< Hezekiel 7 >

1 RAB bana şöyle seslendi:
యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చింది. ఆయన నాకు ఇలా చెప్పాడు.
2 “Ey insanoğlu, Egemen RAB İsrail ülkesine şöyle diyor: Son yaklaştı! Ülkenin dört köşesinin sonu geldi.
“నరపుత్రుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశానికిలా ప్రకటిస్తున్నాడు. అంతం! ఇశ్రాయేలు దేశం నాలుగు సరిహద్దులకు అంతం వచ్చేసింది.
3 Senin de sonun geldi! Senin üzerine öfkemi yağdıracağım. Yaptıklarına göre seni yargılayacak, bütün iğrenç uygulamalarının karşılığını vereceğim.
ఇప్పుడు అంతం మీ పైకి వచ్చింది. ఎందుకంటే నా తీవ్ర కోపాన్ని మీ పైకి పంపుతున్నాను. మీ ప్రవర్తనను బట్టి మీకు తీర్పు తీరుస్తాను. తరువాత అసహ్యకరమైన మీ పనుల ఫలితాన్ని మీపైకి పంపుతాను.
4 Sana acımayacak, seni esirgemeyeceğim. Yaptıklarının ve sendeki iğrenç uygulamaların karşılığını vereceğim. O zaman benim RAB olduğumu anlayacaksınız.
నా దృష్టిలో మీ పట్ల ఎలాంటి కనికరమూ చూపను. నేనే యెహోవాను అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!
5 “Egemen RAB şöyle diyor: Yıkım! İşte duyulmamış bir yıkım geliyor.
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. వినాశనం! వినాశనం వెనుకే మరో వినాశనం. చూడండి! అది వచ్చేస్తూ ఉంది.
6 Sonun geldi! Evet, sonun geldi! Sana karşı uyanıyor. İşte geliyor.
అంతం వచ్చేస్తూ ఉంది. అంతం నీకు విరోధంగా కళ్ళు తెరిచింది. చూడండి. అది వచ్చేస్తూ ఉంది.
7 Ey ülkede yaşayan halk, yıkıma uğrayacaksın. Yıkım zamanı yaklaştı! Gün yakın! Dağların üzerinden sevinç sesi yerine kargaşa sesi geliyor.
దేశవాసులారా, మీ నాశనం మిమ్మల్ని సమీపిస్తుంది. సమయం వచ్చేసింది. నాశన దినం దగ్గరలోనే ఉంది. పర్వతాలు ఇకమీదట ఆనందంగా ఉండవు.
8 Çok yakında kızgınlığımı üzerine boşaltacak, sana duyduğum öfkeyi üzerine dökeceğim. Yaptıklarına göre seni yargılayacak, bütün iğrenç uygulamalarının karşılığını vereceğim.
త్వరలోనే నా క్రోధాన్ని మీమీద కుమ్మరించబోతున్నాను. నా తీవ్రమైన కోపాన్ని మీమీద చూపించ బోతున్నాను. మీ ప్రవర్తనను బట్టి మీకు శిక్ష విధిస్తాను. మీ నీచమైన పనుల ఫలాన్ని మీ పైకి తీసుకు వస్తాను.
9 Sana acımayacak, seni esirgemeyeceğim. Yaptıklarının ve sendeki iğrenç uygulamaların karşılığını vereceğim. O zaman seni cezalandıranın ben RAB olduğumu anlayacaksın.
నాకు మీ పట్ల కనికరం లేదు. నేను మిమ్మల్ని వదలను. మీరు చేసినట్టే నేనూ మీకు చేస్తాను. మిమ్మల్ని శిక్షించే యెహోవాను నేనే అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!
10 “İşte o gün! Gün yaklaştı! Yıkım hazır. Değnek çiçeklendi, gurur tomurcuklandı.
౧౦చూడండి! ఆ రోజు వచ్చేస్తుంది. నాశనం బయలు దేరింది. ఆ దండం పుట్టింది. దానికి గర్వం వికసించింది.
11 Zorbalık ayaklanıp kötülüğün sopası oldu. Halktan, o kalabalıktan kimse kalmayacak; mallarından, görkemlerinden bir şey kalmayacak.
౧౧బలాత్కారం ప్రారంభం అయి దుర్మార్గులను శిక్షించే దండం అయింది. వాళ్ళలో గానీ, వాళ్ళ మూకలో గానీ ఎవరూ మిగలరు. వాళ్ళ సంపదలో గానీ, వాళ్ళ ప్రాముఖ్యతలో గానీ ఏదీ మిగలదు.
12 “Son yaklaştı! Gün geldi! Alıcı sevinmesin, satıcı üzülmesin. Çünkü öfkem bütün halkın üzerine yağacak.
౧౨ఆ సమయం వచ్చేస్తుంది. ఆ రోజు దగ్గర పడింది. నా కోపం ప్రజలందరి పైనా ఉంది కనుక కొనేవాడు సంతోషించకూడదు.
13 Satıcı yaşadığı sürece sattığını geri alamayacak. Çünkü herkesi ilgilendiren bu görüm değiştirilmeyecek. İşlediği günahlar yüzünden kimse canını koruyamayacak.
౧౩అమ్మినవాడు వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం తాను అమ్మిన భూమికి తిరిగి రాడు. ఎందుకంటే ఈ దర్శనం ప్రజలందరికీ విరోధంగా ఉంది. పాపంలో నివసించే ఏ మనిషీ ధైర్యంగా తన ప్రాణాన్ని దక్కించుకోలేడు. అందుకే వాళ్ళెవ్వరూ తిరిగిరారు.
14 Borazan çalındı, herkes hazır, ama kimse savaşa gitmeyecek. Çünkü öfkem bütün halkın üzerindedir.
౧౪వాళ్ళు సర్వసన్నద్ధులై బాకా ఊదారు. కానీ యుద్ధానికి బయల్దేరే వాడు ఎవడూ లేడు.
15 “İşte dışarda kılıç, içerde salgın hastalık ve kıtlık. Kentin dışındakiler kılıçla öldürülecek, kenttekilerse kıtlıktan, salgın hastalıktan yok olacak.
౧౫ఖడ్గం బయట ఉంది. లోపలేమో కరవూ, తెగులూ ఉన్నాయి. బయట ఉన్నవాళ్ళు ఖడ్గం వాతపడతారు. పట్టణంలో ఉన్నవాళ్ళని కరవూ, తెగులూ మింగివేస్తాయి.
16 Sağ kalanlar vadilerdeki güvercinler gibi dağlara kaçacak; her biri günahından ötürü inleyecek.
౧౬అయితే వాళ్ళలో కొంతమంది తప్పించుకుని పర్వతాల పైకి పారిపోతారు. వాళ్ళు అందరూ లోయలో ఉండే గువ్వల్లాగా మూలుగుతారు.
17 Eller gevşeyecek, dizler titreyecek.
౧౭వాళ్ళందరి చేతులూ తడబడతాయి. మోకాళ్ళు నీళ్ళలా బలహీనం అవుతాయి.
18 Çul kuşanacak, dehşete düşecekler. Yüzleri utançtan kızaracak, başları tıraş edilecek.
౧౮వారు గోనెపట్ట ధరిస్తారు. తీవ్రమైన భయం వాళ్ళని కమ్ముకుంటుంది. ప్రతి ఒక్కరి ముఖం పైనా అవమానం ఉంటుంది. బోడితనం వాళ్ళ తలల మీద కనిపిస్తుంది.
19 Gümüşlerini sokağa atacaklar. Altınları kirli sayılacak. RAB'bin öfkesini boşalttığı gün onları ne altınları, ne gümüşleri kurtarabilir. Bunlarla ne açlıklarını giderebilir, ne karınlarını doyurabilirler. Altın ve gümüş onları suça sürükledi.
౧౯వాళ్ళు తమ దగ్గర ఉన్న వెండిని వీధుల్లో పారేస్తారు. బంగారం వాళ్లకి వ్యర్ధపదార్ధంలా ఉంటుంది. యెహోవా కోప దినాన వెండిబంగారాలు వాళ్ళను కాపాడలేవు. వాళ్ళ దోషం పెను ఆటంకంగా ఉంటుంది గనక వాళ్ళ జీవితాలకు రక్షణ ఉండదు. వాళ్ళ కడుపులకు పోషణ ఉండదు.
20 Mücevherlerinin güzelliğiyle gururlanırlardı. İğrenç, tiksindirici putlarını bunlardan yaptılar. Bu yüzden mücevherlerini kirli bir nesneye çevireceğim.
౨౦వాళ్ళు అహంకరించి రత్నభరితమైన ఆభరణాలు చేయించారు. అవి వాళ్ళ నీచమైన పనులను వర్ణించే విగ్రహ ఆకారాలుగా ఏర్పడ్డాయి. వాటితో వాళ్ళు అసహ్యకరమైన తమ పనులను సాగించారు. కాబట్టి ఆ ఆభరణాలు వాళ్లకి అసహ్యం పుట్టేలా నేను చేస్తాను.
21 Hepsini yağma mal olarak yabancı uluslara, ganimet olarak dünyadaki kötülere vereceğim; onları kirletecekler.
౨౧వాటిని ఇతర దేశస్తుల చేతికి అప్పగిస్తాను. దుర్మార్గుల చేతికి దోపిడీ సొమ్ముగా ఇస్తాను. వాళ్ళు వాటిని అపవిత్రం చేస్తారు.
22 Yüzümü onlardan çevireceğim. Değerli tapınağımı kirletecekler; zorbalar içeri girip orayı kirletecekler.
౨౨వాళ్ళు నా ఖజానాను అపవిత్రం చేస్తుంటే చూడకుండా నా ముఖం తిప్పుకుంటాను. బందిపోట్లు దానిలో ప్రవేశించి దాన్ని అపవిత్రం చేస్తారు.
23 “Kendinize zincirler hazırlayın! Ülkede kan akıtılıyor, kent zorbalık dolu.
౨౩తీర్పుని బట్టి దేశం రక్తంతోనూ, పట్టణం హింసతోనూ నిండిపోయింది. అందుకే సంకెళ్ళు సిద్ధం చేయండి.
24 Ulusların en kötülerini buraya getireceğim; evlerinizi mülk edinecekler. Güçlülerin gururuna son vereceğim. Kutsal yerleri kirletilecek.
౨౪జాతుల్లోకెల్లా అత్యంత దుర్మార్గమైన జాతిని నేను పంపుతాను. వాళ్ళు వచ్చి ఇళ్ళను స్వాధీనం చేసుకుంటారు. వాళ్ళ పవిత్ర స్థలాలను అపవిత్రం చేసి బలశూరుల అహంకారానికి స్వస్తి చెపుతాను!
25 Korku gelince esenlik arayacak, ama bulamayacaklar.
౨౫భయం కలుగుతుంది! వాళ్ళు శాంతిని వాంచిస్తారు కానీ అది వారికి దొరకదు.
26 Yıkım üstüne yıkım gelecek. Kötü haberler birbirini kovalayacak. Peygamberden görüm isteyecekler; kâhin Kutsal Yasa'yı öğretemeyecek, ileri gelenler öğüt veremeyecek.
౨౬నాశనం తరువాత నాశనం కలుగుతుంది. పుకార్ల తరువాత పుకార్లు పుట్టుకొస్తాయి. వాళ్ళు ప్రవక్తల దగ్గరికి దర్శనం కోసం వెళ్తారు. యాజకులకు ధర్మశాస్త్ర జ్ఞానం లేకుండా పోతుంది. సలహా ఇచ్చే పెద్దలకు తెలివి ఉండదు.
27 Kral yas tutacak, önder umutsuzluğa düşecek, ülkedeki halkın korkudan elleri titreyecek. Onları yaptıklarına göre cezalandıracak, yargıladıkları gibi yargılayacağım. O zaman benim RAB olduğumu anlayacaklar.”
౨౭రాజు విచారంగా ఉంటాడు. యువరాజు నిస్పృహలో సామాన్య వస్త్రాలు ధరిస్తాడు. దేశ ప్రజల చేతులు భయంతో వణకుతాయి. వాళ్ళ విధానంలోనే నేను వాళ్లకి ఇలా చేస్తాను. నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకునే వరకూ వాళ్ళ ప్రమాణాలను బట్టే వాళ్ళకి తీర్పు తీరుస్తాను.”

< Hezekiel 7 >