< Mezmurlar 25 >

1 Davut'un mezmuru Ya RAB, bütün varlığımla sana yaklaşıyorum,
దావీదు కీర్తన. యెహోవా, నీ కోసం నా ప్రాణం పైకెత్తుతున్నాను.
2 Ey Tanrım, sana güveniyorum, utandırma beni, Düşmanlarım zafer kahkahası atmasın!
నా దేవా, నీలో నా నమ్మకం ఉంచాను. నన్ను సిగ్గుపడనివ్వకు. నా మీద నా శత్రువులకు జయోత్సాహం కలగనివ్వకు.
3 Sana umut bağlayan hiç kimse utanca düşmez; Nedensiz hainlik edenler utanır.
నీ కోసం నమ్మకంతో ఎదురు చూసే వాళ్ళు ఎవ్వరూ అవమానం పొందరు. అకారణంగా ద్రోహం చేసే వాళ్ళే సిగ్గు పడతారు.
4 Ya RAB, yollarını bana öğret, Yönlerini bildir.
యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజెయ్యి. నీ త్రోవలు నాకు నేర్పించు.
5 Bana gerçek yolunda öncülük et, eğit beni; Çünkü beni kurtaran Tanrı sensin. Bütün gün umudum sende.
నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.
6 Ya RAB, sevecenliğini ve sevgini anımsa; Çünkü onlar öncesizlikten beri aynıdır.
యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి.
7 Gençlik günahlarımı, isyanlarımı anımsama, Sevgine göre anımsa beni, Çünkü sen iyisin, ya RAB.
బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో.
8 RAB iyi ve doğrudur, Onun için günahkârlara yol gösterir.
యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.
9 Alçakgönüllülere adalet yolunda öncülük eder, Kendi yolunu öğretir onlara.
దీనులను న్యాయంగా నడిపిస్తాడు, దీనులకు తన మార్గం బోధిస్తాడు.
10 RAB'bin bütün yolları sevgi ve sadakate dayanır Antlaşmasındaki buyruklara uyanlar için.
౧౦ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనాలు పాటించిన వాళ్లకు యెహోవా త్రోవలన్నీ నిబంధన నమ్మకత్వంతోనూ, విశ్వసనీయతతోనూ నిర్మాణం అయ్యాయి.
11 Ya RAB, adın uğruna Suçumu bağışla, çünkü suçum büyük.
౧౧యెహోవా, నీ నామాన్నిబట్టి నా పాపం క్షమించు. ఎందుకంటే అది చాలా ఘోరం.
12 Kim RAB'den korkarsa, RAB ona seçeceği yolu gösterir.
౧౨యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాడు ఎవరు? అతడు కోరుకోవలసిన మార్గం ఆయన అతనికి నిర్దేశిస్తాడు.
13 Gönenç içinde yaşayacak o insan, Soyu ülkeyi sahiplenecek.
౧౩అతని ప్రాణం సంతోషంగా ఉంటుంది. అతని సంతానం దేశానికి వారసులవుతారు.
14 RAB kendisinden korkanlarla paylaşır sırrını, Onlara açıklar antlaşmasını.
౧౪ఆయనపట్ల భయభక్తులు గల వారికి యెహోవా ఆలోచన తెలుస్తుంది, ఆయన తన నిబంధన వాళ్లకు తెలియజేస్తాడు.
15 Gözlerim hep RAB'dedir, Çünkü ayaklarımı ağdan O çıkarır.
౧౫నా కళ్ళు ఎప్పుడూ యెహోవా మీదే ఉన్నాయి, ఎందుకంటే ఆయన నా పాదాలను వలలోనుంచి విడిపిస్తాడు.
16 Halime bak, lütfet bana; Çünkü garip ve mazlumum.
౧౬నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి.
17 Yüreğimdeki sıkıntılar artıyor, Kurtar beni dertlerimden!
౧౭నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు.
18 Üzüntüme, acılarıma bak, Bütün günahlarımı bağışla!
౧౮నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు.
19 Düşmanlarıma bak, ne kadar çoğaldılar, Nasıl da benden nefret ediyorlar!
౧౯నా శత్రువులను చూడు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రూరమైన ద్వేషంతో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు.
20 Canımı koru, kurtar beni! Hayal kırıklığına uğratma, çünkü sana sığınıyorum!
౨౦నా ప్రాణం కాపాడి నన్ను రక్షించు. నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నీ ఆశ్రయం కోరుతున్నాను.
21 Dürüstlük, doğruluk korusun beni, Çünkü umudum sendedir.
౨౧నీ కోసం నేను కనిపెడుతున్నాను గనక యథార్థత, నిర్దోషత్వం నన్ను సంరక్షిస్తాయి గాక.
22 Ey Tanrı, kurtar İsrail'i Bütün sıkıntılarından!
౨౨దేవా, తన బాధలన్నిటిలో నుంచి ఇశ్రాయేలును రక్షించు.

< Mezmurlar 25 >