< కీర్తనల~ గ్రంథము 68 >

1 ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. దేవుడు లేస్తాడు గాక, ఆయన శత్రువులు చెదరిపోతారు గాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు గాక.
Przewodnikowi chóru. Psalm i pieśń Dawida. Niech Bóg powstanie, a rozproszeni będą jego wrogowie; niech pouciekają przed jego obliczem ci, którzy go nienawidzą.
2 పొగను చెదరగొట్టినట్టు నువ్వు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనం కరిగిపోయేలా దుర్మార్గులు దేవుని సన్నిధిలో కరిగి నశించిపోతారు గాక.
Jak dym jest rozwiany, tak [ich] rozpędzisz; jak wosk się rozpływa od ognia, [tak] niegodziwi poginą przed obliczem Boga.
3 నీతిమంతులు సంతోషిస్తారు గాక. వారు దేవుని సన్నిధిలో సంతోషించి బహుగా ఆనందిస్తారు గాక.
A sprawiedliwi będą się weselić i cieszyć przed obliczem Boga, i będą się radować niezmiernie.
4 దేవుని గూర్చి పాడండి. ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయండి. యొర్దాను నదీ లోయ ప్రాంతంలో స్వారీ చేసే దేవుని కోసం, ఒక రాజమార్గం ఏర్పాటు చేయండి. ఆయన పేరు యెహోవా. ఆయన ఎదుట పండగ చేసుకోండి.
Śpiewajcie Bogu, śpiewajcie psalmy jego imieniu, wywyższajcie tego, który przemierza niebiosa; PAN to jego imię, radujcie się przed jego obliczem.
5 తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.
Ojcem dla sierot i sędzią dla wdów jest Bóg w swym świętym przybytku.
6 దేవుడు ఒంటరి వారిని కుటుంబాలుగా చేస్తాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని వృద్ధి చెందిస్తాడు. తిరుగుబాటు చేసే వారి భూములు బీడులైపోతాయి.
Bóg samotnym daje dom, więźniów uwalnia z oków, ale oporni mieszkają w suchej ziemi.
7 దేవా, నీవు నీ ప్రజలకు ముందుగా బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు
Boże, gdy wyruszałeś przed swoim ludem, gdy kroczyłeś przez pustynię. (Sela)
8 దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి.
Ziemia się trzęsła, a niebiosa rozpływały się przed obliczem Boga i sama góra Synaj [zadrżała] przed obliczem Boga, Boga Izraela.
9 దేవా, నీ వారసత్వం మీద వర్షం సమృద్ధిగా కురిపించావు. అది అలసి ఉన్నప్పుడు నువ్వు దాన్ని బలపరచావు.
Zesłałeś obfity deszcz, Boże, otrzeźwiłeś swoje dziedzictwo, gdy omdlewało.
10 ౧౦ నీ ప్రజలు దానిలో నివసిస్తారు. దేవా, నీ మంచితనంతో పేదలను అనుగ్రహించావు.
Twoje zastępy mieszkają w nim; ty, Boże, w swojej dobroci przygotowałeś [je] dla ubogiego.
11 ౧౧ ప్రభువు ఆజ్ఞాపించాడు. గొప్ప సైన్యం దాన్ని ప్రకటించింది.
Pan dał [swoje] słowo, wielki był zastęp zwiastujących dobre wieści.
12 ౧౨ సైన్యాలున్న రాజులు పారిపోతారు. వారు పారిపోతారు. ఇళ్ళలో ఉండే స్త్రీలు దోపుడు సొమ్ము పంచుకుంటారు.
Królowie wojsk uciekali, uciekali; a ta, która doglądała domu, dzieliła łupy.
13 ౧౩ గువ్వలను వెండితో కప్పినట్టు, వాటి రెక్కలకు పచ్చని బంగారు పూత పూసినట్టు ఉన్న సొమ్ము వారు పంచుకుంటారు. గొర్రెల దొడ్లలో మీలో కొందరు ఎందుకు పడుకుని ఉండిపోయారు?
Chociaż musieliście leżeć wśród kotłów, [będziecie] jak skrzydła gołębicy pokryte srebrem, a jej pióra żółtym złotem.
14 ౧౪ సర్వశక్తుడు అక్కడి రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండ మీద మంచు కురిసినట్టు కనిపించింది.
Gdy Wszechmogący rozproszył królów w ziemi, była biała jak śnieg na [górze] Salmon.
15 ౧౫ బాషాను చాలా ఉన్నతమైన పర్వతం. అది అనేక శిఖరాలు ఉన్న పర్వతం.
Góra Boża jest jak góra Baszanu, wzgórze wysokie, jak góra Baszanu.
16 ౧౬ శిఖరాలున్న పర్వతాల్లారా, దేవుడు తన నివాసంగా ఏర్పాటు చేసిన పర్వతాన్ని ఎందుకు అంత అసూయగా చూస్తున్నారు? యెహోవా శాశ్వతంగా దానిలో నివసిస్తాడు.
Dlaczego wyskakujecie, wzgórza wysokie? Na tej górze spodobało się Bogu mieszkać, tam PAN będzie mieszkał na wieki.
17 ౧౭ దేవుని రథాలు వేలాదిగా ఉన్నాయి. సీనాయి కొండపై ఉన్నట్టుగా యెహోవా వాటి మధ్య తన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాడు.
Rydwanów Bożych [jest] dwadzieścia tysięcy, wiele tysięcy aniołów; Pan [przebywa] wśród nich w świątyni, [jak na] Synaju.
18 ౧౮ నీవు ఆరోహణమైపోయావు. బందీలను చెరపట్టుకుపోయావు. మనుషుల నుండి నువ్వు కానుకలు తీసుకున్నావు. యెహోవా, నువ్వు అక్కడ నివసించేలా నీపై తిరుగుబాటు చేసిన వారి నుండి కూడా నువ్వు కానుకలు తీసుకున్నావు.
Wstąpiłeś na wysokość, poprowadziłeś pojmanych jeńców, przyjąłeś dary dla ludzi, nawet dla buntowników, aby PAN Bóg mógł [z nimi] zamieszkać.
19 ౧౯ ప్రభువుకు స్తుతి కలుగు గాక. ఆయన ప్రతిరోజూ మా భారాలు మోస్తున్నాడు. దేవుడే మా రక్షణకర్త.
Błogosławiony Pan; codziennie obsypuje nas [swymi dobrami] Bóg naszego zbawienia. (Sela)
20 ౨౦ మన దేవుడు మనలను రక్షించే దేవుడు. మన దేవుడైన యెహోవాయే మరణం నుండి తప్పించేవాడు.
Nasz Bóg jest Bogiem zbawienia, Pan BÓG wybawia od śmierci.
21 ౨౧ దేవుడు తన శత్రువుల తలలు తప్పక పగలగొడతాడు. ఎడతెగక తప్పులు చేసేవారి నడినెత్తిని ఆయన చితకగొడతాడు.
Bóg zrani głowę swoich wrogów i owłosioną czaszkę tego, który trwa w swoich grzechach.
22 ౨౨ ప్రభువు చెబుతున్నాడు, నేను బాషాను నుండి వారిని వెనక్కి రప్పిస్తాను. సముద్ర అగాధాల్లో నుండి వారిని రప్పిస్తాను.
Pan powiedział: Wyprowadzę znów [swoich] z Baszanu, wyprowadzę [ich] znowu z głębin morskich;
23 ౨౩ నువ్వు నీ శత్రువులను అణచివేసి వారి రక్తంలో నీ పాదాలు ముంచుతావు. వారు నీ కుక్కల నాలుకలకు ఆహారమౌతారు.
Aby twoja stopa była skąpana we krwi, a język twoich psów [we krwi] wrogów.
24 ౨౪ దేవా, నీ యాత్రను, పరిశుద్ధ స్థలానికి పోయే నా రాజైన దేవుని యాత్రను వారు చూశారు.
Widzieli twoje pochody, Boże; pochody mego Boga, mego Króla w świątyni.
25 ౨౫ చుట్టూరా కన్యలు తంబురలు వాయిస్తుండగా పాటలు పాడేవారు ముందుగా నడిచారు. తంతివాద్యాలు వాయించేవారు వారిని వెంబడించారు.
Przodem szli śpiewacy, za nimi grający na instrumentach, wśród nich dziewczęta uderzające w bębenki.
26 ౨౬ సమాజాల్లో దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు సంతానమా, యెహోవాను స్తుతించండి.
W zgromadzeniach błogosławcie Boga, Pana, wy, którzy pochodzicie ze źródła Izraela.
27 ౨౭ మొదట కనిష్ఠుడైన బెన్యామీను గోత్రం, తరవాత యూదా అధిపతులు, వారి పరివారం ఉంది. జెబూలూను, నఫ్తాలి గోత్రాల అధిపతులు అక్కడ ఉన్నారు.
Tam [jest] mały Beniamin, który im przewodzi, władcy Judy i ich hufce, władcy Zebulona i władcy Neftalego.
28 ౨౮ నీ దేవుడు నీకు బలం ఇచ్చాడు. దేవా, గతంలో చేసినట్టు నీ శక్తిని మాకు కనపరచు.
Twój Bóg obdarzył cię siłą; umocnij, Boże, to, co dla nas uczyniłeś.
29 ౨౯ యెరూషలేములోని నీ ఆలయాన్నిబట్టి రాజులు నీ దగ్గరికి కానుకలు తెస్తారు.
Ze względu na twoją świątynię w Jeruzalem królowie będą przynosić ci dary.
30 ౩౦ జమ్ముగడ్డిలోని మృగాన్ని, ఆబోతుల గుంపును, దూడల్లాంటి జాతులను ఖండించు. వారు నీకు లోబడి శిస్తుగా వెండి కడ్డీలు తెచ్చేలా వారిని గద్దించు. యుద్ధాలు కోరుకునే వారిని చెదరగొట్టు.
Zgrom rzeszę kopijników, stado byków z cielcami ludu, chlubiących się kawałkiem srebra; rozprosz narody pragnące wojny.
31 ౩౧ ఈజిప్టు నుండి రాకుమారులు వస్తారు. ఇతియోపియా దేవుని వైపు తన చేతులు చాచి పరిగెత్తి వస్తుంది.
Przyjdą dostojnicy z Egiptu; Etiopia szybko wyciągnie swe ręce do Boga.
32 ౩౨ భూరాజ్యాలన్నీ దేవుని గూర్చి పాడండి. ప్రభువును కీర్తించండి.
Śpiewajcie Bogu, królestwa ziemi, wysławiajcie Pana. (Sela)
33 ౩౩ అనాది కాలం నుండి ఆకాశాలపై స్వారీ చేసే ఆయనను కీర్తించండి. ఆయన తన స్వరం వినిపిస్తాడు. అది బలమైన స్వరం.
Temu, który przemierza najwyższe niebiosa odwieczne; oto wydaje swój głos, głos potężny.
34 ౩౪ దేవునికి బలాతిశయం ఆపాదించండి. ఆయన మహిమ ఇశ్రాయేలు మీద ఉంది. ఆయన బలం అంతరిక్షంలో ఉంది.
Uznajcie moc Boga, jego majestat [jest] nad Izraelem i jego moc w obłokach.
35 ౩౫ దేవా, నీ పరిశుద్ధ స్థలాల్లో నువ్వు భీకరుడివి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల ప్రభావాలను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగు గాక.
Groźny jesteś, Boże, ze swych świętych przybytków; Bóg Izraela sam daje moc i siłę [swemu] ludowi. [Niech będzie] Bóg błogosławiony.

< కీర్తనల~ గ్రంథము 68 >