< Yaratiliş 25 >

1 İbrahim bir kadınla daha evlendi. Kadının adı Ketura'ydı.
అబ్రాహాము మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా.
2 Ondan Zimran, Yokşan, Medan, Midyan, Yişbak, Şuah adlı çocukları oldu.
ఆమె ద్వారా అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనేవాళ్ళు పుట్టారు.
3 Yokşan'dan da Şeva, Dedan oldu. Dedan soyundan Aşurlular, Letuşlular, Leumlular doğdu.
యొక్షాను షేబ, దెదానులకు జన్మనిచ్చాడు. అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనే జాతులు ఈ దెదాను సంతానమే.
4 Midyan'ın Efa, Efer, Hanok, Avida, Eldaa adlı oğulları oldu. Bunların hepsi Ketura'nın soyundandı.
మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనేవాళ్ళు.
5 İbrahim sahip olduğu her şeyi İshak'a bıraktı.
వీళ్ళందరూ కెతురా సంతానం. అబ్రాహాము తన సంపదనంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు.
6 Cariyelerinin oğullarına da armağanlar verdi. Kendisi sağken bu çocukları oğlu İshak'tan uzaklaştırıp doğuya gönderdi.
అబ్రాహాము తాను బ్రతికి ఉండగానే తన ఉంపుడుగత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపి వేశాడు.
7 İbrahim yüz yetmiş beş yıl yaşadı. Ömrü bu kadardı.
అబ్రాహాము మొత్తం నూట డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించాడు.
8 Kocamış, yaşama doymuş, iyice yaşlanmış olarak son soluğunu verdi. Ölüp atalarına kavuştu.
అబ్రాహాము సుదీర్ఘకాలం జీవించి నిండు వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితం గడిపి చనిపోయి తన పితరులను చేరుకున్నాడు.
9 Oğulları İshak'la İsmail onu Hititli Sohar oğlu Efron'un tarlasında Mamre'ye yakın Makpela Mağarası'na gömdüler.
అతని కొడుకులు ఇస్సాకూ, ఇష్మాయేలూ కలసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతణ్ణి పాతి పెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోనుకు చెందిన పొలంలో ఉంది.
10 İbrahim o tarlayı Hititler'den satın almıştı. Böylece İbrahim'le karısı Sara oraya gömüldüler.
౧౦అబ్రాహాము హేతు వారసుల దగ్గర కొన్న ఈ పొలంలోనే అబ్రాహామునూ అతని భార్య శారానూ పాతిపెట్టారు.
11 Tanrı İbrahim'in ölümünden sonra oğlu İshak'ı kutsadı. İshak Beer-Lahay-Roi'de yaşıyordu.
౧౧అబ్రాహాము చనిపోయిన తరువాత దేవుడు అతని కొడుకు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ సమయంలో ఇస్సాకు బెయేర్‌ లహాయి రోయి దగ్గర నివాసమున్నాడు.
12 Sara'nın cariyesi Mısırlı Hacer'in İbrahim'e doğurduğu İsmail'in öyküsü:
౧౨ఐగుప్తీయురాలూ శారా దాసీ అయిన హాగరు ద్వారా అబ్రాహాముకు పుట్టిన ఇష్మాయేలు వంశావళి ఇది.
13 Doğum sırasına göre İsmail'in oğullarının adları şunlardır: İlk oğlu Nevayot. Sonra Kedar, Adbeel, Mivsam,
౧౩ఇష్మాయేలు పెద్ద కొడుకు అయిన నేబాయోతూ, కేదారు, అద్బయేలూ, మిబ్శామూ,
14 Mişma, Duma, Massa,
౧౪మిష్మా, దూమానమశ్శా,
15 Hadat, Tema, Yetur, Nafiş, Kedema gelir.
౧౫హదరూ, తేమా, యెతూరూ, నాపీషూ, కెదెమా.
16 İsmail'in oğulları olan bu on iki bey oymakların atalarıydı. Köylerine, obalarına da bu adları verdiler.
౧౬ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి వారి గ్రామాల ప్రకారమూ, కోటల ప్రకారమూ వంశావళుల ప్రకారమూ వాళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం పన్నెండు మంది రాజులు.
17 İsmail yüz otuz yedi yıl yaşadıktan sonra son soluğunu verdi. Ölüp halkına kavuştu.
౧౭ఇష్మాయేలు నూట ముప్ఫై ఏడు సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు ప్రాణం విడిచాడు. తన పితరులను చేరుకున్నాడు.
18 İsmailoğulları Aşur'a doğru giderken Mısır sınırı yakınında, Havila ile Şur arasındaki bölgeye yerleştiler. Kardeşlerinin yaşadığı yerin doğusuna yerleşmişlerdi.
౧౮వీళ్ళు అష్షూరుకు వెళ్ళే దారిలో హవీలా నుండి ఐగుప్తుకు సమీపంగా ఉన్న షూరు వరకూ నివసిస్తుండే వాళ్ళు. వీళ్ళు ఒకరి పట్ల మరొకరు విరోధంగా జీవించేవారు.
19 İbrahim'in oğlu İshak'ın öyküsü:
౧౯అబ్రాహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి.
20 İshak Aramlı Lavan'ın kızkardeşi, Paddan-Aramlı Betuel'in kızı Rebeka'yla evlendiğinde kırk yaşındaydı.
౨౦ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియా వాడైన బెతూయేలు కూతురూ సిరియావాడైన లాబాను సోదరీ అయిన రిబ్కాను పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు నలభై సంవత్సరాలు.
21 İshak karısı için RAB'be yakardı, çünkü karısı kısırdı. RAB İshak'ın yakarışını yanıtladı, Rebeka hamile kaldı.
౨౧ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది.
22 Çocuklar karnında itişiyordu. Rebeka, “Nedir bu başıma gelen?” diyerek RAB'be danışmaya gitti.
౨౨ఆమె గర్భంలో ఇద్దరు పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె “నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?” అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది.
23 RAB onu şöyle yanıtladı: “Rahminde iki ulus var, Senden iki ayrı halk doğacak, Biri öbüründen güçlü olacak, Büyüğü küçüğüne hizmet edecek.”
౨౩అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు. “రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి. రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి. ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.”
24 Doğum vakti gelince, Rebeka'nın ikiz oğulları oldu.
౨౪ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
25 İlk doğan oğlu kıpkırmızı ve tüylüydü; kırmızı bir cüppeyi andırıyordu. Adını Esav koydular.
౨౫మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి ఏశావు అనే పేరు పెట్టారు.
26 Sonra kardeşi doğdu. Eliyle Esav'ın topuğunu tutuyordu. Bu yüzden İshak ona Yakup adını verdi. Rebeka doğum yaptığında İshak altmış yaşındaydı.
౨౬తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ఏళ్ళు.
27 Çocuklar büyüdü. Esav kırları seven usta bir avcı oldu. Yakup'sa hep çadırda oturan sakin bir adamdı.
౨౭ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు. గుడారంలోనే ఉండేవాడు.
28 İshak Esav'ı daha çok severdi, çünkü onun getirdiği av etlerini yerdi. Rebeka ise Yakup'u severdi.
౨౮ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం.
29 Bir gün Yakup çorba pişirirken Esav avdan geldi. Aç ve bitkindi.
౨౯యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో ఏశావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు.
30 Yakup'a, “Lütfen şu kızıl çorbadan biraz ver de içeyim. Aç ve bitkinim” dedi. Bu nedenle ona Edom adı da verildi.
౩౦ఏశావు యాకోబును “దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికివ్వు. నేను చాలా అలసి పోయాను” అని అడిగాడు. అందుకే అతనికి ఏదోము అనే పేరు వచ్చింది.
31 Yakup, “Önce sen ilk oğulluk hakkını bana ver” diye karşılık verdi.
౩౧అందుకు యాకోబు “ముందు పెద్దవాడుగా నీ జన్మ హక్కుని నాకు ఇచ్చెయ్యి” అన్నాడు.
32 Esav, “Baksana, açlıktan ölmek üzereyim” dedi, “İlk oğulluk hakkının bana ne yararı var?”
౩౨అప్పుడు ఏశావు “చూడు, నేను ఆకలితో చావబోతున్నాను. ఈ జన్మహక్కు నాకెందుకు?” అన్నాడు.
33 Yakup, “Önce ant iç” dedi. Esav ant içerek ilk oğulluk hakkını Yakup'a sattı.
౩౩యాకోబు “ముందు ప్రమాణం చెయ్యి” అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మి వేశాడు.
34 Yakup Esav'a ekmekle mercimek çorbası verdi. Esav yiyip içtikten sonra kalkıp gitti. Böylece Esav ilk oğulluk hakkını küçümsemiş oldu.
౩౪యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడు కాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టే, కూరా తిని, తాగి అక్కడ నుండి తన దారిన వెళ్లి పోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు.

< Yaratiliş 25 >