< Malika 5 >

1 Vakafika umwamboijinge ija lisumbe, mulikaja lya Gerasi
వారు సముద్రం దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు.
2 Nakalingi u Yesu ye ihuma mu ngalama, akisa kwa mwene umuunhu jumonga unyalipepo lilamafu akahumile ku mbiipa.
యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు.
3 U muumhu uu akikalagha ku mbiipa. Nakwalyale uwakunkola nabe kukundindila, nambe kukunkunga ni minyololo.
వాడు స్మశానంలోనే నివసించేవాడు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు.
4 kekinga akapinywagha ni pingu na manyololo. akadumulagha amanyololo ni pingu akadenyagha. Nakwaliyale unyangufu ghwa kumulefia.
వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు.
5 Pakilo na pamwisi akikalagha ku mbiipa na kufidunda, akakolagha na kukutemateme namavue amajodofu.
వాడు స్మశానంలో, కొండల మీదా రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకొనేవాడు.
6 Ye am'bwene u Yesu pavutaali, akankimbilila na kufughama pa mwene.
వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు.
7 Akakola ni lisio ilivaha, “Lunoghile nivombe kiki, Yesu, Mwana ghwa Nguluve juno alikukyanya fijo? Nikukusuma mulitavua lya Nguluve, uleke pikumumusia.”
“యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!” అని అన్నాడు.
8 Ulwakuva yumbulile, “Ghwe lipepo lichafu uve, huma mwa muunhu uju.”
ఎందుకంటే యేసు అతనితో, “అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!” అని అన్నాడు.
9 Gwoope akamposia akati, “Ilitavua lyako veeve veeni?” Ghwope akamwamula, “Ilitavua lyango nene Ligioni, ul. wakuva tuliviinga.”
ఆయన, “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు.
10 Akampelepesia kange leka pikughadaga mu iisi jila.
౧౦అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు.
11 Ilipugha ilivaha ilya ngube lilyale pakyana pakidunda silyale sidimua,
౧౧ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.
12 ghoope ghokampelepesia, sikati, “Utusung'e mu ngube, mwetwingile munkate mu sene.”
౧౨ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని వేడుకున్నాయి.
13 Akaghatavula; amapepo amalamafu ghakahuma mwa muunhu na pikwingila mu ngube, sope sikakimbilila pasi pa kidunda na pikwingila mulisumbe, neke ilipugha lya ngube imbilima ivili sikadwivila mulisumbe
౧౩యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి.
14 Navadima ngube vakakimbila vakaluta mulikaja na mufikaja kuhumia imhola kusino sihumile na pivombeka mu likaja na mukisina. Pepano avaanhu vinga vakahuma kuta kulola kino kikahumile.
౧౪ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు.
15 Pepano vakisa kwa Yesu pe vakamwagha umuunhun juno ahasiling'ine na mapepo alyale nu nsikali ikalile pasi, afwasivue, ali nuluhala lunofu, voope va koghopa.
౧౫వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది.
16 Vala vano vakasivwene sino sivombike kwa muunhu juno alyahassiling'ine na mapepo vakakimbila kino kikahumile kwa mwene kange vwimila ingube.
౧౬అదంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు.
17 Voope vakampelepesia kuuti avuuke mu iisi jave.
౧౭వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు.
18 U Yesu ye ikwingila mu ngalava, umuunhu juno alyahasiling'ine na mapepo akampelepesiaa kuuti alutaghe palikimo nu mwene.
౧౮యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు.
19 U Yesu akankana, akati, “Lutagha kukaja na kuva nyalukolo vako, uvavule akuvombile u Mtwa, nulusungu luno akupelile.”
౧౯కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, “నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ నీపై చూపిన దయ గురించీ నీ వారికి చెప్పు” అని అన్నాడు.
20 Pepano akavuka na kuluta kupulisia imbaha sino am'bombili u Yesu mu Dekapoli, imhola isio sikava kidegho ku vooni
౨౦అతడు వెళ్ళి, యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెకపొలి ప్రాంతంలో ప్రకటించాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది.
21 Pano u Yesu alyalovwike kange imwambo ijinge, mu ngalava, ilipugha ilivaha lika kong'ana kukunsungutila, pano alyale mulubale mulisumbe.
౨౧యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది.
22 Umbaha jumo ughwa va sinagogi, akatambuluagha Yairo, akisa, ye amwaghile, akaghua pa maghulu gha mwene.
౨౨అప్పుడు యూదుల సమాజ మందిరం అధికారి ఒకడు వచ్చి యేసు పాదాల దగ్గర పడి
23 Akampelepesia fijo kange fijo, akati, “Mwalivango n'debe ghukova pifua. Nikusuma ghwise uvike uluvoko lwako pakyanya pa mwne ulwakuuti usoke akupele uvwumi ughendelele pikukala.”
౨౩“నా కూతురు చావు బతుకుల్లో ఉంది. దయచేసి నీవు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచు. ఆమె బాగుపడి బతుకుతుంది” అని దీనంగా వేడుకున్నాడు.
24 Apunakavuka palikimo nu mwene, nalilipugha ilivaha lika m'bingililaa vaka mpitagha kukunsungutila.
౨౪యేసు అతని వెంట వెళ్ళాడు. పెద్ద జనసమూహం ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది.
25 Pwe alyale umumama jumonga juno alyale ihuma idanda inaaaamu ijio jilya mpumwisia amaka kijigho na gha viili.
౨౫పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది.
26 Alya pumuike yongo kuva ghanga vinga alya vombiile ikyuma kyoni kino alyale nakyo. Neke nalyasokile nambe padebe, looli inamu jikava jifikwongelela.
౨౬ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది.
27 Akapulika imola isa Yesu. Pe akatengula kukwisa kughenda mumbele muno mwa mwene pano alyale ighenda pakate palipugha. ghwope akagusa umwenda ghwa mwene.
౨౭యేసు బాగు చేస్తాడని విని, సమూహంలో నుండి యేసు వెనుకగా వచ్చింది.
28 wakuva akajovile, Nane ninga guse ghamenda ghake ni soka, niva mwumi.”
౨౮తన మనసులో, “నేను ఆయన బట్టలు తాకితే చాలు, నాకు నయమౌతుంది” అని అనుకుని, ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రం తాకింది.
29 Ye agusile, idanda jikabuhilapihuma, akivoona mumbili ghwake asokile kuhuma munamu jila.
౨౯వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమె గ్రహించింది.
30 Unsiki ghughuo u Yesu akivona mu m'bili ghwake sihumile ingufu. Akyasyetuka imbale soni mulipugha pe akaposia, “Ghwe veeni juno abasisie u mwenda ghwango?”
౩౦వెంటనే యేసు తనలో నుండి శక్తి బయలువెళ్ళిందని గ్రహించి, ప్రజలవైపు తిరిగి, “నా బట్టలు తాకినదెవరు?” అని అన్నాడు.
31 Avavulanisivua vaake vaka mwamula, “Ulivwene ilipugha ilili likikupita lisyungutile, najuve ghuti, ghweveeni juno ikukwabasia?
౩౧ఆయన శిష్యులు, “ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా! అయినా ‘నన్ను తాకినది ఎవరు?’ అంటున్నావేమిటి!” అన్నారు.
32 Looli u Yesu akava ifilolesia ulwakuuti ankagule juno amwabasisie.
౩౨కాని యేసు, తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు.
33 Umukijuuva, akakagula lunoluhumile kwa mwene, akoghopa na pihilila. Akalukagula pe akaghua pasi pamwene akolelela sooni sino sivombike.
౩౩ఆ స్త్రీ తాను బాగుపడ్డానని గ్రహించి, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి, జరిగిందంతా చెప్పింది.
34 Akajova kwa mwene, “Mwalivango usokile vwimila ulwitiko lwako. Ulutaghe nulutangano inamu jako jisoke lwoni
౩౪ఆయన ఆమెతో, “అమ్మాయీ! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది. రోగనివారణ కలిగి శాంతిగా తిరిగి వెళ్ళు” అన్నాడు.
35 Pano alyale ijova, valisile avaanhu vamo kuhuma kwa ngoyo wa Sinagogi, vakaati, “Umwalivo afuile. Kiki ghuku n'gasia um'bulanisi?”
౩౫యేసు ఇంకా మాట్లాడుతుండగా, యూదుల సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి యాయీరుతో, “నీ కూతురు చనిపోయింది. ఇంక గురువుకు బాధ కలిగించడం ఎందుకు?” అని అన్నారు.
36 Looli u Yesu ye akipulike kino valyajovile, akambula um'baha ghwa sinagogi, “Uloghopagha. Itikagha.”
౩౬యేసు వారి మాటలు పట్టించుకోకుండా, వెంటనే సమాజ మందిరం అధికారితో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు” అన్నాడు.
37 Akavakana vooni kulutania naghwope, looli akantoola u Petro, Yakobo, nu Yohana navanyalukolo va Yakobo.
౩౭అప్పుడాయన పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట రానివ్వలేదు.
38 Vakisilepakaja pa m'baha ghwa va sinagogi ghwope akalivona ili batu, kukola na kulila.
౩౮ఆయన యాయీరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ, రోదిస్తూ ఉండడం యేసు చూశాడు.
39 Ye ingile mu nyuma, akavaposia akati, “Kiki musukunile kange kiki mulila? Umwana nahwile looli ighona.”
౩౯ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో, “ఎందుకు గాభరా పడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే” అన్నాడు.
40 Vakanseka, looli umwene akavahumia vooni kunji, akavatola ava pafi nava vulanisivua vala, kingila munkaate muno mwealyale u mwana.
౪౦కాని, వారు ఆయనను హేళన చేశారు. యేసు వారందర్నీ బయటకు పంపిన తరువాత ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకుని ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు.
41 Akankola uluvoko lwa mwana akati, “Talitha koum,” kwekuuti, “Ggwe minja uve nikukuvula, simuka.”
౪౧ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, “తలితా కుమీ!” అని అన్నాడు. ఆ మాటకు, “చిన్నపాపా! నీతో నేనంటున్నాను, లే!” అని అర్థం.
42 Unsiki ghughuo umwana jula akasimuka na na pighenda (ulwakuva alyale na maka kijigho na ghaviili). nakalinga vakakoluo ni nganighani na nuludegho luvaha.
౪౨వెంటనే ఆమె లేచి నడిచింది. ఆమె వయస్సు పన్నెండేళ్ళు. ఇది చూసి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది.
43 Akavakana ku ngufu kuuti nalunoghile umuunhu ghweni akagule imbombo jino jivombika apa. Akavavuula kuuti vampele uminja jula ikyakulia.
౪౩ఈ సంగతి ఎవ్వరికి చెప్పవద్దని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా ఇవ్వమని వారితో చెప్పాడు.

< Malika 5 >