< Çölde Sayim 2 >

1 RAB Musa'yla Harun'a, “İsrailliler sancaklarının altında, aile bayraklarıyla Buluşma Çadırı'ndan biraz ötede çepeçevre konaklasın” dedi.
యెహోవా మరోసారి మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.
2
“ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో తమ దళానికి చెందిన పతాకం చుట్టూ, తన గోత్రాన్ని సూచించే చిన్నజెండా చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి అభిముఖంగా వారి గుడారాలు ఉండాలి.
3 Doğuda, gündoğusunda konaklayan bölükler Yahuda ordugahının sancağına bağlı olacak. Yahudaoğulları'nın önderi Amminadav oğlu Nahşon olacak.
యూదా శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో యూదా పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. ఇవి సన్నిధి గుడారానికి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే వైపున ఉండాలి. యూదా సైనిక దళానికి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను నాయకత్వం వహించాలి.
4 Bölüğünün sayısı 74 600 kişiydi.
యూదా దళంలో నమోదైన వారు 74, 600 మంది పురుషులు.
5 İssakar oymağı onların bitişiğinde konaklayacak. İssakaroğulları'nın önderi Suar oğlu Netanel olacak.
యూదా గోత్రం సమీపంలో ఇశ్శాఖారు గోత్రం వారు తమ శిబిరం ఏర్పాటు చేసుకోవాలి. సూయారు కొడుకు నెతనేలు ఇశ్శాఖారు గోత్రం వారి నాయకుడు.
6 Bölüğünün sayısı 54 400 kişiydi.
నెతనేలుతో ఉన్న సైన్యంలో 54, 400 మంది పురుషులు నమోదయ్యారు.
7 Sonra Zevulun oymağı konaklayacak. Zevulunoğulları'nın önderi Helon oğlu Eliav olacak.
ఇశ్శాఖారు గోత్రం వారి తరువాత జెబూలూను గోత్రం వారుండాలి. హేలోను కొడుకు ఏలీయాబు జెబూలూను గోత్రం వారి నాయకుడు.
8 Bölüğünün sayısı 57 400 kişiydi.
అతని దళంలో నమోదైన వారు 57, 400 మంది పురుషులు.
9 Yahuda ordugahına ayrılan bölüklerdeki adam sayısı 186 400 kişiydi. Yola ilk çıkacak olanlar bunlardı.
యూదా వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 86, 400 మంది పురుషులు ఉన్నారు. వీరు మొదటగా శిబిరం నుండి కదిలి వెళ్ళాలి.
10 Güneyde Ruben ordugahının sancağı dikilecek, Ruben'e bağlı bölükler orada konaklayacak. Rubenoğulları'nın önderi Şedeur oğlu Elisur olacak.
౧౦దక్షిణ దిక్కున రూబేను దళం తమ పతాకం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. షెదేయూరు కొడుకు ఏలీసూరు రూబేను సైనిక దళాలకు నాయకుడు.
11 Bölüğünün sayısı 46 500 kişiydi.
౧౧అతని సైన్యంలో నమోదైన వారు 46, 500 మంది పురుషులు.
12 Şimon oymağı onların bitişiğinde konaklayacak. Şimonoğulları'nın önderi Surişadday oğlu Şelumiel olacak.
౧౨రూబేను గోత్రం వారి పక్కనే షిమ్యోను గోత్రం వారు తమ గుడారాలు వేసుకోవాలి. సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు షిమ్యోను గోత్రం వాళ్లకు నాయకుడు.
13 Bölüğünün sayısı 59 300 kişiydi.
౧౩అతని దళంలో నమోదైన వారు 59, 300 మంది పురుషులు.
14 Sonra Gad oymağı konaklayacak. Gadoğulları'nın önderi Deuel oğlu Elyasaf olacak.
౧౪తరువాత గాదు గోత్రం ఉండాలి. రగూయేలు కుమారుడు ఏలీయాసాపు గాదు గోత్రానికి నాయకత్వం వహించాలి.
15 Bölüğünün sayısı 45 650 kişiydi.
౧౫అతని సైన్యంలో నమోదైన వారు 45, 650 మంది పురుషులు.
16 Ruben ordugahına ayrılan bölüklerdeki adam sayısı 151 450 kişiydi. İkinci sırada yola çıkacak olanlar bunlardı.
౧౬కాబట్టి రూబేను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1, 51, 450 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళంతా రెండో వరుసలో ముందుకు నడవాలి.
17 Buluşma Çadırı ve Levililer'in ordugahı göç sırasında öbür ordugahların ortasında yola çıkacak. Herkes konakladığı düzende kendi sancağı altında göç edecek.
౧౭సన్నిధి గుడారం శిబిరం నుండి మిగిలిన గోత్రాలన్నిటి మధ్యలో లేవీయులతో కలసి ముందుకు కదలాలి. వారు శిబిరంలోకి ఏ క్రమంలో వచ్చారో అదే క్రమంలో శిబిరం నుండి బయటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కడూ తన స్థానంలో ఉండాలి. తన పతాకం దగ్గరే ఉండాలి.
18 Batıda Efrayim ordugahının sancağı dikilecek, Efrayim'e bağlı bölükler orada konaklayacak. Efrayimoğulları'nın önderi Ammihut oğlu Elişama olacak.
౧౮ఎఫ్రాయిము గోత్రం సన్నిధి గుడారానికి పడమటి వైపున ఉండాలి. అమీహూదు కొడుకు ఎలీషామా ఎఫ్రాయిము సైన్యాలకు నాయకత్వం వహించాలి.
19 Bölüğünün sayısı 40 500 kişiydi.
౧౯ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40, 500 మంది పురుషులు.
20 Manaşşe oymağı onlara bitişik olacak. Manaşşeoğulları'nın önderi Pedahsur oğlu Gamliel olacak.
౨౦మనష్షే గోత్రం వారు ఎఫ్రాయిము గోత్రం వారి పక్కనే ఉండాలి. పెదాసూరు కొడుకు గమలీయేలు మనష్షే సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
21 Bölüğünün sayısı 32 200 kişiydi.
౨౧అతని సైన్యంగా నమోదైన వారు 32, 200 మంది పురుషులు.
22 Sonra Benyamin oymağı konaklayacak. Benyaminoğulları'nın önderi Gidoni oğlu Avidan olacak.
౨౨మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
23 Bölüğünün sayısı 35 400 kişiydi.
౨౩అతని సైన్యంగా నమోదైన వారు 35, 400 మంది పురుషులు.
24 Efrayim ordugahına ayrılan bölüklerdeki adam sayısı 108 100 kişiydi. Üçüncü olarak bunlar yola çıkacak.
౨౪కాబట్టి ఎఫ్రాయిము గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,08,100 మంది పురుషులు ఉన్నారు. వారింతా మూడో వరుసలో శిబిరం నుండి కదలాలి.
25 Kuzeyde Dan ordugahının sancağı dikilecek, Dan'a bağlı bölükler orada konaklayacak. Danoğulları'nın önderi Ammişadday oğlu Ahiezer olacak.
౨౫దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి.
26 Bölüğünün sayısı 62 700 kişiydi.
౨౬దాను గోత్రానికి చెందిన సైన్యంగా నమోదైన వారు 62, 700 మంది పురుషులు.
27 Aşer oymağı onların bitişiğinde konaklayacak. Aşeroğulları'nın önderi Okran oğlu Pagiel olacak.
౨౭అతనికి దగ్గరలోనే ఆషేరు గోత్రం వారు ఉండాలి. ఒక్రాను కొడుకు పగీయేలు ఆషేరు సైన్యానికి నాయకుడుగా ఉండాలి.
28 Bölüğünün sayısı 41 500 kişiydi.
౨౮అతని సైన్యంగా 41, 500 మంది పురుషులు నమోదయ్యారు.
29 Sonra Naftali oymağı konaklayacak. Naftalioğulları'nın önderi Enan oğlu Ahira olacak.
౨౯ఆషేరు గోత్రం వాళ్లకు దగ్గరలోనే నఫ్తాలి గోత్రం వారుండాలి. ఏనాను కొడుకు అహీర నఫ్తాలి గోత్రం వాళ్లకు నాయకుడిగా ఉండాలి.
30 Bölüğünün sayısı 53 400 kişiydi.
౩౦నఫ్తాలి గోత్రం వారి సైన్యంగా నమోదైన వారు 53, 400 మంది పురుషులు.
31 Dan ordugahına ayrılan adamların sayısı 157 600 kişiydi. Kendi sancakları altında en son onlar yola çıkacak.
౩౧కాబట్టి దాను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 57, 600 మంది పురుషులు ఉన్నారు. వీరు తమ ధ్వజాల ప్రకారం చివరి బృందంగా నడవాలి.”
32 Ailelerine göre sayılan İsrailliler bunlardı. Ordugahlardaki bütün bölüklerin toplamı 603 550 kişiydi.
౩౨ఇశ్రాయేలు ప్రజల్లో తమ తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. వీరు మొత్తం 6,03,550 మంది పురుషులు.
33 RAB'bin Musa'ya verdiği buyruk uyarınca Levililer öbür İsrailliler'le birlikte sayılmadı.
౩౩అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారం లేవీయుల సంఖ్య లెక్కపెట్టలేదు.
34 Böylece İsrailliler RAB'bin Musa'ya buyurduğu gibi yaptılar. Sancakları altında ordugah kurdular. Göç ederken de herkes boyu ve ailesiyle birlikte yola çıktı.
౩౪ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకి యెహోవా ఆజ్ఞాపించినదంతా చేసారు. వారు తమ తమ ధ్వజాల దగ్గర గుడారాలు వేసుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్ళినప్పుడు తమ పూర్వీకుల కుటుంబాల క్రమంలో వెళ్ళారు.

< Çölde Sayim 2 >