< Mezmurlar 92 >

1 Mezmur - Şabat Günü için ilahi Ya RAB, sana şükretmek, Ey Yüceler Yücesi, adını ilahilerle övmek, Sabah sevgini, Gece sadakatini, On telli sazla, çenk ve lirle duyurmak ne güzel!
విశ్రాంతి దినం కోసం పాట, ఒక కీర్తన. యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.
2
ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.
3
పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది.
4 Çünkü yaptıklarınla beni sevindirdin, ya RAB, Ellerinin işi karşısında sevinç ilahileri okuyorum.
ఎందుకంటే యెహోవా, నీ పనులతో నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతిపనులబట్టి నేను ఆనందంగా పాడతాను.
5 Yaptıkların ne büyüktür, ya RAB, Düşüncelerin ne derin!
యెహోవా, నీ పనులు ఘనమైనవి! నీ ఆలోచనలు ఎంతో లోతైనవి.
6 Aptal insan bilemez, Budala akıl erdiremez:
పశుప్రాయులకు ఇవేమీ తెలియదు. తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు.
7 Kötüler mantar gibi bitse, Suçlular pıtrak gibi açsa bile, Bu onların sonsuza dek yok oluşu demektir.
దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా!
8 Ama sen sonsuza dek yücesin, ya RAB.
అయితే యెహోవా, నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు.
9 Ya RAB, düşmanların kesinlikle, Evet, kesinlikle yok olacak, Suç işleyen herkes dağılacak.
యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు.
10 Beni yaban öküzü kadar güçlü kıldın, Taze zeytinyağını başıma döktün.
౧౦అడవి దున్న కొమ్ముల్లాగా నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు.
11 Gözlerim düşmanlarımın bozgununu gördü, Kulaklarım bana saldıran kötülerin sonunu duydu.
౧౧నా శత్రువుల అధోగతిని నా కన్నులు చూశాయి. దుష్టులైన నా విరోధుల పతనం నా చెవులు విన్నాయి.
12 Doğru insan hurma ağacı gibi serpilip gelişecek, Lübnan sediri gibi yükselecek.
౧౨నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు.
13 RAB'bin evinde dikilmiş olarak Tanrımız'ın avlularında serpilip büyüyecek.
౧౩వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు.
14 Böyleleri yaşlanınca da meyve verecek, Taptaze ve yeşil kalacaklar.
౧౪యెహోవా యథార్థవంతుడని తెలియచేయడం కోసం వాళ్ళు ముసలితనంలో కూడా ఫలిస్తారు. తాజాగా పచ్చగా ఉంటారు.
15 “RAB doğrudur! Kayamdır benim! O'nda haksızlık bulunmaz!” diye duyuracaklar.
౧౫ఆయనే నా ఆధార శిల, ఆయనలో ఎలాంటి అన్యాయమూ లేదు.

< Mezmurlar 92 >