< Eyüp 5 >

1 “Haydi çağır, seni yanıtlayan çıkacak mı? Meleklerin hangisine yöneleceksin?
నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు?
2 Aptalı üzüntü öldürür, Budalayı kıskançlık bitirir.
తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు.
3 Ben aptalın kök saldığını görünce, Hemen yurduna lanet ettim.
మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాసస్థలం శాపగ్రస్థమైనదని తెలుసుకున్నాను.
4 Çocukları güvenlikten uzak, Mahkeme kapısında ezilir, Savunan çıkmaz.
అతని పిల్లలకు క్షేమం దూరం అవుతుంది. గుమ్మాల దగ్గరే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళను విడిపించేవాడు ఎవ్వరూ లేరు.
5 Ürününü açlar yer, Dikenler arasındakini bile toplarlar; Mallarını susamışlar yutmak ister.
ఆకలితో ఉన్నవాళ్ళు అతని పంటను తినివేస్తారు. ముళ్ళ పొదల్లో ఉన్నదాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు.
6 Çünkü dert topraktan çıkmaz, Sıkıntı yerden bitmez.
దుమ్ము నుండి కష్టాలు పుట్టవు. భూమిలోనుండి బాధ మొలవదు.
7 Havaya uçuşan kıvılcımlar gibi Sıkıntı çekmek için doğar insan.
నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టు మనుషులు బాధలు అనుభవించడానికే పుడుతున్నారు.
8 “Oysa ben Tanrı'ya yönelir, Davamı O'na bırakırdım.
అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించే వాణ్ణి.
9 Anlayamadığımız büyük işler, Sayısız şaşılası işler yapan O'dur.
ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి.
10 Yeryüzüne yağmur yağdırır, Tarlalara sular gönderir.
౧౦ఆయన భూమి మీద వానలు కురిపిస్తాడు. పంట పొలాల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు.
11 Düşkünleri yükseltir, Yaslıları esenliğe çıkarır.
౧౧ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్ళకు ఊరట కలిగిస్తాడు.
12 Kurnazların oyununu bozar, Düzenlerini gerçekleştiremesinler diye.
౧౨వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు.
13 Bilgeleri kurnazlıklarında yakalar, Düzenbazların oyunu son bulur.
౧౩దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. కపట క్రియలు జరిగించేవాళ్ళ తలంపులు తారుమారు చేస్తాడు.
14 Gündüz karanlığa toslar, Öğlen, geceymiş gibi el yordamıyla ararlar.
౧౪వెలుగు ఉండే సమయంలో వాళ్లను చీకటి కమ్ముకుంటుంది. ఒకడు రాత్రిలో తడుములాడినట్టు వాళ్ళు మధ్యాహ్న సమయంలో తడుములాడతారు.
15 Yoksulu onların kılıç gibi ağzından Ve güçlünün elinden O kurtarır.
౧౫బలాఢ్యుల నోటి నుంచి వచ్చే కత్తిలాంటి మాటల బారి నుండి, వాళ్ళ చేతి నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు.
16 Yoksul umutlanır, Haksızlık ağzını kapar.
౧౬కాబట్టి పేదవాళ్ళకు ఆశాభావం కలుగుతుంది. అన్యాయానికి నోరు మూతబడుతుంది.
17 “İşte, ne mutlu Tanrı'nın eğittiği insana! Bu yüzden Her Şeye Gücü Yeten'in yola getirişini küçümseme.
౧౭దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు.
18 Çünkü O hem yaralar hem sarar, O incitir, ama elleri sağaltır.
౧౮ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బ తీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు.
19 Altı kez sıkıntıya düşsen seni kurtarır, Yedinci kez de sana zarar vermez.
౧౯ఆరు కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయం కలుగదు.
20 Kıtlıkta ölümden, Savaşta kılıçtan seni O koruyacak.
౨౦కరువుకాటకాల వల్ల కలిగే మరణం నుండి, యుద్ధ సమయంలో కత్తివాత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు.
21 Kamçılayan dillerden uzak kalacak, Yıkım gelince korkmayacaksın.
౨౧దూషణ మాటల వల్ల కలిగే అవమానం నుండి నిన్ను తప్పిస్తాడు. నీపై వినాశనం విరుచుకుపడినా నువ్వు దానికి భయపడవు.
22 Yıkıma, açlığa gülüp geçecek, Yabanıl hayvanlardan ürkmeyeceksin.
౨౨కరువులు, ప్రళయాలు వచ్చినా నువ్వు వాటిని లక్ష్యపెట్టవు. క్రూర మృగాలకు నీవు భయపడవు.
23 Çünkü tarladaki taşlarla anlaşacaksın, Yabanıl hayvanlar seninle barışacak.
౨౩నీ పొలంలోని రాళ్ళతో కూడా నీవు ఒప్పందం చేసుకుంటావు. అడవి జంతువులతో సఖ్యంగా ఉంటావు.
24 Çadırının güvenlik içinde olduğunu bilecek, Yurdunu yoklayınca eksik bulmayacaksın.
౨౪నువ్వు నివసించే నీ గుడారం క్షేమకరమని నువ్వు తెలుసుకుంటావు. నీ గొర్రెల దొడ్డిలోకి వెళ్తే ఒక్కటి కూడా తప్పిపోలేదని గ్రహిస్తావు.
25 Çocuklarının çoğalacağını bileceksin, Soyun ot gibi bitecek.
౨౫నీ సంతానం విస్తరిస్తుందనీ, నీ వారసులు భూమి మీద పచ్చికలాగా వృద్ధి చెందుతారనీ నీకు నిశ్చయత కలుగుతుంది.
26 Zamanında toplanan demetler gibi, Mezara dinç gireceksin.
౨౬ధాన్యం పనలను కళ్ళానికి మోసుకు పోయినట్టు నిండు వృద్ధాప్యంలో నువ్వు సమాధికి చేరతావు.
27 “İşte araştırdık, doğrudur, Onun için bunu dinle ve belle.”
౨౭ఈ విషయాలన్నీ మేము తరచి తరచి పరిశీలించాం. ఇవన్నీ వాస్తవాలు. నీకు ఉపయోగపడే ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకో.

< Eyüp 5 >