< 1 Samuel 1 >

1 Efrayim dağlık bölgesindeki Ramatayim Kasabası'nda yaşayan, Efrayim oymağının Suf boyundan Yeroham oğlu Elihu oğlu Tohu oğlu Suf oğlu Elkana adında bir adam vardı.
ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో రామతయిము-సోఫీము అనే ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు ఎల్కానా. అతడు యెరోహాము కొడుకు. యెరోహాము ఎలీహు కొడుకు. ఎలీహు తోహు కొడుకు. తోహు సూపు కొడుకు. సూపు ఎఫ్రాయీము గోత్రంవాడు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు.
2 Elkana'nın Hanna ve Peninna adında iki karısı vardı. Peninna'nın çocukları olduğu halde, Hanna'nın çocuğu olmuyordu.
ఒకామె హన్నా, రెండవది పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు పుట్టారు, హన్నాకు పిల్లలు లేరు.
3 Elkana Her Şeye Egemen RAB'be tapınıp kurban sunmak üzere her yıl kendi kentinden Şilo'ya giderdi. Eli'nin RAB'bin kâhinleri olan Hofni ve Pinehas adındaki iki oğlu da oradaydı.
ఎల్కానా షిలోహులో సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు మొక్కుబడులు చెల్లించడానికీ, బలులు అర్పించడానికీ ప్రతి సంవత్సరం తన ఊరినుండి అక్కడికి వెళ్తుండేవాడు. ఆ రోజుల్లో ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు అనే ఇద్దరు యెహోవాకు యాజకులుగా ఉన్నారు.
4 Elkana kurban sunduğu gün karısı Peninna'ya ve oğullarıyla kızlarına etten birer pay verirken,
ఎల్కానా బలి అర్పించే సమయంలో అతని భార్య పెనిన్నాకు, ఆమె కుమారులకు, కుమార్తెలకు భాగం ఇస్తూ వచ్చాడు.
5 Hanna'ya iki pay verirdi. Çünkü RAB Hanna'nın rahmini kapamasına karşın, Elkana onu severdi.
అయితే అతనికి హన్నా అంటే ఎక్కువ ఇష్టం గనక యెహోవా ఆమెకు సంతానం ఇవ్వకపోయినా అతడు ఆమెకు రెండు భాగాలు ఇస్తుండేవాడు.
6 Ama RAB Hanna'nın rahmini kapadığından, kuması Peninna Hanna'yı öfkelendirmek için ona sürekli sataşırdı.
యెహోవా ఆమెకు సంతానం కలగకుండా చేయడంవల్ల ఆమె సవతి పెనిన్నా ఆమెను విసిగిస్తూ, కోపం పుట్టిస్తూ ఉండేది.
7 Bu yıllarca böyle sürdü. Hanna RAB'bin Tapınağı'na her gittiğinde kuması ona sataşırdı. Böylece Hanna ağlar, yemek yemezdi.
ఎల్కానా ప్రతి సంవత్సరం అలాగే చేస్తూ ఉండేవాడు. హన్నా యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడల్లా పెనిన్నా ఆమెను విసిగించేది. అందువల్ల ఆమె భోజనం చేయకుండా ఏడుస్తూ ఉండేది.
8 Kocası Elkana, “Hanna, neden ağlıyorsun, neden yemek yemiyorsun?” derdi, “Neden bu kadar üzgünsün? Ben senin için on oğuldan daha iyi değil miyim?”
ఆమె భర్త ఎల్కానా “హన్నా, నీవెందుకు ఏడుస్తున్నావు? భోజనం ఎందుకు చేయడం లేదు? నీ మనసులో విచారం ఎందుకు? పదిమంది కొడుకులకన్నా నేను నీకు ఎక్కువ కాదా?” అని ఆమెతో చెబుతూ ఉండేవాడు.
9 Bir gün onlar Şilo'da yiyip içtikten sonra, Hanna kalktı. Kâhin Eli RAB'bin Tapınağı'nın kapı sövesi yanındaki sandalyede oturuyordu.
వారు షిలోహులో భోజనం ముగించిన తరువాత హన్నా లేచినపుడు యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న కుర్చీపై కూర్చుని ఉన్నాడు.
10 Hanna, gönlü buruk, acı acı ağlayarak RAB'be yakardı
౧౦తీవ్రమైన దుఃఖంలో ఉన్న హన్నా యెహోవా సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది.
11 ve şu adağı adadı: “Ey Her Şeye Egemen RAB, kulunun üzüntüsüne gerçekten bakıp beni anımsar, kulunu unutmayıp bana bir erkek çocuk verirsen, yaşamı boyunca onu sana adayacağım. Onun başına hiç ustura değmeyecek.”
౧౧ఆమె ఒక ప్రమాణం చేస్తూ “సైన్యాలకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన బాధను చూసి నన్ను మరచిపోకుండా జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు ఒక కుమారుణ్ణి దయచేస్తే వాడు బతికే కాలమంతా వాణ్ణి యెహోవాకు సమర్పిస్తాను. వాడి తలకు ఎన్నటికీ మంగలి కత్తి తగలనియ్యను” అని చెప్పింది. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఏలీ ఆమె నోటి కదలికలు కనిపెడుతున్నాడు.
12 Hanna RAB'be yakarışını sürdürürken, Eli onun dudaklarını gözetliyordu.
౧౨ఎందుకంటే హన్నా తన మనస్సులోనే మాట్లాడుకుంటూ ఉంది.
13 Hanna içinden yakarıyor, yalnız dudakları kımıldıyor, sesi duyulmuyordu. Bu yüzden Eli, Hanna'yı sarhoş sanarak,
౧౩ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి. ఆమె స్వరం వినబడడం లేదు. అందువల్ల ఏలీ ఆమె మద్యం సేవించి ఉంది అనుకున్నాడు.
14 “Sarhoşluğunu ne zamana dek sürdüreceksin? Artık şarabı bırak” dedi.
౧౪అతడామెతో “ఎంతసేపు నువ్వు మత్తులో ఉంటావు? ద్రాక్ష మద్యం ఇక చాలించు” అన్నాడు.
15 Hanna, “Ah, öyle değil efendim!” diye yanıtladı, “Ben yüreği acılarla dolu bir kadınım. Ne şarap içtim, ne de başka bir içki. Sadece yüreğimi RAB'be döküyordum.
౧౫అందుకు హన్నా “ప్రభూ, అది కాదు, నేను మనసులో దుఃఖంతో నిండి ఉన్నాను. నేను ద్రాక్షరసం గానీ, మరి ఏ మద్యం గానీ తీసుకోలేదు. నా ఆత్మను యెహోవా సన్నిధిలో ఒలకబోస్తూ ఉన్నాను.
16 Kulunu kötü bir kadın sanma. Yakarışımı şimdiye dek sürdürmemin nedeni çok kaygılı, üzüntülü olmamdır.”
౧౬నీ సేవకురాలనైన నన్ను చెడ్డదానిగా అనుకోవద్దు. మితిమీరిన దిగులు, అందోళనల వల్ల నాలో నేను చెప్పుకుంటున్నాను” అని జవాబిచ్చింది.
17 Eli, “Öyleyse esenlikle git” dedi, “İsrail'in Tanrısı dileğini yerine getirsin.”
౧౭అప్పుడు ఏలీ “నువ్వు క్షేమంగా వెళ్లు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసికొన్న మనవి ఆయన దయచేస్తాడు గాక” అని ఆమెతో చెప్పాడు.
18 Hanna, “Senin gözünde lütuf bulayım” deyip yoluna gitti. Sonra yemek yedi. Artık üzgün değildi.
౧౮ఆమె అతనితో “నీ సేవకురాలనైన నేను ఈ విషయంలో కృప పొందుతాను” అన్నది. తరువాత ఆ స్త్రీ తన ఇంటికి వెళ్లిపోయి భోజనం చేస్తూ అప్పటినుండి విచారంగా ఉండడం మానుకుంది.
19 Ertesi sabah erkenden kalkıp RAB'be tapındılar. Ondan sonra Rama'daki evlerine döndüler. Elkana karısı Hanna'yla birleşti ve RAB Hanna'yı anımsadı.
౧౯తరువాత వారు ఉదయాన్నే త్వరగా లేచి యెహోవాకు మొక్కి తిరిగి రమాలోని తమ ఇంటికి వచ్చారు. అప్పుడు ఎల్కానా తన భార్య హన్నాను కూడినప్పుడు, యెహోవా ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు.
20 Zamanı gelince Hanna gebe kaldı ve bir erkek çocuk doğurdu. “Onu RAB'den diledim” diyerek adını Samuel koydu.
౨౦హన్నా గర్భం ధరించి, రోజులు గడిచిన తరువాత ఒక కొడుకుని కని “నేను మహోన్నతమైన యెహోవాకు మొక్కుకుని వీణ్ణి అడిగాను” అని చెప్పి ఆ పసికందుకు సమూయేలు అని పేరు పెట్టింది.
21 Elkana RAB'be yıllık kurbanını ve adağını sunmak üzere ev halkıyla birlikte Şilo'ya gitti.
౨౧ఎల్కానా, అతని ఇంటి వారంతా యెహోవాకు ప్రతి ఏడూ అర్పించే బలులు అర్పించడానికి, మొక్కుబడులు చెల్లించడానికి వెళ్లారు.
22 Ama Hanna gitmedi. Kocasına, “Çocuk sütten kesildikten sonra onu RAB'bin hizmetinde bulunmak üzere götüreceğim. Yaşamı boyunca orada kalacak” dedi.
౨౨అయితే హన్నా “బిడ్డ పాలు మానే వరకూ నేను రాను, వాడు యెహోవా సన్నిధిలో కనపడి మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే ఉండేలా నేను వాణ్ణి తీసుకువస్తాను” అని తన భర్తతో చెప్పి మందిరానికి వెళ్ళలేదు.
23 Kocası Elkana, “Nasıl istersen öyle yap” diye karşılık verdi, “Çocuk sütten kesilinceye dek burada kal. RAB sözünü yerine getirsin.” Böylece Hanna oğlu sütten kesilinceye dek evde kalıp onu emzirdi.
౨౩అప్పుడు ఆమె భర్త ఎల్కానా “నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. నువ్వు వాడికి పాలు మాన్పించే వరకూ రావద్దు. యెహోవా తన వాక్కును స్థిరపరుస్తాడు గాక” అని ఆమెతో అన్నాడు. ఆమె అక్కడే ఉండిపోయి తన కొడుకు పాలు మానేవరకూ అతన్ని పెంచుతూ ఉంది.
24 Küçük çocuk sütten kesildikten sonra Hanna üç yaşında bir boğa, bir efa un ve bir tulum şarap alarak onu kendisiyle birlikte RAB'bin Şilo'daki tapınağına götürdü.
౨౪పాలు మానిన తరువాత బాలుడు ఇంకా పసి వాడుగా ఉన్నప్పుడే ఆమె అతణ్ణి ఎత్తుకుని మూడేళ్ళ కోడెదూడ, తూమెడు పిండి, ద్రాక్షారసం తిత్తిని తీసుకు షిలోహులోని మందిరానికి వచ్చింది.
25 Boğayı kestikten sonra çocuğu Eli'ye getirdiler.
౨౫వారు ఒక కోడెను వధించి, పిల్లవాణ్ణి ఏలీ దగ్గరకి తీసుకు వచ్చారు. అప్పుడామె అతనితో ఇలా చెప్పింది,
26 Hanna, “Ey efendim, yaşamın hakkı için derim ki, burada yanında durup RAB'be yakaran kadınım ben” dedi,
౨౬“ప్రభూ, నా ప్రభువు జీవం తోడు నీ దగ్గర నిలబడి బిడ్డను దయచేయమని యెహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే.
27 “Bu çocuk için yakarmıştım; RAB dileğimi yerine getirdi.
౨౭యెహోవాను నేను వేడుకొన్నది ఆయన నాకు అనుగ్రహించాడు.
28 Ben de onu RAB'be adıyorum. Yaşamı boyunca RAB'be adanmış kalacaktır.” Sonra orada RAB'be tapındılar.
౨౮కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు సమర్పిస్తున్నాను. అతడు జీవించే కాలమంతటిలో వాడు యెహోవాకు ప్రతిష్ట అయిన వాడు” అని చెప్పింది. ఎల్కానా, అతని కుటుంబం అక్కడే యెహోవాను ఆరాధించారు.

< 1 Samuel 1 >