< పరమగీతము 7 >

1 (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) రాకుమారీ, చెప్పులు తొడిగిన నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! నీ తొడల వంపులు నిపుణుడైన కంసాలి పనితనంతో చేసిన ఆభరణాల్లాగా ఉన్నాయి.
王女啊,你的脚在鞋中何其美好! 你的大腿圆润,好像美玉, 是巧匠的手做成的。
2 నీ బొడ్డు గుండ్రని కలశంలా ఉంది. కలిపిన ద్రాక్షారసం దానిలో ఎప్పుడూ వెలితి కాదు. నీ నడుము లిల్లీ పూలు చుట్టిన గోదుమరాశిలా ఉంది.
你的肚脐如圆杯, 不缺调和的酒; 你的腰如一堆麦子, 周围有百合花。
3 నీ జత స్తనాలు కవల జింకపిల్లల్లా ఉన్నాయి.
你的两乳好像一对小鹿, 就是母鹿双生的。
4 నీ మెడ దంతగోపురంలా ఉంది. నీ కళ్ళు బత్ రబ్బీం ద్వారం దగ్గరున్న హెష్బోను జలాశయాల్లా ఉన్నాయి. నీ నాసిక దమస్కు వైపు చూస్తున్న లెబానోను శిఖరంలా ఉంది.
你的颈项如象牙台; 你的眼目像希实本、巴特·拉并门旁的水池; 你的鼻子仿佛朝大马士革的黎巴嫩塔。
5 నీ తల కర్మెలు పర్వతంలా ఉంది. నీ జుట్టు ముదురు ఊదా రంగు. నొక్కులు తిరిగిన ఆ జుట్టుకు రాజు వశమైపోయాడు.
你的头在你身上好像迦密山; 你头上的发是紫黑色; 王的心因这下垂的发绺系住了。
6 నా ప్రేయసీ, నీ హర్షంతో నువ్వెంత అందంగా లలిత లావణ్యంగా ఉన్నావు!
我所爱的,你何其美好! 何其可悦,使人欢畅喜乐!
7 నువ్వు తాడి చెట్టులా తిన్నగా ఉన్నావు. నీ స్తనాలు పండ్ల గెలల్లా ఉన్నాయి.
你的身量好像棕树; 你的两乳如同其上的果子,累累下垂。
8 “ఆ తాడి చెట్టు ఎక్కుతాను. దాని కొమ్మలు పట్టుకుంటాను” అనుకున్నాను. నీ స్తనాలు ద్రాక్షగెలల్లా, నీ శ్వాస సీమ బాదం వాసనలా ఉండాలి.
我说:我要上这棕树,抓住枝子。 愿你的两乳好像葡萄累累下垂, 你鼻子的气味香如苹果;
9 నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి. మన పెదాల మధ్య, పళ్ళ మధ్య చక్కగా స్రవిస్తూ ఉండాలి.
你的口如上好的酒。 〔新娘〕 女子说:为我的良人下咽舒畅, 流入睡觉人的嘴中。
10 ౧౦ (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నేను నా ప్రియుడికి చెందిన దాన్ని. అతడు నా కోసం తహతహలాడుతున్నాడు.
我属我的良人, 他也恋慕我。
11 ౧౧ ప్రియా, రా. మనం పల్లెకు పోదాం. పల్లెటూర్లో రాత్రి గడుపుదాం.
我的良人,来吧! 你我可以往田间去; 你我可以在村庄住宿。
12 ౧౨ పొద్దున్నే లేచి ద్రాక్షతోటలకు వెళదాం. ద్రాక్షావల్లులు చిగిర్చాయో లేదో, వాటి పూల గుత్తులు వికసించాయో లేదో దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయో లేదో చూద్దాం పద. అక్కడే నీకు నేను నా ప్రేమ పంచుతాను.
我们早晨起来往葡萄园去, 看看葡萄发芽开花没有, 石榴放蕊没有; 我在那里要将我的爱情给你。
13 ౧౩ మాండ్రేక్ మొక్కలు కమ్మని సువాసనలీనుతున్నాయి. మా ఇంటి తలుపు దగ్గర చవులూరించే రక రకాల పళ్ళు కొత్తవీ పాతవీ ఉన్నాయి. ప్రియా, నేను నీ కోసం వాటిని దాచి ఉంచాను.
风茄放香, 在我们的门内有各样新陈佳美的果子; 我的良人,这都是我为你存留的。

< పరమగీతము 7 >