< కీర్తనల~ గ్రంథము 35 >

1 దావీదు కీర్తన యెహోవా, నాకు విరోధంగా పనులు చేస్తున్న వారికి విరోధంగా ఉండు. నాతో పోరాటం చేసే వాళ్ళతో నువ్వు పోరాటం చెయ్యి.
Phikisana, Nkosi, labaphikisana lami, ulwe labalwa lami.
2 నీ చిన్న డాలునూ, నీ పెద్ద డాలునూ పట్టుకో. లేచి నాకు సహాయం చెయ్యి.
Xhakalaza ihawu lesihlangu esikhulu, usukumele usizo lwami.
3 నన్ను తరిమే వాళ్ళకు విరోధంగా ఈటెనూ, గొడ్డలినీ ప్రయోగించు. నీ రక్షణ నేనే అని నాకు అభయమివ్వు.
Hwatsha lomkhonto, uvimbe indlela umelane labangizingelayo; tshono emphefumulweni wami ukuthi: Ngilusindiso lwakho.
4 నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు సిగ్గుపడి అవమానం పాలవుతారు గాక! నాకు హాని చేయాలని చూసే వాళ్ళు వెనక్కి తగ్గి గందరగోళానికి గురౌతారు గాక!
Kabayangeke babe lehlazo labo abadinga umphefumulo wami. Kabahlehliselwe emuva babe lenhloni labo abaceba ububi ngami.
5 యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వీస్తున్న గాలి ఎదుట ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు గాక!
Kababe njengamakhoba phambi komoya, lengilosi yeNkosi kayibadudule.
6 యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వెళ్ళే దారి చీకటిగానూ జారుడుగానూ ఉంటుంది గాక!
Indlela yabo kayibe mnyama itshelele, lengilosi yeNkosi ibaxotshe.
7 కారణం లేకుండానే వాళ్ళు నన్ను పట్టుకోడానికి వల వేశారు. కారణం లేకుండానే వాళ్ళు నా ప్రాణం తీయాలని నా కోసం గుంట తవ్వారు.
Ngoba kungelasizatho bangifihlele imbule labo emgodini, kungelasizatho bawugebhele umphefumulo wami.
8 వాడి పైకి వాడికి తెలియకుండా వాణ్ణి విస్మయానికి గురి చేస్తూ నాశనం రానీ. వాళ్ళు వేసిన వలలో వాళ్ళనే పడనీ. తమ స్వనాశనం కోసం వాళ్ళనే దానిలో పడనీ.
Ukubhujiswa kakumjume, lembule lakhe alifihlileyo kalimbambe yena, awele kulo, ekubhujisweni.
9 అయితే నేను యెహోవాలో ఆనందిస్తూ ఉంటాను. ఆయన ఇచ్చే రక్షణలో సంతోషిస్తూ ఉంటాను.
Kodwa umphefumulo wami uzathokoza eNkosini, ujabule esindisweni lwayo.
10 ౧౦ అప్పుడు నా శక్తి అంతటితో నేనిలా అంటాను. యెహోవా, నువ్వు అణచివేతకు గురైన వాళ్ళను బలవంతుల చేతిలో నుండీ, పేదలనూ, అవసరార్థులనూ దోచుకునే వాళ్ళ చేతిలో నుండీ విడిపిస్తావు. నీలాటి వారెవరు?
Wonke amathambo ami azakuthi: Nkosi, ngubani onjengawe, okhulula umyanga kulowo olamandla kulaye, yebo, umyanga loswelayo komphangayo?
11 ౧౧ అధర్మపరులైన సాక్షులు బయల్దేరుతున్నారు. వాళ్ళు నాపై అసత్య నిందలు వేస్తున్నారు.
Abafakazi bamanga basukuma, bangibuza engingakwaziyo.
12 ౧౨ నేను వాళ్లకు చేసిన మంచికి బదులుగా వాళ్ళు నాకు చెడు చేస్తున్నారు. నాకు విచారంగా ఉంది.
Bangibuyisela okubi endaweni yokuhle, umphefumulo wami ulahlekelwa.
13 ౧౩ అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను. నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను.
Kanti mina, ekuguleni kwabo isembatho sami sasilisaka, ngathobisa umphefumulo wami ngokuzila ukudla, lomkhuleko wami wabuyela esifubeni sami.
14 ౧౪ అతడు నాకు సోదరుడైనట్టుగా వేదన పడ్డాను. నా తల్లి కోసం అయినట్టుగా కుంగిపోయాను.
Ngahamba ngokungathi ungumngane ngokungathi ungumfowethu; ngikhotheme kwezimnyama njengolilela unina.
15 ౧౫ కాని నా అడుగులు తడబడినప్పుడు వాళ్ళంతా గుమికూడి సంతోషించారు. నాకు వ్యతిరేకంగా వాళ్ళంతా కలిశారు. కానీ నాకు ఆ సంగతి తెలియలేదు. ఆపకుండా అదే పనిగా వాళ్ళు నన్ను నిందించారు.
Kodwa ekukhubekeni kwami bathokoza, babuthana ndawonye, abalahliweyo babuthana ndawonye bemelene lami, njalo ngangingakwazi; badabula kabemanga.
16 ౧౬ గౌరవం ఏమీ లేకుండా వాళ్ళు నన్ను ఎత్తి పొడిచారు. నన్ను చూస్తూ పళ్ళు కొరికారు.
Kanye lababi abaklolodayo edilini, bangigedlela amazinyo abo.
17 ౧౭ ప్రభూ, నువ్వు ఇక ఎంతకాలం చూస్తూ ఉంటావు? నీవెన్నాళ్లు చూస్తూ ఊరకుంటావు? వాళ్ళ విధ్వంసకరమైన దాడుల నుండి నన్ను కాపాడు. సింహాల నుండి నా ప్రాణాన్ని రక్షించు.
Nkosi, uzabukela kuze kube nini? Buyisa umphefumulo wami ekubhubhiseni kwabo, wona wodwa owami emabhongweni ezilwane.
18 ౧౮ అప్పుడు నేను మహాసమాజంలో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అనేకమంది జనాలున్న చోట నిన్ను స్తుతిస్తాను.
Ngizakubonga ebandleni elikhulu, ngikudumise phakathi kwabantu abanengi.
19 ౧౯ నా విషయంలో నా శత్రువులు అన్యాయంగా సంతోష పడేలా చేయకు. వాళ్ళ దుర్మార్గపు ప్రణాళికలను అమలు చెయ్యనీయకు.
Bangajabuli ngami abayizitha zami ngamanga, kabangangificeli ilihlo labo abangizonda ngeze.
20 ౨౦ వాళ్ళు శాంతిని గూర్చి మాట్లాడరు. దేశంలో ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్లకు విరోధంగా మోసపూరితమైన మాటలు కల్పిస్తారు.
Ngoba kabakhulumi ukuthula, kodwa baceba amazwi enkohliso bemelene labachumileyo emhlabeni.
21 ౨౧ నన్ను నిందించడానికి తమ నోళ్ళు బాగా తెరిచారు. ఆహా, మా కళ్ళకు వాడు చేసింది కనిపించిందిలే, అంటున్నారు.
Kanti bangikhamisela kakhulu umlomo wabo bathi: Aha, aha, ilihlo lethu likubonile!
22 ౨౨ యెహోవా, నువ్వు చూస్తున్నావు. మౌనంగా ఉండకు. ప్రభూ, నాకు దూరంగా ఉండకు.
Nkosi, usukubonile; ungathuli. Nkosi, ungabi khatshana lami.
23 ౨౩ నా దేవా, నా ప్రభూ, నా పక్షంగా వాదించడానికి లే. లేచి నాకు న్యాయం తీర్చు.
Zivuse, uvukele ilungelo lami, udaba lwami, Nkulunkulu wami leNkosi yami.
24 ౨౪ యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నా పక్షం వహించు. నా విషయంలో వాళ్ళను సంతోషపడనియ్యకు.
Ngahlulela, Nkosi Nkulunkulu wami, ngokulunga kwakho; kabangathokozi ngami.
25 ౨౫ వాళ్ళు తమ మనస్సుల్లో ఆహా, మేము కోరుకున్నట్టే జరిగింది అని చెప్పే అవకాశం ఇవ్వకు. మేము వాణ్ణి పూర్తిగా నాశనం చేశాం, అని చెప్పనివ్వకు.
Kabangatsho enhliziyweni yabo ukuthi: Hiya, yisifiso sethu! Bangatsho ukuthi: Simginyile.
26 ౨౬ వాళ్ళను అవమానానికి గురి చెయ్యి. నాకు హాని తలపెట్టే వాళ్ళను చిందరవందర చెయ్యి. నాకు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు అవమానానికీ, అగౌరవానికీ గురౌతారు గాక!
Kabayangeke babe lenhloni ndawonye abajabula ngosizi lwami; bembathiswe ngenhloni lehlazo labo abazikhukhumeza ngami.
27 ౨౭ నా నిర్దోషత్వం రుజువు కావాలని కోరుకునే వాళ్ళు ఆనందంతో కోలాహలం చేస్తూ సంతోషిస్తారు గాక! తన సేవకుడి సంక్షేమం చూసి ఆనందించే యెహోవాకు వాళ్ళు నిత్యం స్తుతులు చెల్లిస్తారు గాక!
Kabamemeze ngenjabulo bathabe abaloyisa ukulunga kwami, yebo kabatsho njalonjaloukuthi: Kayikhuliswe iNkosi ethokoza ngokuhlala kuhle kwenceku yayo.
28 ౨౮ అప్పుడు నేను నీ న్యాయాన్ని గూర్చి ప్రచారం చేస్తాను. దినమంతా నిన్ను స్తుతిస్తూ ఉంటాను.
Lolimi lwami luzakhuluma ukulunga kwakho, usuku lonke indumiso yakho.

< కీర్తనల~ గ్రంథము 35 >