< Markos 7 >

1 Yeruşalim'den gelen Ferisiler ve bazı din bilginleri, İsa'nın çevresinde toplandılar.
యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ యేసు చుట్టూ గుమికూడారు.
2 O'nun öğrencilerinden bazılarının murdar, yani yıkanmamış ellerle yemek yediklerini gördüler.
వారు ఆయన శిష్యుల్లో కొందరు అశుద్ధమైన చేతులతో, అంటే ఆచార నియమం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం గమనించారు.
3 Ferisiler, hatta bütün Yahudiler, atalarının töresi uyarınca ellerini iyice yıkamadan yemek yemezler.
పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దల సంప్రదాయం ప్రకారం తమ చేతులను ఆచారరీతిగా కడుక్కోకుండా భోజనం చేయరు.
4 Çarşıdan dönünce de, yıkanmadan yemek yemezler. Ayrıca kâse, testi ve bakır kapların yıkanmasıyla ilgili başka birçok töreye de uyarlar.
వారు బయట నుండి వచ్చినపుడు స్నానం చేయకుండా భోజనం చేయరు. గిన్నెలు, కుండలు, ఇతర ఇత్తడి పాత్రలు, భోజనపు బల్లలు సహా శుద్ధి చేయడం అనే అనేకమైన ఆచారాలను వారు కచ్చితంగా పాటిస్తారు.
5 Ferisiler ve din bilginleri İsa'ya, “Öğrencilerin neden atalarımızın töresine uymuyorlar, niçin murdar ellerle yemek yiyorlar?” diye sordular.
పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు యేసుతో, “మీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు?” అని యేసును అడిగారు.
6 İsa onları şöyle yanıtladı: “Yeşaya'nın siz ikiyüzlülerle ilgili peygamberlik sözü ne kadar yerindedir! Yazmış olduğu gibi, ‘Bu halk, dudaklarıyla beni sayar, Ama yürekleri benden uzak.
యేసు వారితో, “‘ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు కాని, వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది.
7 Bana boşuna taparlar. Çünkü öğrettikleri, sadece insan buyruklarıdır.’
వారు మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం,’ అని కపట వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికింది సరైనదే!
8 Siz Tanrı buyruğunu bir yana bırakmış, insan töresine uyuyorsunuz.”
మీరు దేవుని ఆజ్ఞలను తోసిపుచ్చి మనుషుల సంప్రదాయాలకు కట్టుబడుతున్నారు.
9 İsa onlara ayrıca şunu söyledi: “Kendi törenizi sürdürmek için Tanrı buyruğunu bir kenara itmeyi ne de güzel beceriyorsunuz!
మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు.
10 Musa, ‘Annene babana saygı göstereceksin’ ve, ‘Annesine ya da babasına söven kesinlikle öldürülecektir’ diye buyurmuştu.
౧౦మోషే, ‘మీ తల్లిదండ్రులను గౌరవించమనీ, తల్లిని, తండ్రిని దూషించిన వారికి శిక్ష మరణదండన’ అనీ నియమించాడు.
11 Ama siz, ‘Eğer bir adam annesine ya da babasına, benden alacağın bütün yardım kurbandır, yani Tanrı'ya adanmıştır derse, artık annesi ya da babası için bir şey yapmasına izin yok’ diyorsunuz.
౧౧కానీ మీరైతే, ఒక వ్యక్తి తన తల్లితో, తండ్రితో ‘నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా ‘కొర్బాన్’ (అంటే దైవార్పితం)’ అని చెబితే
౧౨ఇంక ఆ వ్యక్తి తన తల్లిదండ్రుల కోసం ఏమీ చేయనక్కర లేదని చెబుతారు.
13 Böylece kuşaktan kuşağa aktardığınız törelerle Tanrı'nın sözünü geçersiz kılıyorsunuz. Buna benzer daha birçok şey yapıyorsunuz.”
౧౩మీరు మీ పెద్దల సంప్రదాయాలను పాటించే నెపంతో దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. ఇలాంటివి మరెన్నో మీరు చేస్తున్నారు.
14 İsa, halkı yine yanına çağırıp onlara, “Hepiniz beni dinleyin ve şunu belleyin” dedi.
౧౪అప్పుడు యేసు ప్రజలందరినీ తన దగ్గరికి పిలిచి, “నేను చెప్పేది ప్రతి ఒక్కరూ విని అర్థం చేసుకోండి!
15 “İnsanın dışında olup içine giren hiçbir şey onu kirletemez. İnsanı kirleten, insanın içinden çıkandır.”
౧౫బయట నుండి మనిషి లోపలికి వెళ్ళేవి ఏవీ అతన్ని అపవిత్రం చేయవు.
౧౬మనిషి లోనుండి బయటకు వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది” అని అన్నాడు.
17 İsa kalabalığı bırakıp eve girince, öğrencileri O'na bu benzetmenin anlamını sordular.
౧౭ఆయన జనసమూహన్ని విడిచి ఇంట్లో ప్రవేశించిన తరువాత ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు.
18 O da onlara, “Demek siz de anlamıyorsunuz, öyle mi?” dedi. “Dışarıdan insanın içine giren hiçbir şeyin onu kirletemeyeceğini bilmiyor musunuz?
౧౮ఆయన వారితో, “మీకు ఇంకా అర్థం కాలేదా? బయట నుండి మనిషిలోకి వచ్చేది అతన్ని అపవిత్రం చేయదని మీరు గ్రహించలేరా?
19 Dıştan giren, insanın yüreğine değil, midesine gider, oradan da helaya atılır.” İsa bu sözlerle, bütün yiyeceklerin temiz olduğunu bildirmiş oluyordu.
౧౯అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది” అని చెప్పాడు. (ఈ విధంగా చెప్పడం ద్వారా అన్ని ఆహార పదార్ధాలూ తినడానికి పవిత్రమైనవే అని యేసు సూచించాడు).
20 İsa şöyle devam etti: “İnsanı kirleten, insanın içinden çıkandır.
౨౦ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి.
21 Çünkü kötü düşünceler, fuhuş, hırsızlık, cinayet, zina, açgözlülük, kötülük, hile, sefahat, kıskançlık, iftira, kibir ve akılsızlık içten, insanın yüreğinden kaynaklanır.
౨౧ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు,
౨౨వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి.
23 Bu kötülüklerin hepsi içten kaynaklanır ve insanı kirletir.”
౨౩ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”
24 İsa oradan ayrılarak Sur bölgesine gitti. Burada bir eve girdi. Kimsenin bunu bilmesini istemiyordu, ama gizlenemedi.
౨౪యేసు ఆ ప్రాంతం విడిచి తూరు, సీదోను ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్ళాడు. తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని ఆయన ఉద్దేశం. కాని, ఆయన వారికి కనిపించకుండా ఉండలేకపోయాడు.
25 Küçük kızı kötü ruha tutulmuş bir kadın, İsa'yla ilgili haberi duyar duymaz geldi, ayaklarına kapandı.
౨౫ఒక స్త్రీ యేసు గురించి విని వచ్చి ఆయన కాళ్ళపై పడింది. ఆమె కూతురుకు దయ్యం పట్టి ఉంది.
26 Yahudi olmayan bu kadın Suriye-Fenike ırkındandı. Kızından cini kovması için İsa'ya rica etti.
౨౬ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది.
27 İsa ona, “Bırak, önce çocuklar doysunlar” dedi. “Çocukların ekmeğini alıp köpeklere atmak doğru değildir.”
౨౭అందుకు యేసు ఆమెతో, “మొదట పిల్లలు తృప్తిగా తినాలి. చిన్నపిల్లల ఆహారం తీసి కుక్కలకు వేయడం తగదు” అని అన్నాడు.
28 Kadın buna karşılık, “Haklısın, Rab” dedi. “Ama köpekler de sofranın altında çocukların ekmek kırıntılarını yer.”
౨౮అందుకామె, “ఔను ప్రభూ! అది నిజమే గాని, బల్లకింద ఉన్న కుక్కలు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా!” అని జవాబు ఇచ్చింది.
29 İsa ona, “Bu sözden ötürü cin kızından çıktı, gidebilirsin” dedi.
౨౯అప్పుడాయన ఆమెతో, “ఈ మాట చెప్పినందువల్ల ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు. దయ్యం నీ కూతురిని వదలిపోయింది” అన్నాడు.
30 Kadın evine gittiğinde çocuğunu cinden kurtulmuş, yatakta yatar buldu.
౩౦ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు తన మంచంపై పడుకుని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదలిపోయింది.
31 Sur bölgesinden ayrılan İsa, Sayda yoluyla Dekapolis bölgesinin ortasından geçerek tekrar Celile Gölü'ne geldi.
౩౧యేసు తూరు, సీదోను ప్రాంతం నుంచి బయలుదేరి దెకపొలి ప్రాంతం గుండా గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు.
32 O'na sağır ve dili tutuk bir adam getirdiler, elini üzerine koyması için yalvardılar.
౩౨అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరికి తీసుకు వచ్చి అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు.
33 İsa adamı kalabalıktan ayırıp bir yana çekti. Parmaklarını adamın kulaklarına soktu, tükürüp onun diline dokundu.
౩౩యేసు అతన్ని జనంలో నుండి పక్కకి తీసుకు వెళ్ళి తన వేళ్ళు అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి అతని నాలుకను ముట్టాడు.
34 Sonra göğe bakarak içini çekti ve adama, “Effata”, yani “Açıl!” dedi.
౩౪అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, “ఎప్ఫతా” అని అతనితో అన్నాడు. ఆ మాటకు, “తెరుచుకో!” అని అర్థం.
35 Adamın kulakları hemen açıldı, dili çözüldü ve düzgün bir şekilde konuşmaya başladı.
౩౫వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
36 İsa orada bulunanları, bunu kimseye söylememeleri için uyardı. Ama onları ne kadar uyardıysa, onlar da haberi o kadar yaydılar.
౩౬ఆ సంగతి ఎవ్వరితోనూ చెప్పవద్దని యేసు అతనికి ఆజ్ఞాపించాడు కాని, ఎంత కఠినంగా వారికి ఆజ్ఞాపించాడో అంత ఎక్కువగా వారు దాన్ని చాటించారు.
37 Halk büyük bir hayret içinde kalmıştı. “Yaptığı her şey iyi. Sağırların kulaklarını açıyor, dilsizleri konuşturuyor!” diyorlardı.
౩౭ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. వారు, “ఈయన అన్నిటినీ చక్కగా జరిగిస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా, మూగ వారు మాట్లాడేలా చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.

< Markos 7 >