< కీర్తనల~ గ్రంథము 38 >

1 దావీదు కీర్తన, జ్ఞాపకం కోసం యెహోవా, నీ కోపంలో నన్ను గద్దించవద్దు. నీ తీవ్ర కోపంలో నన్ను శిక్షించవద్దు.
Gospode! nemoj me karati u gnjevu svojem, niti me nakazati u jarosti svojoj.
2 నీ బాణాలు నాకు గట్టిగా గుచ్చుకుంటున్నాయి. నీ చెయ్యి నన్ను అణచివేస్తుంది.
Jer strijele tvoje ustrijeliše me, i ruka me tvoja tišti.
3 నీ కోపం వల్ల నా శరీరమంతా అనారోగ్యం కలిగింది. నా పాపం కారణంగా నా ఎముకల్లో ఆరోగ్యం లేకుండా పోయింది.
Nema zdrava mjesta na tijelu mojem od gnjeva tvojega; nema mira u kostima mojim od grijeha mojega.
4 ఎందుకంటే నా దోషాలు నన్ను ముంచెత్తి వేస్తున్నాయి. అవి నేను మోయలేనంత భారంగా ఉన్నాయి.
Jer bezakonja moja izaðoše vrh glave moje, kao teško breme otežaše mi.
5 మూర్ఖంగా నేను చేసిన పాపాల వల్ల నాకు కలిగిన గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి.
Usmrdješe se i zagnojiše se rane moje od bezumlja mojega.
6 నేను పూర్తిగా కుంగిపోయాను. రోజంతా నాకు అవమానం కలుగుతుంది.
Zgrèio sam se i pogurio veoma, vas dan idem sjetan;
7 అవమానం నన్ను ముంచెత్తివేసింది. నా శరీరమంతా రోగగ్రస్థమైంది.
Jer sam iznutra pun ognja, i nema zdrava mjesta na tijelu mojem.
8 నేను మొద్దుబారిపోయాను. పూర్తిగా నలిగిపోయాను. నా హృదయంలోని వేదన కారణంగా మూలుగుతున్నాను.
Iznemogoh i veoma oslabih, rièem od trzanja srca svojega.
9 ప్రభూ, నా హృదయపు లోతుల్లోని తీవ్ర ఆకాంక్షలు నువ్వు అర్థం చేసుకుంటావు. నా మూల్గులు నీకు వినిపిస్తూనే ఉన్నాయి.
Gospode! pred tobom su sve želje moje, i uzdisanje moje nije od tebe sakriveno.
10 ౧౦ నా గుండె వేగంగా కొట్టుకుంటున్నది. నా శక్తి క్షీణించిపోతూ ఉంది. నా కంటి చూపు మసకబారుతూ ఉంది.
Srce moje jako kuca, ostavi me snaga moja, i vid oèiju mojijeh, ni njega mi nema.
11 ౧౧ నా ఈ పరిస్థితి కారణంగా నా స్నేహితులూ, తోటివాళ్ళూ నన్ను వదిలేశారు. నా పొరుగువాళ్ళు దూరంగా నిలబడ్డారు.
Drugovi moji i prijatelji moji videæi rane moje otstupiše, daleko stoje bližnji moji.
12 ౧౨ నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు నా కోసం ఉచ్చు బిగిస్తున్నారు. నాకు హాని కలగాలని చూసేవాళ్ళు వినాశకరమైన మాటలు పలుకుతున్నారు. రోజంతా మోసపూరితంగా మాట్లాడుతున్నారు
Koji traže dušu moju namještaju zamku, i koji su mi zlu radi, govore o pogibli i po vas dan misle o prijevari.
13 ౧౩ కానీ నేను చెవిటివాడిలాగా ఏమీ వినకుండా ఉన్నాను. మూగవాడిలాగా ఏమీ మాట్లాడకుండా ఉన్నాను.
A ja kao gluh ne èujem i kao nijem koji ne otvora usta svojijeh.
14 ౧౪ ఏమీ విననివాడిలాగా నేను ఉన్నాను. జవాబు చెప్పలేని వాడిలాగా ఉన్నాను.
Ja sam kao èovjek koji ne èuje ili nema u ustima svojim pravdanja.
15 ౧౫ యెహోవా, నేను తప్పకుండా నీ కోసం వేచి ఉన్నాను. ప్రభూ, నా దేవా, నాకు నువ్వు జవాబిస్తావు.
Jer tebe, Gospode, èekam, ti odgovaraj za mene, Gospode, Bože moj!
16 ౧౬ నా శత్రువులు నాపై రెచ్చిపోకుండా ఉండటానికి నేనిది చెప్తున్నాను. నేను కాలు జారితే వాళ్ళు నన్ను భయంకరంగా హింసిస్తారు.
Jer rekoh: da mi se ne svete, i da se ne razmeæu nada mnom, kad se spotakne noga moja.
17 ౧౭ నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిరంతర వేదనలో ఉన్నాను.
Jer sam gotov pasti, i tuga je moja svagda sa mnom.
18 ౧౮ నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నా పాపాన్ని గూర్చి చింతిస్తున్నాను.
Priznajem krivicu svoju, i tužim radi grijeha svojega.
19 ౧౯ కానీ నా శత్రువులు అసంఖ్యాకంగా ఉన్నారు. అన్యాయంగా నన్ను ద్వేషించేవాళ్ళు చాలామంది ఉన్నారు.
Neprijatelji moji žive, jaki su, i (sila) ih ima što me nenavide na pravdi.
20 ౨౦ నేను వాళ్లకు చేసిన మేలుకు బదులుగా కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినా వాళ్ళు నాపై నిందలు వేస్తున్నారు.
Koji mi vraæaju zlo za dobro, neprijatelji su mi zato što sam pristao za dobrim.
21 ౨౧ యెహోవా, నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నాకు దూరంగా ఉండవద్దు.
Nemoj me ostaviti, Gospode, Bože moj! nemoj se udaljiti od mene.
22 ౨౨ ప్రభూ, నా రక్షణకి ఆధారమా, త్వరగా వచ్చి నాకు సహాయం చెయ్యి.
Pohitaj u pomoæ meni, Gospode, spasitelju moj!

< కీర్తనల~ గ్రంథము 38 >