< Levililer 7 >

1 “‘Çok kutsal olan suç sunusunun yasası şudur:
“అపరాధం కోసం చేసే బలి అర్పణ సంగతులు. అది ఎంతో పరిశుద్ధం.
2 Suç sunusu yakmalık sununun kesildiği yerde kesilecek ve kanı sunağın her yanına dökülecek.
దహనబలి కోసం పశువులను వధించే స్థలం లోనే అపరాధబలి పశువులను కూడా వధించాలి. దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ అన్ని వైపులా చిమ్మాలి.
3 Hayvanın bütün yağı alınacak, kuyruk yağı, bağırsak ve işkembe yağları, böbrekleri, böbrek üstü yağları, karaciğerden böbreklere uzanan perde ayrılacak.
దాని కొవ్వు పట్టిన తోకనూ, దాని అంతర్భాగాల్లోని కొవ్వునూ,
4
రెండు మూత్ర పిండాలనూ, వాటి పైని కొవ్వునూ, కాలేయం పైన పేరుకున్న కొవ్వునూ, ఇలా దానిలోని కొవ్వు అంతటినీ తీసి అర్పించాలి.
5 Kâhin bunların hepsini sunak üzerinde, RAB için yakılan sunu olarak yakacak. Bu suç sunusudur.
యాజకుడు యెహోవాకి దహనబలిగా వీటిని బలిపీఠం పైన దహించాలి. అది అపరాధం కోసం చేసే బలి. యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడూ దీన్ని తినవచ్చు.
6 Kâhinler soyundan gelen her erkek bu sunuyu yiyebilir. Sunu kutsal bir yerde yenecek, çünkü çok kutsaldır.
ఇది అతి పరిశుద్ధం. కాబట్టి పరిశుద్ధ స్థలం లోనే దీన్ని తినాలి.
7 “‘Suç ve günah sunuları için aynı yasa geçerlidir. Et, sunuyu sunarak günahı bağışlatan kâhinindir.
పాపం కోసం చేసే బలి అపరాధం కోసం చేసే బలిలానే ఉంటుంది. ఈ రెంటికీ పాటించాల్సిన చట్టం ఒకటే. ఆ బలుల్లో మిగిలిన మాంసం వాటితో పరిహారం చేసే యాజకుడికే దక్కుతుంది.
8 Yakmalık sununun derisi de sunuyu sunan kâhinindir.
దహనబలి పశువు చర్మం ఆ దహనబలిని అర్పించిన యాజకుడికి చెందుతుంది.
9 Fırında, tavada ya da sacda pişirilen her tahıl sunusu onu sunan kâhinin olacak.
పొయ్యి మీద కుండలోనైనా, పెనం మీదనైనా వండిన లేదా కాల్చిన నైవేద్యం అంతా యాజకుడికే చెందుతుంది.
10 Zeytinyağıyla yoğrulmuş ya da kuru tahıl sunuları da Harunoğulları'na aittir. Aralarında eşit olarak bölüşülecektir.’”
౧౦అది పొడి నైవేద్యమైనా, నూనె కలిపినది అయినా అదంతా అహరోను సంతానం వాళ్ళు సమానంగా పంచుకోవాలి.
11 “‘RAB'be sunulacak esenlik kurbanının yasası şudur:
౧౧ప్రజలు యెహోవాకు అర్పించే శాంతి బలిని గూర్చిన చట్టం ఇది.
12 Eğer adam sunusunu RAB'be şükretmek için sunuyorsa, sunusunun yanısıra zeytinyağıyla yoğrulmuş mayasız pideler, üzerine zeytinyağı sürülmüş mayasız yufkalar ve iyice karıştırılmış ince undan yağla yoğrulmuş mayasız pideler de sunacak.
౧౨ఎవరైనా కృతఙ్ఞత అర్పణగా దాన్ని అర్పించదలిస్తే దానితో పాటు పొంగజేసే పదార్ధం లేకుండా నూనె కలిపి చేసిన రొట్టెలూ, పొంగజేసే పదార్ధం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలూ, సన్నని పిండిలో నూనె బాగా కలిపి చేసిన రొట్టెలూ అర్పించాలి.
13 RAB'be şükretmek için, esenlik sunusunu mayalı ekmek pideleriyle birlikte sunacak.
౧౩వీటితో పాటు కృతజ్ఞతలు చెల్లించడానికి శాంతిబలి అర్పణ సమయంలో పొంగజేసే పదార్ధంతో చేసిన రొట్టెను అర్పించాలి.
14 Her sunudan birini RAB'be bağış sunusu olarak sunacak ve o sunu esenlik sunusunun kanını sunağa döken kâhinin olacak.
౧౪ఈ వేరు వేరు అర్పణల్లో నుండి ఒక దాన్ని యెహోవాకి అర్పించాలి. శాంతిబలి కోసం బలిపీఠం పైన రక్తాన్ని చిలకరించిన యాజకునికి అది చెందుతుంది.
15 RAB'be şükretmek için sunulan esenlik kurbanının eti, sununun sunulduğu gün yenecek, sabaha bırakılmayacak.
౧౫కృతజ్ఞతలు చెల్లించే ఉద్దేశ్యంతో శాంతిబలిని అర్పించే వ్యక్తి బలిపశువు మాంసాన్ని బలి అర్పించే రోజే తినాలి. దాంట్లో దేన్నీ తరువాత రోజు కోసం ఉంచుకోకూడదు.
16 “‘Biri gönülden verilen bir sunu ya da dilediği adağı sunmak istiyorsa, kurbanın eti sununun sunulduğu gün yenecek, artakalırsa ertesi güne bırakılabilecek.
౧౬అయితే మొక్కు చెల్లించడం కోసం గానీ, స్వేచ్ఛార్పణ చెల్లించడం కోసం గానీ బలి ఇస్తే ఆ పశువు మాంసాన్ని బలి అర్పణ రోజే తినాలి. కానీ ఏదన్నా మిగిలితే దాన్ని రెండోరోజు కూడా తినవచ్చు.
17 Ancak üçüncü güne bırakılan kurban eti yakılacak.
౧౭మూడో రోజుకి ఇంకా మిగిలి ఉన్న మాంసాన్ని కాల్చి వేయాలి.
18 Esenlik kurbanının eti üçüncü gün yenirse sunu kabul edilmeyecek, geçerli sayılmayacak. Çünkü et kirlenmiş sayılır ve her yiyen suçunun cezasını çekecektir.
౧౮ఎవరన్నా శాంతిబలి పశువు మాంసాన్ని ఏ కొంచెమైనా మూడోరోజు కూడా తింటే ఆ బలి అంగీకారానికి నోచుకోదు. ఆ బలి అర్పణ తెచ్చిన వాడి లెక్కలోకి రాదు. అది అసహ్యకరంగా ఉంటుంది. అలా తినేవాడు తన అపరాధాన్ని మోస్తూనే ఉంటాడు.
19 “‘Kirli sayılan herhangi bir şeye dokunan et yenmemeli, yakılmalıdır. Öteki etlere gelince, temiz sayılan bir insan o etlerden yiyebilir.
౧౯అపవిత్రమైన దానికి తగిలిన మాంసాన్ని తిన కూడదు. దాన్ని కాల్చివేయాలి. మిగిలిన మాంసం పవిత్రులైన వాళ్ళు తినవచ్చు.
20 Ama biri kirli sayıldığı sürece RAB'be sunulan esenlik kurbanının etini yerse, halkın arasından atılacak.
౨౦యెహోవాకు అర్పించే శాంతిబలి పశువు మాంసాన్ని ఎవరైనా అపవిత్రుడిగా ఉండి కొంచెం తిన్నా అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.
21 Ayrıca kirli sayılan herhangi bir şeye, insandan kaynaklanan bir kirliliğe, kirli bir hayvana ya da kirli ve iğrenç bir şeye dokunup da RAB'be sunulan esenlik kurbanının etinden yiyen biri halkın arasından atılacak.’”
౨౧మనుష్యుల అపవిత్రతనైనా, ఏదన్నా జంతువు అపవిత్రతనైనా, లేదా అపవిత్రమైన, అసహ్యకరమైన వస్తువునైనా తాకి దాని తరువాత ఎవరైనా యెహోవాకి అర్పించే శాంతిబలి పశువు మాంసం తింటే అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.”
22 RAB Musa'ya şöyle dedi:
౨౨ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
23 “İsrail halkına de ki, ‘İster sığır, ister koyun ya da keçi yağı olsun, hayvan yağı yemeyeceksiniz.
౨౩“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ఎద్దు కొవ్వును గానీ, గొర్రె కొవ్వును గానీ, మేక కొవ్వును గానీ మీరు తిన కూడదు.
24 Kendiliğinden ölen ya da yabanıl hayvanların parçaladığı bir hayvanın yağı başka şeyler için kullanılabilir, ama hiçbir zaman yenmemeli.
౨౪అర్పణం కాకుండా సాధారణంగా చనిపోయిన పశువు కొవ్వునూ, అడవి మృగాలు చీల్చి వేసిన పశువు కొవ్వునూ ఇతర విషయాలకు ఉపయోగించవచ్చు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.
25 Kim yakılan ve RAB'be sunulan hayvanlardan birinin yağını yerse, halkımın arasından atılacak.
౨౫యెహోవాకి దహనబలిగా ప్రజలు అర్పించే పశువుల కొవ్వుని తినేవాడు ప్రజల్లో లేకుండా పోవాలి.
26 Nerede yaşarsanız yaşayın, hiçbir kuşun ya da hayvanın kanını yemeyeceksiniz.
౨౬అలాగే పక్షి రక్తం గానీ, జంతువు రక్తం గానీ మీ ఇళ్ళల్లో తినకూడదు.
27 Kan yiyen herkes halkımın arasından atılacak.’”
౨౭ఎవడు రక్తాన్ని తింటాడో వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.”
28 RAB Musa'ya şöyle dedi:
౨౮ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
29 “İsrail halkına de ki, ‘RAB'be esenlik kurbanı sunmak isteyen biri, esenlik kurbanının bir parçasını RAB'be sunmalı.
౨౯“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, యెహోవాకి శాంతిబలి పశువును అర్పించే వాడు దానిలో ఒక భాగాన్ని ప్రత్యేకంగా యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి.
30 RAB için yakılan sunusunu kendi eliyle getirmeli. Hayvanın yağını döşüyle birlikte getirecek ve döş RAB'bin huzurunda sallamalık bir sunu olarak sallanacak.
౩౦యెహోవాకు దహనబలిగా అర్పించే వాటిని అతడు స్వయంగా తీసుకు రావాలి. అతడు రొమ్ము భాగాన్నీ, దానితో ఉన్న కొవ్వునీ తీసుకురావాలి. యెహోవా సమక్షంలో అర్పణగా పైకెత్తి కదిలించడానికి రొమ్ము భాగాన్ని తీసుకుని రావాలి.
31 Kâhin yağı sunağın üzerinde yakacak, ama döş Harun'la oğullarının olacak.
౩౧యాజకుడు బలిపీఠం పైన ఆ కొవ్వుని దహించాలి. కానీ రొమ్ము భాగం అహరోనుకీ అతని వారసులకీ చెందుతుంది.
32 Esenlik kurbanlarınızın sağ budunu bağış olarak kâhine vereceksiniz.
౩౨శాంతిబలి పశువుల కుడి తొడ భాగాన్ని యాజకుడికి ఇవ్వాలి.
33 Harunoğulları arasında esenlik sunusunun kanını ve yağını kim sunuyorsa, sağ but onun payı olacak.
౩౩అహరోను వారసుల్లో శాంతిబలి పశువు రక్తాన్నీ, కొవ్వునూ అర్పించే యాజకుడికి ఆ పశువు కుడి తొడ భాగం చెందుతుంది.
34 İsrail halkının sunduğu esenlik kurbanlarından sallamalık döşü ve bağış olarak sunulan budu aldım. İsrail halkının payı olarak bunları sonsuza dek Kâhin Harun'la oğullarına verdim.’”
౩౪ఎందుకంటే నా ఎదుట పైకి లేపి కదిలించిన రొమ్ము భాగాన్నీ, తొడనూ నేను స్వీకరించాను. వాటిని నేను యాజకుడైన అహరోనుకీ, అతని వారసులకీ ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలులన్నిటిలో ఇవి వారి వంతుగా ఉంటాయి. ఇది నా ప్రజలైన ఇశ్రాయేల్ వారు అనుసరించవలసిన శాశ్వత నియమం.
35 Harun'la oğulları kâhin atandıkları gün RAB için yakılan sunulardan paylarına bu düştü.
౩౫ఇది యాజకులుగా యెహోవాకి సేవ చేయడానికి వీరిని మోషే నియమించిన రోజు నుండి అహరోనుకూ అతని వారసులకూ యెహోవాకు అర్పించే దహనబలుల్లో ఏర్పాటైన వాటా.
36 RAB onları meshettiği gün İsrail halkına buyruk vermişti. Adağın bu parçaları gelecek kuşaklar boyunca onların payı olacaktı.
౩౬వారిని యాజకులుగా యెహోవా అభిషేకం చేసిన రోజున వారికి ఇశ్రాయేలు ప్రజలు ఇవ్వాలని యెహోవా ఖాయం చేసిన వాటా. ఇది అన్ని తరాల్లో వారి వాటాగా ఉంటుంది.”
37 Yakmalık, tahıl, suç, günah, atanma sunularının ve esenlik kurbanlarının yasası budur.
౩౭ఇవి దహనబలిని గూర్చీ, అపరాధం కోసం చేసే బలిని గూర్చీ, నైవేద్య అర్పణ బలిని గూర్చీ, పాపం కోసం చేసే బలిని గూర్చీ, ప్రతిష్టార్పణ బలిని గూర్చీ, శాంతిబలిని గూర్చీ వివరించే చట్టం.
38 RAB, bu buyruğu çölde, Sina Dağı'nda İsrail halkından kendisine sunu sunmalarını istediği gün Musa'ya vermişti.
౩౮ఈ ఆజ్ఞలను యెహోవా సీనాయి పర్వతం పైన మోషేకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు సీనాయి అరణ్యంలో యెహోవాకు అర్పణలు చెల్లించాలని ఆదేశించాడు.

< Levililer 7 >