< కీర్తనల~ గ్రంథము 146 >

1 యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను కీర్తించు.
הללו-יה הללי נפשי את-יהוה
2 నా జీవితకాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నేను ప్రాణంతో ఉన్న కాలమంతా నా దేవునికి కీర్తనలు పాడతాను.
אהללה יהוה בחיי אזמרה לאלהי בעודי
3 రాజులను, మనుషులను నమ్ముకోకండి. వాళ్ళ వల్ల రక్షణ దొరకదు.
אל-תבטחו בנדיבים-- בבן-אדם שאין לו תשועה
4 వాళ్ళ ఊపిరి ఆగిపోగానే మట్టిలో కలసిపోతారు. ఆ దినాన వాళ్ళ పథకాలన్నీ ముగిసిపోతాయి.
תצא רוחו ישב לאדמתו ביום ההוא אבדו עשתנתיו
5 యాకోబు దేవుడు ఎవరికి సహాయంగా ఉంటాడో, తమ దేవుడైన యెహోవా మీద ఎవరు ఆశాభావం పెట్టుకుని ఉంటారో వాళ్ళు ధన్యులు.
אשרי--שאל יעקב בעזרו שברו על-יהוה אלהיו
6 ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాలనూ, వాటిలో ఉన్న సమస్తాన్నీ సృష్టి చేసినవాడు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పడు.
עשה שמים וארץ-- את-הים ואת-כל-אשר-בם השמר אמת לעולם
7 దోపిడీకి గురైన వాళ్లకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలిగొన్న వాళ్లకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఖైదీలకు విడుదల కలిగిస్తాడు.
עשה משפט לעשוקים--נתן לחם לרעבים יהוה מתיר אסורים
8 యెహోవా గుడ్డివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. అణగారిపోయిన వాళ్ళను ఆదరించి లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు.
יהוה פקח עורים--יהוה זקף כפופים יהוה אהב צדיקים
9 ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు.
יהוה שמר את-גרים--יתום ואלמנה יעודד ודרך רשעים יעות
10 ౧౦ యెహోవా శాశ్వతంగా రాజ్యపాలన చేస్తాడు. సీయోనూ, ఆయన తరతరాలకు నీ దేవుడు. యెహోవాను స్తుతించండి.
ימלך יהוה לעולם-- אלהיך ציון לדר ודר הללו-יה

< కీర్తనల~ గ్రంథము 146 >