< Mezmurlar 59 >

1 Müzik şefi için - “Yok Etme” makamında Davut'un Miktamı - Saul'un Davut'u öldürtmek için adam gönderip evini gözetlediği zaman Kurtar beni düşmanlarımdan, ey Tanrım, Kalem ol hasımlarıma karşı.
ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు పంపిన మనుషులు ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం). నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు.
2 Kurtar beni suç işleyenlerden, Uzak tut kanlı katillerden.
పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు.
3 Bak, canımı almak için pusu kuruyorlar, Güçlüler bana karşı birleşiyorlar, Oysa başkaldırmadım, günahım yok, ya RAB.
నా ప్రాణం తీయడానికి వారు కాపుకాశారు. యెహోవా, నేను దోషం చేసినందుకో, పాపం చేసినందుకో కాదు.
4 Suç işlemediğim halde, Koşuşup hazırlanıyorlar. Kalk bana yardım etmek için, halime bak!
నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదికి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు. లేచి నాకు సహాయం చెయ్యి.
5 Sen, ya RAB, Her Şeye Egemen Tanrı, İsrail'in Tanrısı, Uyan bütün ulusları cezalandırmak için, Acıma bu suçlu hainlere! (Sela)
సేనల ప్రభువైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, అన్యజాతులను శిక్షించడానికి మేలుకో. ఆ దుర్మార్గుల్లో ఎవరినీ కనికరించవద్దు.
6 Akşam döner, köpek gibi hırlayıp Sinsi sinsi kenti dolaşırlar.
సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
7 Bak, neler dökülür ağızlarından, Kılıç çıkar dudaklarından. “Kim duyacak?” derler.
మన మాటలు ఎవరు వింటారులే అనుకుని వారు తమ నోటితో మాటలు వెళ్లగక్కుతారు. వారి పెదాల్లో కత్తులున్నాయి.
8 Ama sen onlara gülersin, ya RAB, Bütün uluslarla eğlenirsin.
అయితే యెహోవా, నువ్వు వాళ్ళను చూసి నవ్వుతావు. అన్యజాతులను నువ్వు ఎగతాళి చేస్తావు.
9 Gücüm sensin, seni gözlüyorum, Çünkü kalemsin, ey Tanrı.
దేవా, నా బలమా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నా ఎత్తయిన బురుజు నువ్వే.
10 Tanrım sevgisiyle karşılar beni, Bana düşmanlarımın yıkımını gösterir.
౧౦నా దేవుడు తన నిబంధన నమ్మకత్వంలో నన్ను కలుసుకుంటాడు. నా శత్రువులకు జరిగిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు.
11 Onları öldürme, yoksa halkım unutur, Gücünle dağıt ve alçalt onları, Ya Rab, kalkanımız bizim.
౧౧వారిని చంపొద్దు. ఎందుకంటే నా ప్రజలు దాన్ని మరచిపోతారేమో. మా ధ్వజం లాంటి నువ్వు నీ బలంతో వారిని చెల్లాచెదరు చేసి అణగ గొట్టు.
12 Ağızlarının günahı, dudaklarından çıkan söz yüzünden, Gururlarının tuzağına düşsünler. Okudukları lanet, söyledikleri yalan yüzünden
౧౨వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి.
13 Yok et onları gazabınla, yok et, tükensinler; Bilsinler ki, Tanrı'nın Egemenliği Yakup soyundan Yeryüzünün ucuna kadar ulaşır. (Sela)
౧౩వారు ఇకపై కనబడకుండా పోయేలా కోపంతో వారిని నిర్మూలించు. దేవుడు యాకోబు సంతానాన్ని ఏలుతున్నాడని భూదిగంతాల వరకూ మనుషులు తెలుసుకునేలా చెయ్యి.
14 Akşam döner, köpek gibi hırlayıp Sinsi sinsi kenti dolaşırlar.
౧౪సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
15 Yiyecek bulmak için gezerler, Doymazlarsa ulurlar.
౧౫తిండికోసం అటూ ఇటూ తిరుగుతారు. ఇంకా తృప్తి కలగకపోతే రాత్రి అంతా కనిపెడతారు.
16 Bense gücün için sabah ezgiler söyleyecek, Sevgini sevinçle dile getireceğim. Çünkü sen bana kale, Sıkıntılı günümde sığınak oldun.
౧౬నీవు నాకు ఎత్తయిన బురుజుగా ఉన్నావు. ఆపద రోజున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలాన్ని గూర్చి నేను కీర్తిస్తాను. ఉదయాన నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను.
17 Gücüm sensin, seni ilahilerle öveceğim, Çünkü kalem, beni seven Tanrı sensin.
౧౭దేవుడు నాకు ఎత్తయిన కోటగా, నిబంధనా దేవుడుగా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తిస్తాను.

< Mezmurlar 59 >