< కీర్తనల~ గ్రంథము 71 >

1 యెహోవా, నేను నీ శరణు వేడుకుంటున్నాను. నన్నెన్నడూ సిగ్గుపడనియ్యకు.
Tebi si, Jahve, utječem, ne daj da se ikada postidim!
2 నన్ను రక్షించు. నీ నీతిని బట్టి నన్ను భద్రపరచు. శ్రద్ధగా ఆలకించి నన్ను రక్షించు.
U pravdi me svojoj spasi i izbavi, prikloni uho k meni i spasi me!
3 నీ ఆశ్రయదుర్గంలో ప్రవేశించేందుకు నాకు అనుమతి ఇవ్వు. నా కాపుదల, నా దుర్గం నువ్వే. నువ్వు నన్ను రక్షించాలని నిర్ణయం చేసుకున్నావు.
Budi mi hrid utočišta i čvrsta utvrda spasenja: jer ti si stijena i utvrda moja.
4 నా దేవా, దుష్టుల చేతిలోనుండి నన్ను రక్షించు. కీడు చేసేవాళ్ళ, క్రూరుల పట్టులోనుండి నన్ను విడిపించు.
Bože moj, istrgni me iz ruke zlotvora, iz šake silnika i tlačitelja:
5 నా ప్రభూ, యెహోవా, నా నిరీక్షణకు ఆధారం నువ్వే. నా బాల్యం నుండి నా ఆశ్రయం నువ్వే.
jer ti si, o Gospode, ufanje moje, Jahve, uzdanje od moje mladosti!
6 నేను గర్భంలో ఉన్నది మొదలు నన్ను పోషించింది నువ్వే. తల్లి గర్భం నుండి నన్ను బయటకు తెచ్చింది నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యమూ స్తుతిగానం చేస్తాను.
Na te se oslanjam od utrobe; ti si mi zaštitnik od majčina krila: u te se svagda uzdam.
7 నేను అనేకులకు ఒక వింతగా కనిపిస్తున్నాను. అయినా నాకు బలమైన ఆశ్రయం నువ్వే.
Mnogima postadoh čudo, jer ti si mi bio silna pomoć.
8 నీ కీర్తితో, ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండిపోయింది.
Usta mi bijahu puna tvoje hvale, slaviše te svaki dan!
9 ముసలితనంలో నన్ను విడిచిపెట్టకు. నా బలం క్షీణించినప్పుడు నన్ను వదలకు.
Ne zabaci me u starosti: kad mi malakšu sile, ne zapusti me!
10 ౧౦ నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు. నా ప్రాణం తీయాలని పొంచి ఉన్నవారు కూడబలుక్కుంటున్నారు.
Jer govore o meni moji dušmani, i koji me vrebaju složno se svjetuju:
11 ౧౧ దేవుడు వాణ్ణి విడిచిపెట్టాడు, వాణ్ణి తప్పించేవాడు ఎవరూ లేరు. వాణ్ణి తరిమి పట్టుకుందాం అని వాళ్ళు అనుకుంటున్నారు.
“Bog ga je napustio; progonite ga i uhvatite jer nema tko da ga spasi!”
12 ౧౨ దేవా, నాకు దూరంగా ఉండవద్దు. నా దేవా, నాకు సహాయం చేయడానికి త్వరగా బయలుదేరు.
O Bože, ne stoj daleko od mene, Bože moj, pohitaj mi u pomoć!
13 ౧౩ నా ప్రాణం తీయాలని చూసే విరోధులు సిగ్గుపడి నశిస్తారు గాక. నాకు కీడుచేయాలని చూసేవాళ్ళు నిందలపాలై అవమానం పొందుతారు గాక.
Neka se postide i propadnu koji traže moj život; nek' se sramotom i stidom pokriju koji mi žele nesreću!
14 ౧౪ నేను అన్నివేళలా నిరీక్షణ కలిగి ఉంటాను. మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను.
A ja ću se uvijek uzdati, iz dana u dan hvaleć' te sve više.
15 ౧౫ నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను.
Ustima ću naviještati pravednost tvoju, povazdan pomoć tvoju: jer im ne znam broja.
16 ౧౬ ప్రభువైన యెహోవా బలమైన కార్యాలను నేను వర్ణించడం మొదలు పెడతాను. నీ నీతిని మాత్రమే నేను వివరిస్తాను.
Kazivat ću silu Jahvinu, Gospode, slavit ću samo tvoju pravednost.
17 ౧౭ దేవా, నా బాల్యం నుండి నువ్వు నాకు బోధిస్తూ వచ్చావు. ఇప్పటి వరకూ నీ ఆశ్చర్య కార్యాలను నేను తెలియజేస్తూనే ఉన్నాను.
Bože, ti mi bijaše učitelj od mladosti moje, i sve do sada naviještam čudesa tvoja.
18 ౧౮ దేవా, నేను తల నెరిసి ముసలివాడినైనా నన్ను విడిచిపెట్టకు. రాబోయే తరాలకు నీ బలప్రభావాల గురించి, ఇకపై పుట్టబోయే వాళ్లకు నీ శక్తియుక్తులను గురించి వివరిస్తాను.
Ni u starosti, kad posijedim, Bože, ne zapusti me, da kazujem mišicu tvoju naraštaju novom i svima budućima silu tvoju,
19 ౧౯ దేవా, నీ నీతి ఎత్తయిన ఆకాశాలకన్నా ఉన్నతమైనది. ఘన కార్యాలు చేసిన దేవా, నీకు సాటి ఎవరు?
i pravednost tvoju, Bože, koja seže do neba, kojom učini velika djela. Bože, tko je kao ti!
20 ౨౦ ఎన్నో కఠిన బాధలు మాకు కలిగేలా చేసిన దేవా, నువ్వు మమ్మల్ని మళ్ళీ జీవించేలా చేస్తావు. అగాధ లోయల్లో నుండి మళ్ళీ మమ్మల్ని లేవనెత్తుతావు.
Trpljenja mnoga i velika bacio si na me: ali ti ćeš me opet oživiti i opet me podići iz dubine zemlje.
21 ౨౧ నా గొప్పతనాన్ని వృద్ధిచెయ్యి. నావైపు తిరిగి నన్ను ఆదరించు.
Povećaj dostojanstvo moje i opet me utješi:
22 ౨౨ నా దేవా, నేను నీ యథార్థ క్రియలను బట్టి స్వరమండల వాయిద్యంతో నిన్ను స్తుతిస్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తిస్తాను.
A ja ću uz harfu slaviti tvoju vjernost, o Bože, svirat ću ti u citaru, Sveče Izraelov!
23 ౨౩ నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నప్పుడు నా పెదాలు, నువ్వు విమోచించిన నా ప్రాణం నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాయి. నాకు హాని కలిగించాలని ప్రయత్నించే వాళ్ళు అవమానం పాలై అయోమయంలో ఉన్నారు.
Moje će usne klicati pjevajuć' tebi i moja duša koju si spasio.
24 ౨౪ అయితే నా నాలుక రోజంతా నీ నీతిని వివరిస్తూ ఉంది.
I moj će jezik svagda slaviti pravdu tvoju, jer su postiđeni i posramljeni oni što traže moju nesreću.

< కీర్తనల~ గ్రంథము 71 >