< Mezmurlar 48 >

1 İlahi - Korahoğulları'nın mezmuru RAB büyüktür ve yalnız O övülmeye değer Tanrımız'ın kentinde, kutsal dağında.
ఒక పాట, కోరహు వారసుల కీర్తన. మన దేవుని పట్టణంలో తన పరిశుద్ధ పర్వతంపై యెహోవా గొప్పవాడు. అత్యధికంగా ఆయన్ని స్తుతించాలి.
2 Yükselir zarafetle, Bütün yeryüzünün sevinci Siyon Dağı, Safon'un doruğu, ulu Kral'ın kenti.
అది మన దేవుని మహా పట్టణం. ఉత్తరం వైపున ఉన్న సీయోను పర్వతం. దాని ఉచ్ఛ దశ ఎంతో సుందరంగా ఉంది. అది భూమి అంతటికీ ఆనందదాయకంగా ఉంది.
3 Tanrı onun kalelerinde Sağlam kule olarak gösterdi kendini.
దాని భవనాలలో దేవుడు తనను ఆశ్రయంగా తెలియజేసుకుంటున్నాడు.
4 Krallar toplandı, Birlikte Siyon'un üzerine yürüdüler.
చూడండి, రాజులు సమకూడారు. వాళ్ళంతా కలసి వచ్చారు.
5 Ama onu görünce şaşkına döndüler, Dehşete düşüp kaçtılar.
వాళ్ళు దాన్ని చూశారు. ఆశ్చర్యపోయారు. తర్వాత వ్యాకులపడ్డారు. గబగబా అక్కణ్ణించి వెళ్ళిపోయారు.
6 Doğum sancısı tutan kadın gibi, Bir titreme aldı onları orada.
వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళలో వణుకు పుట్టింది. ప్రసవించబోయే స్త్రీకి కలిగే నొప్పుల్లాటి వేదన వాళ్లకు కలిగింది.
7 Doğu rüzgarının parçaladığı ticaret gemileri gibi Yok ettin onları.
తూర్పుగాలిని నువ్వు రేపి దానితో తర్షీషు ఓడలను పగలగొడుతున్నావు.
8 Her Şeye Egemen RAB'bin kentinde, Tanrımız'ın kentinde, Nasıl duyduksa, öyle gördük. Tanrı onu sonsuza dek güvenlik içinde tutacak. (Sela)
సేనల ప్రభువైన యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో మనం ఏదైతే విన్నామో దానినే చూశాం. దేవుడు దాన్ని కలకాలం ఉండేలా స్థిరం చేశాడు.
9 Ey Tanrı, tapınağında, Ne kadar vefalı olduğunu düşünüyoruz.
దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం.
10 Adın gibi, ey Tanrı, övgün de Dünyanın dört bucağına varıyor. Sağ elin zafer dolu.
౧౦దేవా, నీ నామం గొప్పదైనట్టు నీ కీర్తి కూడా భూమి అంచులవరకూ గొప్పగా ఉంది. నీతి న్యాయాలతో నీ కుడిచెయ్యి నిండి ఉంది.
11 Sevinsin Siyon Dağı, Coşsun Yahuda kentleri Senin yargılarınla!
౧౧న్యాయమైన నీ శాసనాలను బట్టి సీయోను పర్వతం సంతోషించనీ. యూదా కుమార్తెలను ఆనందించనీ.
12 Siyon'un çevresini gezip dolanın, Kulelerini sayın,
౧౨సీయోను పర్వతం చుట్టూ తిరుగు. దాని చుట్టూ తిరుగుతూ ఆమె గోపురాలను లెక్కించు.
13 Surlarına dikkatle bakın, Kalelerini yoklayın ki, Gelecek kuşağa anlatasınız:
౧౩తర్వాత తరం వాళ్ళకు దాని గురించి చెప్పడానికై ఆమె గోడలను పరిశీలించు. ఆమె భవనాలను చూడు.
14 Bu Tanrı sonsuza dek bizim Tanrımız olacak, Bize hep yol gösterecektir.
౧౪ఈ దేవుడు నిరంతరం మనకు దేవుడుగా ఉన్నాడు. మరణం వరకూ ఆయన మనలను నడిపిస్తాడు.

< Mezmurlar 48 >