< Yeşaya 21 >

1 Deniz kıyısındaki çölle ilgili bildiri: Negev'den fırtınalar nasıl üst üste gelirse, Çölden, korkunç ülkeden bir istilacı öyle geliyor.
సముద్రతీరాన ఉన్న ఎడారిని గురించిన దైవ ప్రకటన. “దక్షిణ దేశం నుండి తుఫాను గాలులు వీస్తున్నట్టు, ఒక భయంకరమైన దేశం నుండి అరణ్యాన్ని దాటుకుంటూ ఆ విపత్తు వస్తూ ఉంది.
2 Korkunç bir görüm gördüm: Hain hainlik etmede, Harap eden harap etmede. Ey Elam, saldır! Ey Meday, onu kuşat! Onun neden olduğu iniltileri sona erdireceğim.
దుస్థితిని తెలియ జేసే ఒక దర్శనం నాకు కలిగింది. మోసగాడు మోసాలు చేస్తాడు. నాశనం చేసేవాడు నాశనం చేస్తాడు. ఏలాము దేశమా, వెళ్ళి దాడి చెయ్యి, మాదియా దేశమా ముట్టడి వెయ్యి. నేను ఆమె మూలుగులను ఆపివేస్తాను.
3 Gördüklerimden ötürü belime ağrı saplandı, Doğuran kadının ağrıları gibi ağrılar tuttu beni. Duyduklarımdan sarsıldım, Gördüklerimden dehşete düştüm.
కాబట్టి నా నడుముకు విపరీతమైన నొప్పి కలిగింది. ప్రసవ వేదన పడే స్త్రీకి కలిగిన నొప్పుల్లాంటివే నాకూ కలిగాయి. నేను విన్న దాన్ని బట్టి కుంగిపోయాను. చూసిన దాన్ని బట్టి నాకు బాధ కలుగుతున్నది.
4 Şaşkınım, titremeler sardı beni. Özlediğim alaca karanlık bana korku veriyor artık.
నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. భయంతో నాకు జలదరింపు కలిగింది. నేను ఆశతో ఎదురు చూసిన రాత్రి నాకు భయంతో వణుకు పుట్టింది.
5 Gördüğüm görümde sofrayı hazırlıyor, Halıları seriyor, yiyip içiyorlar. Kalkın, ey önderler, kalkanları yağlayın!
వాళ్ళు భోజనం బల్ల సిద్ధం చేస్తారు. తివాచీలు పరుస్తారు. అన్నం తిని, తాగుతారు. అధిపతులారా, లేవండి. డాళ్ళకి నూనె రాయండి.
6 Rab bana dedi ki, “Git, bir gözcü dik, gördüğünü bildirsin.
ఎందుకంటే ప్రభువు నాకు చెప్పిన మాట ఇది. వెళ్ళు. ఒక కాపలా వాణ్ణి నియమించు. తాను చూస్తున్న దాని గూర్చి అతడు సమాచారం ఇవ్వాలి.
7 Savaş arabalarının, Atlara, eşeklere, develere binmiş insanların Çifter çifter geldiğini görünce dikkat kesilsin.”
అతడు ఒక రథాన్ని చూసినప్పుడు, జంట రౌతులు గుర్రాలపై రావడం చూసినప్పుడు, గాడిదలనూ, ఒంటెలనూ ఎక్కి వాళ్ళు రావడం చూసినప్పుడు అతడు మనస్సు పెట్టి అప్రమత్తంగా ఉండాలి.”
8 Gözcü, “Ey efendim, Her gün aralıksız gözcü kulesinde duruyor, Her gece yerimde nöbet tutuyorum” diye bağırdı,
ఆ కాపలా వాడు ఇలా అరుస్తాడు. “నా ప్రభూ, ఈ పహారా స్తంభంపై ప్రతి రోజూ, రోజంతా నిలబడి ఉన్నాను. రాత్రంతా నేను కాపలా కాస్తూనే ఉన్నాను.”
9 “Bak, savaş arabalarıyla atlılar Çifter çifter geliyor!” Sonra, “Yıkıldı, Babil yıkıldı!” diye haber verdi, “Taptıkları bütün putlar yere çalınıp parçalandı!”
చూడండి, రథాన్ని తోలుకుంటూ ఒక వ్యక్తి గుర్రాలెక్కి వస్తున్న రౌతులతో వస్తున్నాడు. వాళ్ళు జంటలుగా ఒక దళంగా వస్తున్నారు. అతడు పిలిచి ఇలా చెప్పాడు. “బబులోను కూలి పోయింది. నిజంగానే కూలిపోయింది. దాని చెక్కిన దేవుళ్ళ బొమ్మలన్నీ విరిగి నేలకూలాయి.”
10 Ey halkım, harman yerinde Buğday gibi dövülmüş olan halkım! Her Şeye Egemen RAB'den, İsrail'in Tanrısı'ndan duyduklarımı Size bildirdim.
౧౦నేను నూర్చిన నా ధాన్యమా, నేను చెరిగిన వాళ్ళు, నా కళ్ళంలో నూర్చిన పిల్లలు, ఇశ్రాయేలు దేవుడు, సేనలకు అధిపతి అయిన యెహోవా దగ్గర నేను విన్నది నీకు తెలియజేశాను.
11 Duma ile ilgili bildiri: Biri Seir'den bana sesleniyor: “Ey gözcü, geceden geriye ne kaldı? Geceden geriye ne kaldı?”
౧౧దూమా గూర్చిన ఒక దైవ ప్రకటన. శేయీరులో నుండి ఒకడు నన్ను అడుగుతున్నాడు. “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది?”
12 Yanıtım şöyle: “Sabah olmak üzere, Ama yine gece olacak. Soracaksanız sorun, yine gelin.”
౧౨అప్పుడు కావలివాడు “ఉదయం వస్తుంది, రాత్రి కూడా వస్తుంది. మీరు అడగాలనుకుంటే అడగండి. మళ్ళీ తిరిగి రండి” అంటున్నాడు.
13 Arabistan'la ilgili bildiri: Arabistan çalılıklarında geceleyeceksiniz, Ey Dedan kervanları!
౧౩అరేబియాను గూర్చిన ఒక దైవ ప్రకటన. దెదాను సంచార వర్తకులు, మీరు అరేబియా ఎడారిలో రాత్రి గడపాలి.
14 Ey Tema'da oturanlar, Su getirin, susamışları karşılayın, Kaçıp kurtulana ekmek verin.
౧౪తేమా దేశ వాసులారా, దాహంతో ఉన్న వారి కోసం నీళ్ళు తీసుకుని రండి. దేశ దిమ్మరుల ఎదురుగా ఆహారం తీసుకు రండి.
15 Çünkü onlar kılıçtan, yalın kılıçtan, Gerilmiş yaydan, çetin çarpışmalardan kaçtılar.
౧౫ఎందుకంటే వాళ్ళు కత్తినుండి తప్పించుకుని పారిపోతున్నారు. దూసిన కత్తి నుండీ, ఎక్కు పెట్టిన విల్లు నుండీ, యుద్ధ భయం వల్లా పారిపోతున్నారు.
16 Rab bana şöyle dedi: “Kedar'ın bütün övüncü tam bir yıl sonra sona erecek.
౧౬ఎందుకంటే ప్రభువు నాకిలా చెప్పాడు. “మరో సంవత్సరంలోగా కూలి వాళ్ళని ఒక సంవత్సరానికి పెట్టుకున్నట్టుగా కేదారు ప్రభావం అంతా నశించిపోతుంది.
17 Okçulardan, Kedar savaşçılarından pek az sağ kalan olacak.” Bunu söyleyen, İsrail'in Tanrısı RAB'dir.
౧౭కేదారు ప్రజల్లో కొద్దిమంది విలుకాళ్ళూ, శూరులూ మిగిలిపోతారు.” ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఇది.

< Yeşaya 21 >