльше Его отидоша.
౨౨వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.
23 В той день приступиша к Нему саддукее, иже глаголют не быти воскресению, и вопросиша Его,
౨౩అదే రోజు, మరణించిన వారు తిరిగి లేవడం జరగదని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి,
24 глаголюще: Учителю, Моисей рече: аще кто умрет не имый чад, (да) поймет брат его жену его и воскресит семя брата своего:
౨౪“బోధకా, ‘ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్ళి చేసికుని తన సోదరునికి సంతానం కలిగించాలి’ అని మోషే చెప్పాడు గదా.
25 беша же в нас седмь братия: и первый оженься умре, и не имый семене, остави жену свою брату своему:
౨౫మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు.
26 такожде же и вторый, и третий, даже до седмаго:
౨౬ఈ రెండోవాడు, మూడోవాడు, తరువాత ఏడోవాడి వరకూ అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు.
27 последи же всех умре и жена:
౨౭వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది.
28 в воскресение убо, котораго от седмих будет жена? Вси бо имеша ю.
౨౮చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా?” అని అడిగారు.
29 Отвещав же Иисус рече им: прельщаетеся, не ведуще Писания, ни силы Божия:
౨౯అందుకు యేసు, “మీకు లేఖనాలూ, దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు.
30 в воскресение бо ни женятся, ни посягают, но яко Ангели Божии на небеси суть:
౩౦పునరుత్థానం జరిగిన తరువాత ఎవరూ పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు.
31 о воскресении же мертвых несте ли чли реченнаго вам Богом, глаголющим:
౩౧చనిపోయిన వారి పునరుత్థానం విషయమైతే దేవుడు, ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి’ అని చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన బ్రతికి ఉన్నవారికే దేవుడు, చనిపోయిన వారికి కాదు” అని వారితో చెప్పాడు.
32 Аз есмь Бог Авраамов, и Бог Исааков, и Бог Иаковль? Несть Бог Бог мертвых, но (Бог) живых.
౩౨
33 И слышавше народи дивляхуся о учении Его.
౩౩ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు.
34 Фарисее же слышавше, яко посрами саддукеи, собрашася вкупе.
౩౪ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు.
35 И вопроси един от них законоучитель, искушая Его и глаголя:
౩౫వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి,
36 Учителю, кая заповедь болши (есть) в законе?
౩౬“బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.
37 Иисус же рече ему: возлюбиши Господа Бога твоего всем сердцем твоим, и всею душею твоею, и всею мыслию твоею:
౩౭అందుకు యేసు, “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.
38 сия есть первая и болшая заповедь:
౩౮ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.
39 вторая же подобна ей: возлюбиши искренняго твоего яко сам себе:
౩౯‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.
40 в сию обою заповедию весь закон и пророцы висят.
౪౦ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు.
41 Собравшымся же фарисеом, вопроси их Иисус,
౪౧మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు, యేసు వారిని,
42 глаголя: что вам мнится о Христе? Чий есть Сын? Глаголаша Ему: Давидов.
౪౨“క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించాడు. వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు.
43 Глагола им: како убо Давид Духом Господа Его нарицает, глаголя:
౪౩అందుకు యేసు, “అయితే, ‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ
44 рече Господь Господеви моему: седи одесную Мене, дондеже положу враги Твоя подножие ногама Твоима?
౪౪నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు’ అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు?
45 Аще убо Давид нарицает Его Господа, како сын ему есть?
౪౫దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు?” అని వారిని అడిగాడు.
46 И никтоже можаше отвещати Ему словесе: ниже смеяше кто от того дне вопросити Его ктому.
౪౬ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అంతే కాదు, ఆ రోజు నుండి ఆయనను ఒక ప్రశ్న అడగడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు.

< От Матфея святое благовествование 22 >