< 1 Samuel 24 >

1 Saul Filistliler'i kovalamaktan dönünce, Davut'un Eyn-Gedi Çölü'nde olduğu haberini aldı.
సౌలు ఫిలిష్తీయులను తరమడం మానుకుని తిరిగి వెళ్ళాక, దావీదు ఏన్గెదీ అరణ్య ప్రాంతంలో ఉన్నాడని అతనికి కబురు వచ్చింది.
2 Saul da Davut'la adamlarını Dağ Keçisi Kayalığı dolaylarında arayıp bulmak için, bütün İsrail'den üç bin seçme asker alıp yola çıktı.
అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి, కొండమేకలు ఉండే రాతి కొండల మీద దావీదును అతని అనుచరులను వెదకడానికి బయలుదేరాడు.
3 Yolda koyun ağıllarına rastladı. Yakında bir de mağara vardı. Saul ihtiyacını gidermek için mağaraya girdi. Davut'la adamları mağaranın en iç bölümünde kalıyorlardı.
దారిలో గొర్రెల దొడ్లకు అతడు వస్తే అక్కడ ఒక గుహ కనిపించింది. సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు.
4 Adamları, Davut'a, “İşte RAB'bin sana, ‘Dilediğini yapabilmen için düşmanını eline teslim edeceğim’ dediği gün bugündür” dediler. Davut kalkıp Saul'un cüppesinin eteğinden gizlice bir parça kesti.
దావీదు అనుచరులు “నీ దృష్టికి ఏది మంచిదో అది చేసేందుకు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా నీతో చెప్పిన రోజు వచ్చింది” అని అతనితో చెప్పారు. దావీదు లేచి వెళ్ళి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోశాడు.
5 Ama sonradan Saul'un eteğinden bir parça kestiği için kendini suçlu buldu.
సౌలు పై వస్రాన్ని కోసినందుకు దావీదు మనస్సులో నొచ్చుకుని,
6 Adamlarına, “Efendime, RAB'bin meshettiği kişiye karşı böyle bir şey yapmaktan, el kaldırmaktan RAB beni uzak tutsun” dedi, “Çünkü o RAB'bin meshettiği kişidir.”
“ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి యెహోవా చేత అభిషిక్తుడైన నా రాజు పట్ల నేను ఈ పని చేయను, యెహోవాను బట్టి నేను అతణ్ణి చంపను” అని తన వారితో చెప్పాడు.
7 Davut bu sözlerle adamlarını engelledi ve Saul'a saldırmalarına izin vermedi. Saul mağaradan çıkıp yoluna koyuldu.
ఈ మాటలు చెప్పి దావీదు సౌలు మీదికి వెళ్ళకుండా తన వారిని అడ్డగించాడు. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలుదేరి తన దారిన వెళ్ళిపోయాడు.
8 O zaman Davut da mağaradan çıktı. Saul'a, “Efendim kral!” diye seslendi. Saul arkasına bakınca, Davut eğilip yüzüstü yere kapandı.
అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వచ్చి “నా యజమానీ, రాజా” అని వెనుక నుండి కేకవేస్తే, సౌలు వెనక్కి చూశాడు. దావీదు నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి
9 “‘Davut sana kötülük yapmak istiyor’ diyenlerin sözlerini neden önemsiyorsun?” dedi,
సౌలుతో ఇలా అన్నాడు “దావీదు నీకు కీడుచేయాలని చూస్తున్నాడని కొందరు చెబుతున్న మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు?
10 “Bugün RAB'bin mağarada seni elime nasıl teslim ettiğini gözünle görüyorsun. Bazıları seni öldürmemi istedi. Ama ben seni esirgeyip, ‘Efendime el kaldırmayacağım, çünkü o RAB'bin meshettiği kişidir’ dedim.
౧౦ఆలోచించు. ఈ రోజున యెహోవా నిన్ను గుహలో నా చేతికి ఎలా అప్పగించాడో నీ కళ్ళారా చూశావు కదా. కొంతమంది నిన్ను చంపేయమని నాకు చెప్పినప్పటికీ నేనలా చెయ్యలేదు. ‘ఇతడు యెహోవా వలన అభిషేకం పొందిన వాడు కాబట్టి నా ఏలినవాడిపై చెయ్యి ఎత్తను’ అని చెప్పాను.
11 Ey baba, cüppenin eteğinden kesilmiş, elimdeki şu parçaya bak; evet, bak! Cüppenden bir parça kestim, ama seni öldürmedim. Bundan ötürü içimde kötülük ve başkaldırma düşüncesi olmadığını iyice bilesin. Sana kötülük yapmadığım halde sen beni öldürmeye çalışıyorsun.
౧౧నా తండ్రీ, చూడు. నిన్ను చంపకుండా నీ బట్ట చెంగును మాత్రమే కోశాను. దీన్ని బట్టి నా వల్ల నీకు ఎలాంటి కీడూ రాదనీ నాలో ఎలాంటి తప్పూ లేదనీ నువ్వు తెలుసుకోవచ్చు. నీ విషయంలో నేను ఏ పాపమూ చేయకుండా ఉంటే నువ్వు నా ప్రాణం తీయాలని నన్ను తరుముతున్నావు.
12 RAB aramızda yargıç olsun ve benim öcümü senden O alsın. Ama ben elimi sana karşı kaldırmayacağım.
౧౨నీకూ నాకూ మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. యెహోవా నా విషయంలో పగ సాధిస్తాడు. నేను మాత్రం నిన్ను చంపను.
13 Eskilerin şu, ‘Kötülük kötü kişilerden gelir’ deyişi uyarınca elim sana karşı kalkmayacaktır.
౧౩పితరులు సామెత చెప్పినట్టు దుర్మార్గుల నుండి దుర్మార్గత పుడుతుంది. అయితే నేను నిన్ను చంపను.
14 İsrail Kralı kime karşı çıkmış? Sen kimi kovalıyorsun? Ölü bir köpek mi? Bir pire mi?
౧౪ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకోవాలని బయలుదేరి వచ్చాడు? ఏ పాటి వాణ్ణి తరుముతున్నాడు? చచ్చిన కుక్కనా? పురుగునా?
15 RAB yargıç olsun ve hangimizin haklı olduğuna O karar versin. RAB davama baksın ve beni savunup senin elinden kurtarsın.”
౧౫యెహోవా నీకూ, నాకూ మధ్య న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తాడుగాక. ఆయనే అసలు విషయం విచారణ జరిపి నా తరపున వాదులాడి నిన్ను కాక నన్ను నిర్దోషిగా తీరుస్తాడు గాక.”
16 Davut söylediklerini bitirince, Saul, “Davut oğlum, bu senin sesin mi?” diye sordu ve hıçkıra hıçkıra ağlamaya başladı.
౧౬దావీదు సౌలుతో ఈ మాటలు మాట్లాడి ముగించినప్పుడు, సౌలు “దావీదూ, నాయనా, ఈ మాటలు అన్నది నువ్వేనా?” అని బిగ్గరగా ఏడ్చి
17 Sonra, “Sen benden daha doğru bir adamsın” dedi, “Sana kötülük yaptığım halde sen bana iyilikle karşılık verdin.
౧౭దావీదుతో ఇలా అన్నాడు. “యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నన్ను చంపకుండా విడిచిపెట్టినందుకు
18 Bugün bana iyi davrandığını kanıtladın: RAB beni eline teslim ettiği halde beni öldürmedin.
౧౮ఈ రోజున నువ్వు అపకారానికి ఉపకారం చేసి, నా పట్ల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు. నువ్వు నాకంటే నీతిమంతుడివి.
19 Düşmanını yakalayan biri onu güvenlik içinde salıverir mi? Bugün bana yaptığın iyiliğe karşılık RAB de seni iyilikle ödüllendirsin.
౧౯ఒకరికి తన శత్రువు దొరికినప్పుడు మేలు చేసి పంపివేస్తాడా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు మేలు చేస్తాడు గాక.
20 Şimdi anladım ki, sen gerçekten kral olacaksın ve İsrail Krallığı senin egemenliğin altında sürecek.
౨౦కచ్చితంగా నువ్వు రాజువవుతావు. ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్థిరం అయిందని నాకు తెలుసు.
21 Benden sonra soyumu ortadan kaldırmayacağına, babamın ailesinden adımı silmeyeceğine dair RAB'bin önünde ant iç.”
౨౧కాబట్టి నా తరువాత నా సంతతిని నీవు నిర్మూలం చేయకుండా ఉండేలా, నా తండ్రి ఇంట్లోనుండి నా పేరు కొట్టివేయకుండేలా, యెహోవా నామం పేరిట నాకు శపథం చెయ్యి.” అప్పుడు దావీదు సౌలుకు శపథం చేశాడు.
22 Davut Saul'un istediği gibi ant içti. Sonra Saul evine döndü. Davut'la adamları da sığınağa gittiler.
౨౨తరువాత సౌలు ఇంటికి తిరిగివచ్చాడు. దావీదు, అతని అనుచరులు తాము దాక్కొన్న స్థలాలకు వెళ్ళిపోయారు.

< 1 Samuel 24 >