< జెకర్యా 9 >

1 హద్రాకు దేశాన్ని గూర్చి, దమస్కు పట్టణాన్ని గూర్చి వచ్చిన దేవోక్తి.
מַשָּׂא דְבַר־יְהֹוָה בְּאֶרֶץ חַדְרָךְ וְדַמֶּשֶׂק מְנֻחָתוֹ כִּי לַֽיהֹוָה עֵין אָדָם וְכֹל שִׁבְטֵי יִשְׂרָאֵֽל׃
2 ఎందుకంటే యెహోవా మనుషులందరినీ ఇశ్రాయేలీ గోత్రాల వారినందరినీ లక్ష్యపెట్టేవాడు గనుక, దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతును గూర్చి, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చి ఆ సందేశం వచ్చింది.
וְגַם־חֲמָת תִּגְבׇּל־בָּהּ צֹר וְצִידוֹן כִּי חָֽכְמָה מְאֹֽד׃
3 తూరు పట్టణం వారు ప్రాకారాలు గల కోట కట్టుకుని, ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని, వీధుల్లోని కసువంత విస్తారంగా బంగారాన్ని సమకూర్చుకున్నారు.
וַתִּבֶן צֹר מָצוֹר לָהּ וַתִּצְבׇּר־כֶּסֶף כֶּֽעָפָר וְחָרוּץ כְּטִיט חוּצֽוֹת׃
4 సముద్రంలో ఉన్న దాని బలాన్ని యెహోవా నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగిస్తాడు. అది తగలబడి పోతుంది.
הִנֵּה אֲדֹנָי יֽוֹרִשֶׁנָּה וְהִכָּה בַיָּם חֵילָהּ וְהִיא בָּאֵשׁ תֵּאָכֵֽל׃
5 అష్కెలోను దాన్ని చూసి బెదిరిపోతుంది. గాజా దాన్ని చూసి వణికిపోతుంది. ఎక్రోను పట్టణం తాను దేనిపై నమ్మకం పెట్టుకుందో దాని పరువు పోవడం చూసి భీతిల్లుతుంది. గాజాలో ఉన్న రాజు అంతరిస్తాడు. అష్కెలోను నిర్జనమై పోతుంది.
תֵּרֶא אַשְׁקְלוֹן וְתִירָא וְעַזָּה וְתָחִיל מְאֹד וְעֶקְרוֹן כִּֽי־הֹבִישׁ מֶבָּטָהּ וְאָבַד מֶלֶךְ מֵֽעַזָּה וְאַשְׁקְלוֹן לֹא תֵשֵֽׁב׃
6 అష్డోదులో సంకర జాతి వారు కాపురం ఉంటారు. ఫిలిష్తీయుల గర్వ కారణాన్ని నేను నాశనం చేస్తాను.
וְיָשַׁב מַמְזֵר בְּאַשְׁדּוֹד וְהִכְרַתִּי גְּאוֹן פְּלִשְׁתִּֽים׃
7 వారి నోటి నుండి రక్తాన్ని, వారు తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసాన్ని నేను తీసివేస్తాను. అప్పుడు వారు మన దేవునికి యూదా గోత్రం వలె శేషంగా ఉంటారు. ఎక్రోను వారు కూడా యెబూసీయుల్లాగా ఉంటారు.
וַהֲסִרֹתִי דָמָיו מִפִּיו וְשִׁקֻּצָיו מִבֵּין שִׁנָּיו וְנִשְׁאַר גַּם־הוּא לֵֽאלֹהֵינוּ וְהָיָה כְּאַלֻּף בִּֽיהוּדָה וְעֶקְרוֹן כִּיבוּסִֽי׃
8 నేను కన్నులారా చూశాను గనక బాధించేవారు ఇకపై సంచరించకుండా, తిరుగులాడే సైన్యాలు నా మందిరం మీదికి రాకుండా దాన్ని కాపాడుకోడానికి నేనొక సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను.
וְחָנִיתִי לְבֵיתִי מִצָּבָה מֵעֹבֵר וּמִשָּׁב וְלֹֽא־יַעֲבֹר עֲלֵיהֶם עוֹד נֹגֵשׂ כִּי עַתָּה רָאִיתִי בְעֵינָֽי׃
9 సీయోను నివాసులారా, సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతితో, రక్షణ తీసుకుని, దీనుడై, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు.
גִּילִי מְאֹד בַּת־צִיּוֹן הָרִיעִי בַּת יְרוּשָׁלַ͏ִם הִנֵּה מַלְכֵּךְ יָבוֹא לָךְ צַדִּיק וְנוֹשָׁע הוּא עָנִי וְרֹכֵב עַל־חֲמוֹר וְעַל־עַיִר בֶּן־אֲתֹנֽוֹת׃
10 ౧౦ నేను ఎఫ్రాయిములో రథాలుండకుండా చేస్తాను. యెరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తాను. యుద్ధపు విల్లు లేకుండా పోతుంది. నీ రాజు సమాధానవార్త అన్యప్రజలకు తెలియజేస్తాడు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకూ యూఫ్రటీసు నది మొదలు భూదిగంతం వరకూ అతడు పరిపాలిస్తాడు.
וְהִכְרַתִּי־רֶכֶב מֵאֶפְרַיִם וְסוּס מִירוּשָׁלַ͏ִם וְנִכְרְתָה קֶשֶׁת מִלְחָמָה וְדִבֶּר שָׁלוֹם לַגּוֹיִם וּמׇשְׁלוֹ מִיָּם עַד־יָם וּמִנָּהָר עַד־אַפְסֵי־אָֽרֶץ׃
11 ౧౧ నీవు చేసిన నిబంధన రక్తాన్ని బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపిస్తాను.
גַּם־אַתְּ בְּדַם־בְּרִיתֵךְ שִׁלַּחְתִּי אֲסִירַיִךְ מִבּוֹר אֵין מַיִם בּֽוֹ׃
12 ౧౨ బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గల మీరంతా మీ కోటలో మళ్ళీ ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేస్తానని ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను.
שׁוּבוּ לְבִצָּרוֹן אֲסִירֵי הַתִּקְוָה גַּם־הַיּוֹם מַגִּיד מִשְׁנֶה אָשִׁיב לָֽךְ׃
13 ౧౩ యూదా వారిని నాకు విల్లుగా వంచుతున్నాను. ఎఫ్రాయిము వారిని బాణాలుగా చేస్తున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుతున్నాను. శూరుడు కత్తి ఝలిపించినట్టు నేను నిన్ను ప్రయోగిస్తాను. గ్రీసు దేశవాసులారా, సీయోను కుమారులను మీ మీదికి రేపుతున్నాను.
כִּֽי־דָרַכְתִּי לִי יְהוּדָה קֶשֶׁת מִלֵּאתִי אֶפְרַיִם וְעוֹרַרְתִּי בָנַיִךְ צִיּוֹן עַל־בָּנַיִךְ יָוָן וְשַׂמְתִּיךְ כְּחֶרֶב גִּבּֽוֹר׃
14 ౧౪ యెహోవా వారికి పైగా ప్రత్యక్షమౌతాడు. ఆయన బాణాలు మెరుపువలె వెలువడుతాయి. ప్రభువగు యెహోవా శంఖం పూరిస్తూ దక్షిణ దిక్కునుండి వచ్చే గొప్ప సుడిగాలితో బయలు దేరుతాడు.
וַֽיהֹוָה עֲלֵיהֶם יֵֽרָאֶה וְיָצָא כַבָּרָק חִצּוֹ וַֽאדֹנָי יֱהֹוִה בַּשּׁוֹפָר יִתְקָע וְהָלַךְ בְּסַעֲרוֹת תֵּימָֽן׃
15 ౧౫ సేనల ప్రభువు యెహోవా వారిని కాపాడుతాడు గనక వారు భక్షిస్తూ వడిసెలరాళ్లను అణగ దొక్కుతూ వస్తారు. ద్రాక్షారసం తాగుతూ, తాగడం మూలంగా సింహనాదాలు చేస్తూ, బలిపీఠపు మూలల్లో పెట్టి ఉన్న పాత్రలు రక్తంతో నిండినట్లు నిండిపోతారు.
יְהֹוָה צְבָאוֹת יָגֵן עֲלֵיהֶם וְאָכְלוּ וְכָֽבְשׁוּ אַבְנֵי־קֶלַע וְשָׁתוּ הָמוּ כְּמוֹ־יָיִן וּמָֽלְאוּ כַּמִּזְרָק כְּזָוִיּוֹת מִזְבֵּֽחַ׃
16 ౧౬ నా ప్రజలు యెహోవా దేశంలో కిరీటంలోని రత్నాల్లా ఉన్నారు గనక కాపరి తన మందను రక్షించినట్టు వారి దేవుడైన యెహోవా ఆ దినాన వారిని రక్షిస్తాడు.
וְֽהוֹשִׁיעָם יְהֹוָה אֱלֹהֵיהֶם בַּיּוֹם הַהוּא כְּצֹאן עַמּוֹ כִּי אַבְנֵי־נֵזֶר מִֽתְנוֹסְסוֹת עַל־אַדְמָתֽוֹ׃
17 ౧౭ అది ఎంత రమ్యంగా మేలుగా ఉంటుంది! ధాన్యం చేత యువకులు, కొత్త ద్రాక్షారసం చేత కన్యలు పుష్టిగా ఉంటారు.
כִּי מַה־טּוּבוֹ וּמַה־יׇּפְיוֹ דָּגָן בַּחוּרִים וְתִירוֹשׁ יְנוֹבֵב בְּתֻלֽוֹת׃

< జెకర్యా 9 >