< Hezekiel 12 >

1 RAB bana şöyle seslendi:
యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకు ఇలా చెప్పాడు.
2 “İnsanoğlu, asi bir halkın arasında yaşıyorsun. Gözleri varken görmüyor, kulakları varken işitmiyorlar. Çünkü bu halk asidir.
“నరపుత్రుడా, నువ్వు తిరగబడే ప్రజల మధ్య నివసిస్తున్నావు. వాళ్లకు కళ్ళు ఉన్నాయి. కానీ వాళ్ళు చూడరు. వాళ్లకి చెవులు ఉన్నాయి. కానీ వినరు.
3 “Sen, insanoğlu, sürgüne gidecekmiş gibi eşyanı topla, onların gözü önünde, gündüzün yola çık, bulunduğun yerden başka bir yere git. Kim bilir, asi bir halk olmalarına karşın seni görüp anlayabilirler.
నరపుత్రుడా, నువ్వైతే దేశాంతరం వెళ్ళడానికి సామాను సిద్ధం చేసుకో. పగలు వాళ్ళు చూస్తుండగానే నువ్వు నీ స్థలాన్ని విడిచి ప్రయాణమై వేరే స్థలానికి దేశాంతరం పోవాలి. వాళ్ళు తిరగబడే వాళ్ళే అయినా ఇదంతా గమనించడం మొదలు పెడతారేమో.
4 Gündüzün, halkın gözü önünde topladığın sürgün eşyanı çıkar. Akşam yine onların gözü önünde sürgüne giden biri gibi yola çık.
వాళ్ళు చూస్తుండగానే పగటి వేళ దేశాంతరం వెళ్ళడానికి నీ సామాను బయటకి తీయాలి. అలాగే మరో దేశం ప్రయాణమయ్యే వాడు వెళ్ళినట్టుగా వాళ్ళు చూస్తుండగా సాయంత్రం వేళలో వెళ్ళాలి.
5 Onlar seni izlerken duvarı delip eşyanı çıkar.
వాళ్ళు చూస్తుండగా గోడకి కన్నం వేసి దానిలో నుండి బయల్దేరు.
6 Seni izlerlerken eşyanı sırtlayıp karanlıkta taşı. Ülkeyi görmemek için yüzünü ört. Çünkü yapacakların İsrail halkı için bir uyarı olacaktır.”
వాళ్ళు చూస్తుండగా నీ వస్తువులను భుజం మీదికెత్తుకో. వాటిని రాత్రివేళ బయటకు తీసుకు రా. నీకు నేల కనపడకుండా ముఖం కప్పుకో. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నేను నిన్ను ఒక సూచనగా నిర్ణయించాను.”
7 Bana verilen buyruk uyarınca davrandım. Gündüzün sürgüne gidecekmiş gibi eşyalarımı çıkardım. Akşam elimle duvarı deldim. Eşyalarımı karanlıkta çıkarıp onlar izlerken sırtımda taşıdım.
ఆయన నాకాజ్ఞాపించినట్టే నేను చేశాను. దేశాంతరం వెళ్ళడానికి పగలు సామాను బయటకు తెచ్చాను. సాయంత్రం నా చేత్తో గోడకి కన్నం వేసి నా వస్తువులను చీకట్లో బయటకు తెచ్చాను. వాళ్ళు చూస్తుండగా వాటిని నా భుజం పైకెత్తుకున్నాను. నేను దేశాంతరం పోతున్నట్టుగా పగటివేళ నా సామాను బయటికి తెచ్చి పొద్దుగుంకే వేళ నా చేత్తో గోడకు కన్నం వేసి, వారు చూస్తుండగా సామగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకున్నాను.
8 Ertesi sabah RAB bana seslendi:
తరువాత ఉదయం యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
9 “İnsanoğlu, o asi İsrail halkı sana, ‘Ne yapıyorsun?’ diye sormadı mı?
“నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలు, ఆ తిరగబడే జనం ‘నువ్విలా చేస్తున్నావేమిటి?’ అని అడగడం లేదా?
10 “Onlara de ki, ‘Egemen RAB şöyle diyor: Yeruşalim'deki önder ve orada yaşayan bütün İsrail halkına ilişkin bir bildiridir bu.
౧౦వాళ్ళకిలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఈ ప్రవచనాత్మక సందేశం యెరూషలేములోని పరిపాలకుడికీ దానిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ చెందుతుంది.
11 Ben sizin için bir uyarıyım’ de. Sana yaptığımın tıpkısı onlara da yapılacak. Tutsak olarak sürgüne gidecekler.
౧౧నేను మీకు ఒక సూచనగా ఉన్నాను. నేను చేసి చూపినదే వాళ్ళకీ జరుగుతుంది. వాళ్ళు చెరలోకి వెళ్తారు. బందీలుగా దేశాంతరం పోతారు.
12 “Onların önderi karanlıkta eşyasını sırtında taşıyarak yola koyulacak. Eşyasını çıkarmak için duvarda bir gedik açacak. Ülkeyi görmemek için yüzünü örtecek.
౧౨వాళ్ళలో ఉన్న పరిపాలకుడు తన సామాను భుజం మీద ఎత్తుకుని రాత్రివేళ గోడలో నుండి వెళ్తాడు. వాళ్ళు గోడ తవ్వి దాంట్లో నుండి తమ వస్తువులు బయటకు తీసుకువస్తారు. అతడు నేలను చూడకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు.
13 Onun üzerine ağımı atacağım, kurduğum tuzağa düşecek. Onu Babil'e, Kildan ülkesine götüreceğim, ama ülkeyi göremeden orada ölecek.
౧౩నేను అతణ్ణి పట్టుకోడానికి వల విసురుతాను. అతడు నా వలలో చిక్కుకుంటాడు. అతణ్ణి కల్దీయ ప్రజల దేశమైన బబులోనుకి తీసుకు వస్తాను. కానీ అతడు ఆ స్థలాన్ని చూడకుండానే మరణిస్తాడు.
14 Çevresindekilerin tümünü –yardımcılarını, ordusunu– dünyanın dört bucağına dağıtacağım. Yalın kılıç onların peşlerine düşeceğim.
౧౪అతనికి సహాయం చేయడానికి వచ్చిన వారినీ, అతని మొత్తం సైన్యాన్నీ నేను అన్ని దిక్కులకీ చెదరగొడతాను. వాళ్ళ వెనుకే ఒక కత్తిని పంపి తరుముతాను.
15 Onları uluslar arasına dağıtıp ülkelere sürdüğümde, benim RAB olduğumu anlayacaklar.
౧౫నేను వాళ్ళని అనేక జనాల్లోకి చెదరగొట్టి, అనేక దేశాల్లోకి పంపిన తరువాత వాళ్ళు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు.
16 Gittikleri uluslarda yaptıkları bütün iğrenç uygulamaları anlatmaları için aralarından birkaç kişiyi kılıçtan, kıtlıktan, salgın hastalıktan sağ bırakacağım. Böylece benim RAB olduğumu anlayacaklar.”
౧౬ఇతర ప్రజలకు తమ అసహ్యమైన పనులను గూర్చి వివరించడానికి నేను కొంతమందిని కత్తీ, కరువూ, తెగులు బారిన పడకుండా కాపాడతాను.”
17 RAB bana şöyle seslendi:
౧౭యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
18 “İnsanoğlu, yiyeceğini titreyerek ye, suyunu korkudan ürpererek iç.
౧౮“నరపుత్రుడా, భయపడుతూ నీ ఆహారం తిను. చింతా ఆందోళనలతో నీళ్ళు తాగు.
19 Ülkede yaşayan halka de ki, ‘Egemen RAB İsrail ve Yeruşalim'de yaşayanlar için şöyle diyor: Yiyeceklerini umutsuzluk içinde yiyecek, sularını şaşkınlık içinde içecekler. Orada yaşayanların yaptığı zorbalık yüzünden ülke ıssız bırakılacak.
౧౯తరువాత, దేశ ప్రజలకు ఇలా ప్రకటించు. యెరూషలేములో నివసించే వాళ్ళను గూర్చీ ఇశ్రాయేలు దేశాన్ని గూర్చీ ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. వాళ్ళు వణికిపోతూ తమ ఆహారం తింటారు. భయపడి పోతూ నీళ్ళు తాగుతారు. ఎందుకంటే అక్కడ నివసించే వాళ్ళు చేసే హింస, దౌర్జన్యాల వల్ల దేశంలోని సౌభాగ్యం నాశనం అయింది.
20 Halkın içinde yaşadığı kentler yakılacak, ülke çöle dönüşecek. O zaman benim RAB olduğumu anlayacaksınız.’”
౨౦పట్టణాలు నిర్జనంగానూ, శిథిలంగానూ మారతాయి. దేశం నిస్సారం అవుతుంది. అప్పుడు మీరు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు.”
21 RAB bana şöyle seslendi:
౨౧తిరిగి యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
22 “İnsanoğlu, İsrail'de yaygın olan, ‘Günler geçiyor, her görüm boşa çıkıyor’ deyişinin anlamı nedir?
౨౨“నరపుత్రుడా, ‘రోజులు గడిచి పోతున్నాయి, ప్రతి దర్శనమూ విఫలమవుతుంది’ అని సామెత చెప్తారే. దాని అర్థం ఏమిటి?
23 Onlara de ki, ‘Egemen RAB şöyle diyor: Ben bu deyişe son vereceğim. Bundan böyle İsrail'de bir daha söylenmeyecek.’ Yine onlara de ki, ‘Her görümün yerine geleceği günler yaklaştı.
౨౩కాబట్టి నువ్వు వాళ్లకి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత చెప్పకుండా నేను ఈ సామెతకి ముగింపు పలుకుతున్నాను. దాన్ని వ్యర్ధం చేస్తున్నాను. ఇలా చెప్పి వాళ్ళకి ‘ప్రతి దర్శనమూ నెరవేరే రోజులు దగ్గర పడుతున్నాయి.’ అని ప్రకటించు.”
24 Artık İsrail halkı arasında yalan görüm ya da aldatıcı falcılık olmayacak.
౨౪“ఇశ్రాయేలు ప్రజల్లో ఇక మీదట తప్పుడు దర్శనాలూ, అనుకూల జోస్యాలూ ఉండవు.
25 Ama ben RAB, ne dersem gecikmeden olacak. Siz, ey asi İsrail halkı, söylediklerimin tümünü sizin günlerinizde yerine getireceğim. Böyle diyor Egemen RAB.’”
౨౫నేను యెహోవాను. నేనే మాట్లాడుతున్నాను. నా మాటలు నేను నెరవేరుస్తాను. ఏమాత్రం ఆలస్యం కాకుండా ఇదంతా జరుగుతుంది. తిరగబడే జనమా, మీ రోజుల్లోనే నేను ఈ మాట చెప్పి దాన్ని నెరవేరుస్తాను. ఇదే ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.”
26 RAB bana şöyle seslendi:
౨౬తిరిగి యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
27 “İnsanoğlu, İsrail halkı, ‘Onun gördüğü görüm uzak günler için, peygamberlik sözleri de uzak gelecekle ilgili’ diyor.
౨౭“నరపుత్రుడా, చూడు. ‘ఇతడు చూస్తున్న దర్శనం జరగడానికి ఇంకా ఎన్నో రోజులు పడుతుంది. చాలా కలం తరవాత జరిగే వాటిని గూర్చి ఇతడు ఇప్పుడే ప్రవచనం చెప్తున్నాడు’ అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు.
28 “Bundan ötürü onlara de ki, ‘Egemen RAB şöyle diyor: Söylediğim sözlerden hiçbiri artık gecikmeyecek, ne dersem olacak. Böyle diyor Egemen RAB.’”
౨౮అయితే నువ్వు వాళ్ళకి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. నా మాటలు ఇక ఆలస్యం కావు. నేను పలికినది తప్పక నెరవేరుతుంది. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.”

< Hezekiel 12 >