< Misir'Dan Çikiş 31 >

1 RAB Musa'ya şöyle dedi:
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
2 “Bak, Yahuda oymağından özellikle Hur oğlu Uri oğlu Besalel'i seçtim.
“యూదా గోత్రానికి చెందిన బెసలేలును నేను నియమించుకున్నాను. అతడు ఊరీ కొడుకు, హూరు మనుమడు.
3 Beceri, anlayış, bilgi ve her türlü ustalık vermek için onu ruhumla doldurdum.
అతనికి నేను అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, సమస్త జ్ఞానం, నేర్పరితనం ప్రసాదించాను. అతణ్ణి నా ఆత్మతో నింపాను.
4 Öyle ki, altın, gümüş, tunç işleyerek ustaca yapıtlar üretsin;
అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.
5 taş kesme ve kakmada, ağaç oymacılığında, her türlü sanat dalında çalışsın.
నేను ప్రసాదించిన సమస్త జ్ఞానం, వివేకాలతో అతడు పనులు జరిగిస్తాడు.
6 Ayrıca Dan oymağından Ahisamak oğlu Oholiav'ı onunla çalışması için görevlendirdim. Sana buyurduğum işlerin hepsini yapabilsinler diye öteki becerikli adamlara üstün yetenek verdim.
దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయంగా ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ తయారు చేయగల నిపుణులందరి హృదయాల్లో నా జ్ఞానం ఉంచుతాను.
7 Buluşma Çadırı'nı, Levha Sandığı'nı, sandığın üzerindeki Bağışlanma Kapağı'nı, çadırın bütün takımlarını,
నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు సన్నిధి గుడారం, సాక్ష్యపు మందసం, దాని మీద ఉన్న కరుణాపీఠాన్ని, గుడారపు సామగ్రిని తయారు చెయ్యాలి.
8 masayla takımlarını, saf altın kandillikle takımlarını, buhur sunağını,
సన్నిధి బల్ల, దాని సామగ్రి, నిర్మలమైన దీపవృక్షం, దాని సామగ్రి తయారు చెయ్యాలి.
9 yakmalık sunu sunağıyla takımlarını, kazanla kazan ayaklığını,
ధూపవేదిక, దహన బలిపీఠం, దాని సామగ్రి, గంగాళం, దాని పీట,
10 dokunmuş giysileri –Kâhin Harun'un kutsal giysileriyle oğullarının kâhin giysilerini–
౧౦యాజక ధర్మం నెరవేర్చే అహరోనుకు, అతని కొడుకులకు ప్రతిష్టించిన దుస్తులు సిద్ధం చెయ్యాలి.
11 mesh yağını, kutsal yer için güzel kokulu buhuru tam sana buyurduğum gibi yapsınlar.”
౧౧పరిశుద్ధ స్థలం కోసం అభిషేక తైలాన్ని, సుగంధ ధూప ద్రవ్యాలను సిద్ధం చెయ్యాలి. ఇవన్నీ నేను నీకు ఆజ్ఞాపించినట్టు జరగాలి.”
12 RAB Musa'ya şöyle buyurdu:
౧౨యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. మీరు నేను నియమించిన విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి.
13 “İsrailliler'e de ki, ‘Şabat günlerimi kesinlikle tutmalısınız. Çünkü o sizinle benim aramda kuşaklar boyu sürecek bir belirtidir. Böylece anlayacaksınız ki, sizi kutsal kılan RAB benim.
౧౩మిమ్మల్ని పవిత్రంగా చేసే యెహోవాను నేనే అని మీరు తెలుసుకునేలా విశ్రాంతి దినం నాకు, మీకు, మీ తరతరాలకు ఒక చిహ్నంగా ఉంటుంది.
14 “‘Şabat Günü'nü tutmalısınız, çünkü sizin için kutsaldır. Kim onun kutsallığını bozarsa, kesinlikle öldürülmeli. O gün çalışan herkes halkının arasından atılmalı.
౧౪అందువల్ల మీరు విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి. అది మీకు పవిత్రమైనది. ఆ దినాన్ని అపవిత్రం చేసే వాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.
15 Altı gün çalışılacak; ama yedinci gün RAB'be adanmış Şabat'tır, dinlenme günüdür. Şabat Günü çalışan herkes kesinlikle öldürülmelidir.
౧౫ఆరు రోజులు పని చేసిన తరువాత యెహోవాకు ప్రతిష్ఠితమైన ఏడవ రోజును విశ్రాంతి దినంగా పాటించాలి. విశ్రాంతి దినాన పని చేసే ప్రతివాడికీ తప్పకుండా మరణశిక్ష విధించాలి.
16 İsrailliler, sonsuza dek sürecek bir antlaşma gereği olarak, Şabat Günü'nü kuşaklar boyu kutlamaya özen gösterecekler.
౧౬ఇశ్రాయేలు ప్రజలు తమ తరతరాలు విశ్రాంతి దిన ఆచారం పాటించి ఆ దినాన్ని ఆచరించాలి. ఇది శాశ్వత కాలం నిలిచి ఉండే నియమం.
17 Bu, İsrailliler'le benim aramda sürekli bir belirti olacaktır. Çünkü ben, RAB yeri göğü altı günde yarattım, yedinci gün işe son verip dinlendim.’”
౧౭నాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య అది శాశ్వతంగా ఒక గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు భూమి ఆకాశాలను సృష్టి చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు.”
18 Tanrı Sina Dağı'nda Musa'yla konuşmasını bitirince, üzerine eliyle antlaşma koşullarını yazdığı iki taş levhayı ona verdi.
౧౮ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడడం ముగించిన తరువాత ఆయన తన వేలితో రాసిన శాసనాలు ఉన్న రెండు పలకలను మోషేకు అందించాడు.

< Misir'Dan Çikiş 31 >