< కీర్తనల~ గ్రంథము 20 >

1 ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన ఆపద సమయంలో యెహోవా నీకు జవాబిస్తాడు గాక. యాకోబు దేవుని నామం నిన్ను కాపాడుతుంది గాక. 2 పరిశుద్ధ స్థలంలోనుంచి ఆయన నీకు సహాయం చేస్తాడు గాక. సీయోనులోనుంచి నిన్ను ఆదుకుంటాడు గాక. 3 ఆయన నీ అర్పణలు జ్ఞాపకం చేసుకుని, నీ దహన బలులు అంగీకరిస్తాడు గాక. 4 నీ హృదయవాంఛను తీర్చి నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తాడు గాక. 5 అప్పుడు నీ రక్షణను బట్టి మేము ఆనందిస్తాము. దేవా, నీ పేరట జెండా ఎత్తుతాము. నీ అభ్యర్ధనలన్నీ యెహోవా మంజూరు చేస్తాడు గాక. 6 యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలిసింది. రక్షించగల తన కుడిచేతి బలంతో తన పవిత్రాకాశంలోనుంచి అతనికి జవాబిస్తాడు. 7 కొందరు రథాలను, కొందరు గుర్రాలను నమ్ముకుంటారు. కాని మనం మన దేవుడైన యెహోవాకు మొర పెడతాము. 8 వాళ్ళు కుంగి నేల మీద పడిపోతారు, మనం లేచి తిన్నగా నిలిచి ఉంటాము! 9 యెహోవా, రాజును రక్షించు. మేము మొరపెట్టినప్పుడు మాకు సహాయం చెయ్యి.

< కీర్తనల~ గ్రంథము 20 >