< కీర్తనల~ గ్రంథము 43 >

1 దేవా, నాకు న్యాయం తీర్చు. దైవభక్తిలేని ప్రజలతో నా తరుపున వాదించు.
Sudi mi, Bože, i raspravi parbu moju s narodom rðavim! od èovjeka nepravednoga i lukavoga izbavi me.
2 నా బలానికి ఆధారమైన దేవుడివి నువ్వే. నన్ను ఎందుకు తోసివేశావు? నీవు నాకు దుర్గం వంటి దేవుడివి. శత్రువు నన్ను అణగదొక్కుతూ ఉంటే నేను రోదిస్తూ ఎందుకు తిరగాలి?
Jer si ti Bog krjeposti moje; zašto si me odbacio? Zašto idem sjetan od pakosti neprijateljeve?
3 నీ వెలుగునూ, నీ సత్యాన్నీ పంపించు. అవి నాకు దారి చూపనీ. అవి నన్ను నీ పరిశుద్ధ పర్వతానికీ, నీ నివాసాలకూ నన్ను తీసుకు వెళ్ళనీ.
Pošlji vidjelo svoje i istinu svoju, neka me vode, i izvedu na svetu goru tvoju i u dvorove tvoje.
4 అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకూ, నాకు అత్యధిక సంతోష కారణమైన నా దేవుని దగ్గరకూ వెళ్తాను. సితారా వాయిస్తూ నా దేవుణ్ణి స్తుతిస్తాను.
Onda æu pristupiti k žrtveniku Božijemu, k Bogu radosti i veselja svojega, i uz gusle slaviæu te, Bože, Bože moj!
5 నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? నీలో నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. నా సహాయం, నా దేవుడూ అయిన ఆయన్ని నేను స్తుతిస్తాను.
Što si klonula, dušo moja, i što si žalosna? Uzdaj se u Boga; jer æu ga još slaviti, spasitelja mojega i Boga mojega.

< కీర్తనల~ గ్రంథము 43 >