< Mezmurlar 11 >

1 Müzik şefi için - Davut'un mezmuru Ben RAB'be sığınırım, Nasıl dersiniz bana, “Kuş gibi kaç dağlara.
ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన. నేను యెహోవాలో ఆశ్రయం కోరాను. పక్షిలాగా కొండల్లోకి ఎగిరిపో, అని నువ్వు నా ప్రాణంతో ఎందుకు చెబుతావు?
2 Bak, kötüler yaylarını geriyor, Temiz yürekli insanları Karanlıkta vurmak için Oklarını kirişine koyuyor.
ఎందుకంటే, చూడు! దుర్మార్గులు విల్లెక్కుపెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థహృదయుల మీద వెయ్యడానికి తమ బాణాలు వింటి నారికి తగిలించి సిద్ధంగా ఉన్నారు.
3 Temeller yıkılırsa, Ne yapabilir doğru insan?”
పునాదులు పాడైపోతే న్యాయవంతులు ఏం చెయ్యగలరు?
4 RAB kutsal tapınağındadır, O'nun tahtı göklerdedir, Bütün insanları görür, Herkesi sınar.
యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. ఆయన కళ్ళు గమనిస్తున్నాయి. ఆయన కళ్ళు మనుషులను పరిశీలన చేస్తున్నాయి.
5 RAB doğru insanı sınar, Kötüden, zorbalığı sevenden tiksinir.
యెహోవా న్యాయవంతులనూ, దుర్మార్గులనూ, ఇద్దరినీ పరిశీలన చేస్తున్నాడు. హింసించడం పనిగా పెట్టుకున్న వాళ్ళను ఆయన ద్వేషిస్తాడు.
6 Kötülerin üzerine kızgın korlar ve kükürt yağdıracak, Paylarına düşen kâse kavurucu rüzgar olacak.
దుర్మార్గుల మీద ఆయన రగులుతున్న నిప్పు కణికెలు, అగ్నిగంధకం కురిపిస్తాడు. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీయభాగం అవుతుంది.
7 Çünkü RAB doğrudur, doğruları sever; Dürüst insanlar O'nun yüzünü görecek.
ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. ఆయన నీతిన్యాయాలను ప్రేమిస్తాడు. నిజాయితీపరులు ఆయన ముఖం చూస్తారు.

< Mezmurlar 11 >