< 1 Samuel 26 >

1 Zifliler Giva'ya, Saul'un yanına gidip, “Davut Yeşimon'a bakan Hakila Tepesi'nde gizleniyor” dediler.
గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి జీఫు నివాసులు వచ్చి, దావీదు యెషీమోను ఎదుట హకీలా కొండలో దాక్కున్నాడని తెలియజేశారు.
2 Bunun üzerine Saul üç bin seçme İsrailli askerle Zif Çölü'nde Davut'u aramaya çıktı.
సౌలు లేచి ఇశ్రాయేలీయుల్లో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకు దావీదును వెదకడానికి జీఫుకు బయలుదేరాడు.
3 Yeşimon'a bakan Hakila Tepesi'nde, yol kenarında ordugah kurdu. Kırda bulunan Davut, Saul'un peşine düştüğünü anlayınca,
సౌలు యెషీమోను ఎదుట ఉన్న హకీలా కొండలో దారి పక్కన దిగినప్పుడు, ఎడారిలో ఉంటున్న దావీదు తనను పట్టుకోవాలని సౌలు వచ్చాడని విని,
4 gözcü gönderdi. Böylece Saul'un oraya geldiğini saptadı.
గూఢచారులను పంపి “సౌలు కచ్చితంగా వచ్చాడు” అని తెలుసుకున్నాడు.
5 Bunun üzerine Davut, Saul'un ordugah kurduğu yere gitti ve Saul'la ordusunun başkomutanı Ner oğlu Avner'in nerede yattıklarını gördü. Saul ordugahın ortasında, askerler de çevresinde yatıyorlardı.
తరువాత దావీదు లేచి సౌలు సైన్యం మకాం వేసిన స్థలానికి వచ్చి, సౌలు, సౌలు సైన్యాధిపతి, నేరు కొడుకు అబ్నేరు నిద్రపోతున్న స్థలం చూశాడు. సౌలు శిబిరం మధ్యలో నిద్ర పోతున్నప్పుడు సైనికులు అతని చుట్టూ పడుకున్నారు.
6 O zaman Davut, Hititli Ahimelek ile Yoav'ın kardeşi, Seruya oğlu Avişay'a, “Kim benimle ordugaha, Saul'un yanına gelecek?” diye sordu. Avişay, “Ben seninle geleceğim” diye karşılık verdi.
అప్పుడు దావీదు “శిబిరంలో ఉన్న సౌలు దగ్గరికి నాతో కలసి ఎవరు వస్తారు” అని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కొడుకు, యోవాబు సోదరుడైన అబీషైని అడిగాడు. “నీతో నేను వస్తాను” అని అబీషై అన్నాడు.
7 Davut'la Avişay o gece ordugaha girdiler. Saul, mızrağı başucunda yere saplanmış, ordugahın ortasında uyuyordu. Avner'le askerler de çevresinde uyuyorlardı.
దావీదు, అబీషైలు రాత్రి సమయంలో ఆ శిబిరం దగ్గరికి వెళితే సౌలు శిబిరం మధ్యలో పండుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని దిండు పక్క నేలకు గుచ్చి ఉంది. అబ్నేరు, ఇతరులు సౌలు చుట్టూ పండుకుని నిద్రపోతున్నారు.
8 Avişay Davut'a, “Bugün Tanrı düşmanını senin eline teslim etti” dedi, “Şimdi bırak da, onu kendi mızrağıyla bir atışta yere çakayım. İkinci kez vurmama gerek kalmayacak.”
అప్పుడు అబీషై దావీదును చూసి “దేవుడు ఈ రోజున నీ శత్రువుని నీకు అప్పగించాడు. నీకు ఇష్టమైతే అతడు భూమిలో దిగిపోయేలా ఆ ఈటెతో ఒక్కపోటు పొడుస్తాను. ఒక దెబ్బతో పరిష్కారం చేస్తాను” అన్నాడు.
9 Ne var ki Davut, “Onu öldürme!” dedi, “RAB'bin meshettiği kişiye kim el uzatırsa, suçlu çıkar.
అప్పుడు దావీదు “నువ్వు అతణ్ణి చంపకూడదు, యెహోవా చేత అభిషేకం పొందినవాణ్ణి చంపి దోషి కాకుండా ఉండడం ఎవరివల్లా కాదు.
10 Yaşayan RAB'bin adıyla derim ki, RAB kendisi onu öldürecektir; ya günü gelince ölecek, ya da savaşta vurulup yok olacak.
౧౦యెహోవా మీద ఒట్టు, యెహోవాయే అతణ్ణి శిక్షిస్తాడు, అతడు ప్రమాదం వల్ల చస్తాడు, లేకపోతే యుద్ధంలో నశిస్తాడు.
11 Ama RAB'bin meshettiği kişiye el uzatmaktan RAB beni uzak tutsun! Haydi, Saul'un başucundaki mızrakla su matarasını al da gidelim.”
౧౧యెహోవా వలన అభిషేకం పొందినవాణ్ణి నేను చంపను. అలా చేయకుండా యెహోవా నన్ను ఆపుతాడు గాక. అయితే అతని దిండు దగ్గర ఉన్న ఈటె, నీళ్లబుడ్డి తీసుకు మనం వెళ్ళిపోదాం పద” అని అబీషైతో చెప్పాడు.
12 Böylece Davut Saul'un başucundan mızrağını ve su matarasını aldı. Sonra oradan uzaklaştılar. Onları gören olmadı. Kimse olup bitenin farkına varmadı, uyanan da olmadı. Hepsi uyuyorlardı, çünkü RAB onlara derin bir uyku vermişti.
౧౨సౌలు దిండు దగ్గర ఉన్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకు ఇద్దరూ వెళ్ళిపోయారు. యెహోవా వల్ల అక్కడు ఉన్న వారందరికీ గాఢనిద్ర కలిగింది. వారిలో ఎవ్వరూ నిద్ర నుండి లేవలేదు. ఎవ్వరూ వచ్చిన వాళ్ళను చూడలేదు, ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు.
13 Davut karşı yakaya geçip tepenin üstünde, onlardan uzak bir yerde durdu. Aralarında epeyce mesafe vardı.
౧౩తరువాత దావీదు దూరంగా వెళ్ళి అక్కడ ఉన్న కొండపై నిలబడ్డాడు. వీరిద్దరి మధ్యా చాలా ఎడం ఉంది.
14 Davut askerlere ve Ner oğlu Avner'e, “Ey Avner, bana yanıt vermeyecek misin?” diye seslendi. Avner, “Sen kimsin ki krala sesleniyorsun?” diye karşılık verdi.
౧౪అప్పుడు ప్రజలు, నేరు కొడుకు అబ్నేరు వినేలా “అబ్నేరూ, నువ్వు మాట్లాడతావా?” అని గట్టిగా కేకవేస్తే, అబ్నేరు కేకలు వేస్తూ “రాజుకు నిద్రాభంగం చేస్తున్న నువ్వు ఎవరివి?” అని అడిగాడు.
15 Davut, “Sen yiğit biri değil misin?” dedi, “İsrail'de senin gibisi var mı? Öyleyse neden efendin kralı korumadın? Çünkü biri onu öldürmek için ordugaha girdi.
౧౫అప్పుడు దావీదు “నీకు ధైర్యం లేదా? ఇశ్రాయేలీయుల్లో నీలాంటి వాడు ఎవరు? నీకు యజమాని అయిన రాజుకు నువ్వెందుకు కాపలా కాయలేకపోయావు? నీకు యజమాని అయిన రాజును చంపడానికి ఒకడు దగ్గరగా వచ్చాడే.
16 Görevini iyi yapmadın. Yaşayan RAB'bin adıyla derim ki, hepiniz ölümü hak ettiniz; çünkü efendinizi, RAB'bin meshettiği kişiyi korumadınız. Bak bakalım, kralın başucundaki mızrağıyla su matarası nerede?”
౧౬నువ్వు చేసిన పని సరి కాదు, నువ్వు శిక్షకు పాత్రుడివే. యెహోవా వలన అభిషేకం పొందిన నీ యజమానికి నువ్వు రక్షణగా ఉండలేదు. యెహోవా మీద ఒట్టు, నువ్వు మరణశిక్ష పొందాల్సిందే. రాజు ఈటె ఎక్కడ ఉందో చూడు, అతని దిండు దగ్గర ఉన్న నీళ్లబుడ్డి ఎక్కడ ఉందో చూడు” అన్నాడు.
17 Davut'un sesini tanıyan Saul, “Davut, oğlum, bu senin sesin mi?” diye sordu. Davut, “Evet, efendim kral, benim sesim” diye karşılık verdi,
౧౭సౌలు దావీదు గొంతు గుర్తుపట్టి “దావీదూ, నాయనా, ఇది నీ గొంతే కదా” అని పిలిచాడు. అందుకు దావీదు “నా యజమానీ, నా రాజా, ఇది నా స్వరమే.
18 “Efendim, ben kulunu neden kovalıyorsun? Ne yaptım? Ne suç işledim?
౧౮నా యజమాని దాసుడనైన నన్ను ఈ విధంగా అతడు ఎందుకు తరుముతున్నాడు? నేనేం చేశాను? నా నుండి నీకు ఏ కీడు సంభవిస్తుంది?
19 Lütfen, efendim kral, kulunun sözlerine kulak ver. Eğer seni bana karşı kışkırtan RAB ise, bir sunu O'nu yatıştırır. Ama bunu yapan insanlarsa, RAB'bin önünde lanetli olsunlar! Çünkü, ‘Git, başka ilahlara kulluk et’ diyerek, RAB'bin mirasından bana düşen paydan bugün beni uzaklaştırdılar.
౧౯రాజా, నా యజమానీ, దాసుడనైన నా మాటలు విను. నా మీద పగ సాధించాలని యెహోవా నిన్ను ప్రేరేపిస్తే ఆయన అర్పణ స్వీకరించి ఆయన్ను శాంతిపరచవచ్చు. మనుషులెవరైనా నిన్ను ప్రేరేపించినట్టైతే వారు తప్పక యెహోవా దృష్టిలో శాపానికి గురి అవుతారు. ఎందుకంటే వారు, ‘నువ్వు దేశం విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను పూజించు’ అని నాకు చెప్పి, యెహోవా సన్నిధానం నుండి నన్ను దూరం చేస్తున్నారు.
20 Ne olur, kanım RAB'den uzak topraklara dökülmesin. İsrail Kralı, dağlarda keklik avlayan avcı gibi, bir pireyi avlamaya çıkmış!”
౨౦నా దేశానికి, యెహోవా సన్నిధానానికి దూరంగా నా రక్తం ఒలక నియ్యవద్దు. ఒకడు బయలుదేరి కొండలపై కౌజుపిట్టను వేటాడినట్టుగా ఇశ్రాయేలు రాజవైన నువ్వు పురుగులాంటి నన్ను వెదకడానికి బయలుదేరి వచ్చావు.”
21 Bunun üzerine Saul, “Günah işledim” diye karşılık verdi, “Davut, oğlum, geri dön. Bugün yaşamıma değer verdiğin için sana bir daha kötülük yapmayacağım. Gerçekten akılsızca davrandım, çok büyük yanlışlık yaptım.”
౨౧అప్పుడు సౌలు “నేను పాపం చేశాను, ఈ రోజు నా ప్రాణం నీ దృష్టిలో విలువైనదిగా ఉన్నదాన్నిబట్టి నేను నీకు ఇక ఎన్నడూ హాని తలపెట్టను. దావీదూ, నా కొడుకా, నా దగ్గరికి తిరిగి వచ్చేయి. పిచ్చి వాడిలాగా ప్రవర్తించి నేను ఎన్నో తప్పులు చేశాను” అని పలికాడు.
22 Davut, “İşte kralın mızrağı!” dedi, “Adamlarından biri gelip alsın.
౨౨దావీదు “రాజా, ఇదిగో నీ ఈటె నా దగ్గర ఉంది. పనివాళ్ళలో ఒకడు వచ్చి దీన్ని తీసుకోవచ్చు” అన్నాడు.
23 RAB herkesi doğruluğuna ve bağlılığına göre ödüllendirir. Bugün RAB seni elime teslim ettiği halde, ben RAB'bin meshettiği kişiye elimi uzatmak istemedim.
౨౩“యెహోవా ఈ రోజున నిన్ను నాకు అప్పగించినప్పటికీ, నేను యెహోవా వలన అభిషేకించబడిన వాణ్ణి చంపకుండా వదిలినందువల్ల ఆయన నా నీతి, విశ్వాస్యతను బట్టి నాకు తగిన బహుమానం ఇస్తాడు.
24 Bugün ben senin yaşamına nasıl değer verdiysem, RAB de benim yaşamıma öyle değer versin ve beni her sıkıntıdan kurtarsın.”
౨౪విను, ఈ రోజు నీ ప్రాణం నా దృష్టిలో విలువైనది అయినట్టే, యెహోవా నా ప్రాణాన్ని తన దృష్టికి మిన్నగా ఎంచి బాధలన్నిటిలోనుండి నన్ను రక్షిస్తాడు గాక” అని చెప్పాడు.
25 Saul, “Davut, oğlum, RAB seni kutsasın!” dedi, “Sen kesinlikle büyük işler yapacak, başarılı olacaksın!” Bundan sonra Davut yoluna koyuldu, Saul da evine döndü.
౨౫అప్పుడు సౌలు “దావీదూ, బిడ్డా, నీకు ఆశీర్వాదం కలుగు గాక. నీవు గొప్ప పనులు మొదలుపెట్టి విజయం సాధిస్తావు గాక” అని దావీదుతో చెప్పాడు. అప్పుడు దావీదు తన దారిన వెళ్లిపోయాడు. సౌలు కూడా తన స్థలానికి తిరిగి వచ్చాడు.

< 1 Samuel 26 >