< Süleyman'In Özdeyişleri 26 >

1 Yaz ortasında kar, hasatta yağmur uygun olmadığı gibi, Akılsıza da onur yakışmaz.
ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు.
2 Öteye beriye uçuşan serçe Ve kırlangıç gibi, Hak edilmemiş lanet de tutmaz.
రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతున్న పిచ్చుక, రివ్వున ఎగిరిపోయే వానకోయిల ఎలా నేలకు దిగవో అలానే శాపానికి అర్హుడు కాని వాడికి శాపం తగలదు.
3 Ata kırbaç, eşeğe gem, Akılsızın sırtına da değnek gerek.
గుర్రానికి చెర్నాకోల. గాడిదకు కళ్ళెం. మూర్ఖుల వీపుకు బెత్తం.
4 Akılsıza ahmaklığına göre karşılık verme, Yoksa sen de onun düzeyine inersin.
మూర్ఖుడి మూఢత చొప్పున వాడికి జవాబు ఇవ్వద్దు. అలా ఇస్తే నువ్వు కూడా వాడి లాగానే ఉంటావు.
5 Akılsıza ahmaklığına uygun karşılık ver, Yoksa kendini bilge sanır.
వాడి మూర్ఖత్వం చొప్పున మూర్ఖుడికి జవాబివ్వు. అలా చేయకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకుంటాడు.
6 Akılsızın eliyle haber gönderen, Kendi ayaklarını kesen biri gibi, Kendine zarar verir.
మూర్ఖుడితో కబురు పంపేవాడు కాళ్లు తెగగొట్టుకుని విషం తాగిన వాడితో సమానం.
7 Akılsızın ağzında özdeyiş, Kötürümün sarkan bacakları gibidir.
అవిటి వాడి కాళ్ళలో బలం ఉండదు. బుద్ధిలేని వాడి నోటిలో సామెత కూడా అంతే.
8 Akılsızı onurlandırmak, Taşı sapana bağlamak gibidir.
బుద్ధిలేని వాణ్ణి గొప్ప చేసే వాడు వడిసెలలో రాయి కదలకుండా కట్టేసే వాడితో సమానం.
9 Sarhoşun elindeki dikenli dal ne ise, Akılsızın ağzında özdeyiş de odur.
మూర్ఖుల నోట సామెత మత్తులో ఉన్న వాడి చేతిలో ముల్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది.
10 Oklarını gelişigüzel fırlatan okçu neyse, Yoldan geçen akılsızı ya da sarhoşu ücretle tutan da öyledir.
౧౦బుద్ధిలేని వాణ్ణి, లేదా అటుగా వెళ్తూ ఉండే ఎవరో ఒకరిని కూలికి పెట్టుకునే వాడు అందరినీ గాయపరచే విలుకాడితో సమానం.
11 Ahmaklığını tekrarlayan akılsız, Kusmuğuna dönen köpek gibidir.
౧౧తన మూర్ఖత్వాన్ని పదేపదే బయట పెట్టుకునే వాడు కక్కిన దాన్ని తినడానికి తిరిగే కుక్కతో సమానం.
12 Kendini bilge gören birini tanıyor musun? Akılsız bile ondan daha umut vericidir.
౧౨తానే జ్ఞాని అనుకునే వాణ్ణి చూసావా? వాణ్ణి సరి చేయడం కంటే మూర్ఖుణ్ణి సరి చేయడం తేలిక.
13 Tembel, “Yolda aslan var, Sokaklarda aslan dolaşıyor” der.
౧౩సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు బయట సింహం పొంచి ఉంది” అంటాడు.
14 Menteşeleri üzerinde dönen kapı gibi, Tembel de yatağında döner durur.
౧౪బందుల మీద తలుపు తిరుగుతుంది. తన మంచం మీద సోమరి అటూ ఇటూ పొర్లుతాడు.
15 Tembel elini sahana daldırır, Yeniden ağzına götürmeye üşenir.
౧౫కంచంలో సోమరి తన చెయ్యి ముంచుతాడు. దాన్ని తిరిగి నోటికి ఎత్తుకోవడం అతనికి బద్ధకం.
16 Tembel kendini, Akıllıca yanıt veren yedi kişiden daha bilge sanır.
౧౬సహేతుకమైన కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తానే జ్ఞానిననుకుంటాడు.
17 Kendini ilgilendirmeyen bir kavgaya bulaşan kişi, Yoldan geçen köpeği kulaklarından tutana benzer.
౧౭తనకు సంబంధంలేని పోట్లాటలో తల దూర్చేవాడు. దారినపోయే కుక్క చెవులు పట్టుకొనే వాడితో సమానం.
18 Ateşli ve öldürücü oklar savuran bir deli neyse, Komşusunu aldatıp, “Şaka yapıyordum” Diyen de öyledir.
౧౮తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేశాననే వాడు నిప్పు బాణాలు విసిరే వెర్రి వాడితో సమానం.
౧౯
20 Odun bitince ateş söner, Dedikoducu yok olunca kavga diner.
౨౦కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది. కొండేలు చెప్పేవాడు లేకపొతే జగడం చల్లారుతుంది.
21 Kor için kömür, ateş için odun neyse, Çekişmeyi alevlendirmek için kavgacı da öyledir.
౨౧నిప్పు కణికెలకు బొగ్గులు, అగ్నికి కట్టెలు. పోట్లాటలు రేపడానికి కలహప్రియుడు.
22 Dedikodu tatlı lokma gibidir, İnsanın ta içine işler.
౨౨కొండేలు రుచిగల పదార్థాల వంటివి. అవి కడుపులోకి మెత్తగా దిగిపోతాయి.
23 Okşayıcı dudaklarla kötü yürek, Sırlanmış toprak kaba benzer.
౨౩చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం.
24 Yüreği nefret dolu kişi sözleriyle niyetini gizlemeye çalışır, Ama içi hile doludur.
౨౪పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు.
25 Güzel sözlerine kanma, Çünkü yüreğinde yedi iğrenç şey vardır.
౨౫వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.
26 Nefretini hileyle örtse bile, Kötülüğü toplumun önünde ortaya çıkar.
౨౬వాడు తన ద్వేషాన్ని కపట వేషంతో కప్పుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బట్టబయలు అవుతుంది.
27 Başkasının kuyusunu kazan içine kendi düşer, Taşı yuvarlayan altında kalır.
౨౭గుంట తవ్వే వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాడి మీదికే అది తిరిగి వస్తుంది.
28 Yalancı dil incittiği kişilerden nefret eder, Yaltaklanan ağızdan yıkım gelir.
౨౮అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది.

< Süleyman'In Özdeyişleri 26 >