< Galatyalilar 5 >

1 Mesih bizi özgür olalım diye özgür kıldı. Bunun için dayanın. Bir daha kölelik boyunduruğuna girmeyin.
స్వేచ్ఛగా ఉండడం కోసం క్రీస్తు మనలను విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడండి. మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.
2 Bakın, ben Pavlus size diyorum ki, sünnet olursanız Mesih'in size hiç yararı olmaz.
మీరు సున్నతి పొందితే క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను.
3 Sünnet edilen her adamı bir daha uyarıyorum: Kutsal Yasa'nın tümünü yerine getirmek zorundadır.
సున్నతి పొందిన ప్రతి మనిషీ ధర్మశాస్త్రమంతటినీ పాటించవలసి ఉంటుందని నేను మళ్ళీ గట్టిగా చెబుతున్నాను.
4 Yasa aracılığıyla aklanmaya çalışan sizler Mesih'ten ayrıldınız, Tanrı'nın lütfundan uzak düştünüz.
మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుల లెక్కలోకి రావాలనుకునే వారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరై పోయారు. కృపలో నుంచి తొలగిపోయారు.
5 Ama biz aklanmanın verdiği umudun gerçekleşmesini Ruh'a dayanarak, imanla bekliyoruz.
మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము.
6 Mesih İsa'da ne sünnetliliğin ne de sünnetsizliğin yararı vardır; yararlı olan, sevgiyle etkisini gösteren imandır.
యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో, పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం.
7 İyi koşuyordunuz. Sizi gerçeğe uymaktan kim alıkoydu?
మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు?
8 Buna kanmanız sizi çağıranın isteği değildir.
ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడి నుంచి కలగలేదు.
9 “Azıcık maya bütün hamuru kabartır.”
పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది.
10 Başka türlü düşünmeyeceğinize ilişkin Rab'de size güvenim var. Ama aklınızı karıştıran kim olursa olsun, cezasını çekecektir.
౧౦మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు.
11 Bana gelince, kardeşler, eğer hâlâ sünneti savunuyor olsaydım, bugüne dek baskı görür müydüm? Öyle olsaydı, çarmıh engeli ortadan kalkardı.
౧౧సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి తీసివేస్తుంది గదా?
12 Aklınızı çelenler keşke kendilerini hadım etseler!
౧౨మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారు తమ్మును తాము నరికి వేసికోవడం మంచిది.
13 Kardeşler, siz özgür olmaya çağrıldınız. Ancak özgürlük benlik için fırsat olmasın. Birbirinize sevgiyle hizmet edin.
౧౩సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి.
14 Bütün Kutsal Yasa tek bir sözde özetlenmiştir: “Komşunu kendin gibi seveceksin.”
౧౪ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది.
15 Ama birbirinizi ısırıp yiyorsanız, dikkat edin, birbirinizi yok etmeyesiniz!
౧౫అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.
16 Şunu demek istiyorum: Kutsal Ruh'un yönetiminde yaşayın. O zaman benliğin tutkularını asla yerine getirmezsiniz.
౧౬నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు.
17 Çünkü benlik Ruh'a, Ruh da benliğe aykırı olanı arzular. Bunlar birbirine karşıttır; sonuç olarak, istediğinizi yapamıyorsunuz.
౧౭శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.
18 Ruh'un yönetimindeyseniz, Yasa'ya bağımlı değilsiniz.
౧౮ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు.
19 Benliğin işleri bellidir. Bunlar fuhuş, pislik, sefahat, putperestlik, büyücülük, düşmanlık, çekişme, kıskançlık, öfke, bencil tutkular, ayrılıklar, bölünmeler, çekememezlik, sarhoşluk, çılgın eğlenceler ve benzeri şeylerdir. Sizi daha önce uyardığım gibi yine uyarıyorum, böyle davrananlar Tanrı Egemenliği'ni miras alamayacaklar.
౧౯శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం,
౨౦విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు,
౨౧శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
22 Ruh'un ürünüyse sevgi, sevinç, esenlik, sabır, şefkat, iyilik, bağlılık, yumuşak huyluluk ve özdenetimdir. Bu tür nitelikleri yasaklayan yasa yoktur.
౨౨అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం.
౨౩అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు.
24 Mesih İsa'ya ait olanlar, benliği, tutku ve arzularıyla birlikte çarmıha germişlerdir.
౨౪క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
25 Ruh sayesinde yaşıyorsak, Ruh'un izinde yürüyelim.
౨౫మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం.
26 Boş yere övünen, birbirine meydan okuyan, birbirini kıskanan kişiler olmayalım.
౨౬అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.

< Galatyalilar 5 >