< కీర్తనల~ గ్రంథము 75 >

1 ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తష్హేత్ అనే రాగంలో పాడేది. ఆసాపు కీర్తన, ఒక పాట. దేవా, మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. నువ్వు నీ సన్నిధిని మాకు వెల్లడించావని నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మనుషులు నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తారు.
Przewodnikowi chóru. Al taszchet. Psalm i pieśń Asafa. Wysławiamy cię, Boże, wysławiamy, bo bliskie twoje imię; opowiadają [to] twoje cudowne dzieła.
2 నియామక కాలంలో నేను నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాను.
Gdy wyznaczę czas, będę sądzić sprawiedliwie.
3 భూమి, దాని నివాసులంతా భయంతో వణుకుతున్నప్పుడు నేనే ఈ భూమి స్థంభాలను నిలబెడతాను. (సెలా)
Roztopiła się ziemia i wszyscy jej mieszkańcy, [ale] ja umacniam jej filary. (Sela)
4 అహంకారంగా ఉండవద్దు అని గర్విష్టులకు ఆజ్ఞాపిస్తున్నాను.
Powiedziałem głupcom: Nie szalejcie, a niegodziwym: Nie podnoście rogu.
5 విజయం దొరుకుతుందని అంతగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ తలలు పైకెత్తి మాట్లాడవద్దు అని దుర్మార్గులతో చెప్పాను.
Nie podnoście wysoko swego rogu [i] nie mówcie wyniośle;
6 తూర్పునుండి గానీ పడమటి నుండి గానీ అరణ్యం నుండి గానీ విజయం రాదు.
Bo nie ze wschodu ani z zachodu, ani z południa [przychodzi] wywyższenie.
7 దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకణ్ణి తగ్గిస్తాడు, ఒకణ్ణి హెచ్చిస్తాడు.
Lecz Bóg [jest] sędzią; tego poniża, a tamtego wywyższa.
8 యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది. అందులోని ద్రాక్షారసం పొంగుతూ ఉంది. అది సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. ఆయన దాన్ని పోస్తున్నాడు. భూమిమీద ఉన్న దుర్మార్గులంతా ఆఖరు బొట్టు వరకు దాన్ని తాగాలి.
W ręku PANA bowiem [jest] kielich mętnego wina, pełnego przypraw; z niego nalewa tak, że wszyscy niegodziwi ziemi wycisną nawet męty i wypiją je.
9 నేనైతే ఎప్పుడూ నువ్వు చేసిన కార్యాలను ప్రచారం చేస్తాను. యాకోబు దేవుణ్ణి నేను నిత్యమూ కీర్తిస్తాను.
Ja zaś będę zawsze opowiadał, będę śpiewał Bogu Jakuba.
10 ౧౦ నేను భక్తిహీనుల కొమ్ములను విరగగొడతాను. నీతిమంతుల కొమ్ములు పైకెత్తుతాను అని ఆయన అన్నాడు.
I połamię wszystkie rogi niegodziwych, a rogi sprawiedliwego będą wzniesione.

< కీర్తనల~ గ్రంథము 75 >