< కీర్తనల~ గ్రంథము 132 >

1 యాత్రల కీర్తన యెహోవా, దావీదుకు దాపురించిన బాధలన్నిటినీ అతడి తరపున జ్ఞాపకం చేసుకో.
שיר המעלות זכור יהוה לדוד את כל ענותו׃
2 అతడు ఏ విధంగా యెహోవాకు ప్రమాణం చేశాడో, పరాక్రమశాలి అయిన యాకోబు దేవుడికి ఏమి వాగ్దానం చేశాడో మనసుకు తెచ్చుకో.
אשר נשבע ליהוה נדר לאביר יעקב׃
3 నేను యెహోవా కోసం ఒక స్థలం చూసే దాకా,
אם אבא באהל ביתי אם אעלה על ערש יצועי׃
4 యాకోబు పరాక్రమశాలికి ఒక నివాస స్థలం సమకూర్చేదాకా నా ఇంట్లో అడుగు పెట్టను.
אם אתן שנת לעיני לעפעפי תנומה׃
5 నా కళ్ళకు నిద్ర, నా కనురెప్పలకు విశ్రాంతి రానివ్వను.
עד אמצא מקום ליהוה משכנות לאביר יעקב׃
6 ఆ స్థలం ఎఫ్రాతాలో ఉన్నట్టు విన్నాం. యాయరు పొలంలో అది దొరికింది.
הנה שמענוה באפרתה מצאנוה בשדי יער׃
7 యెహోవా మందిరానికి వెళ్దాం పదండి. రండి, ఆయన పాదపీఠం ఎదుట సాష్టాంగపడదాం.
נבואה למשכנותיו נשתחוה להדם רגליו׃
8 యెహోవా, లే. నీ విశ్రాంతి స్థలానికి రా.
קומה יהוה למנוחתך אתה וארון עזך׃
9 నీ యాజకులు న్యాయాన్ని ధరించుకుంటారు గాక. నీ భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు గాక.
כהניך ילבשו צדק וחסידיך ירננו׃
10 ౧౦ నీ సేవకుడైన దావీదు మొహం చూసి నీ అభిషిక్తునికి విముఖత చూపించకు.
בעבור דוד עבדך אל תשב פני משיחך׃
11 ౧౧ నీ సంతానాన్ని నీ సింహాసనానికి శాశ్వత వారసులుగా చేస్తాను అనీ, దావీదు పట్ల నమ్మకంగా ఉంటాననీ ఆయన శపథం చేశాడు.
נשבע יהוה לדוד אמת לא ישוב ממנה מפרי בטנך אשית לכסא לך׃
12 ౧౨ నీ కొడుకులు నా నిబంధన పాటిస్తే నేను నేర్పిన నా శాసనాలు అనుసరిస్తే ఇలా జరుగుతుంది, అన్నాడు.
אם ישמרו בניך בריתי ועדתי זו אלמדם גם בניהם עדי עד ישבו לכסא לך׃
13 ౧౩ తప్పనిసరిగా యెహోవా సీయోనును ఎన్నుకున్నాడు. దాన్ని తన నివాసస్థలంగా కోరుకున్నాడు.
כי בחר יהוה בציון אוה למושב לו׃
14 ౧౪ ఇది నేను కోరుకున్న స్థలం. ఇది శాశ్వతంగా నా విశ్రాంతి స్థలంగా ఉంటుంది. ఇక్కడే నేను నివసిస్తాను.
זאת מנוחתי עדי עד פה אשב כי אותיה׃
15 ౧౫ దానిలో ఆహారం సమృద్ధిగా ఉండేలా దీవిస్తాను. దానిలోని పేదలను చాలినంత ఆహారంతో తృప్తి పరుస్తాను.
צידה ברך אברך אביוניה אשביע לחם׃
16 ౧౬ దాని యాజకులకు రక్షణ ధరింపజేస్తాను. దానిలో భక్తులు ఎలుగెత్తి హర్ష ధ్వానాలు చేస్తారు.
וכהניה אלביש ישע וחסידיה רנן ירננו׃
17 ౧౭ అక్కడే దావీదు వంశానికి చిగురు మొలకెత్తేలా చేస్తాను. అక్కడే నా అభిషిక్తుని కోసం నేను ఒక దీపం సిద్ధం చేసి ఉంచాను.
שם אצמיח קרן לדוד ערכתי נר למשיחי׃
18 ౧౮ అతని శత్రువులు అవమానం ధరించుకునేలా చేస్తాను. అతని కిరీటం మాత్రం ప్రకాశిస్తుంది.
אויביו אלביש בשת ועליו יציץ נזרו׃

< కీర్తనల~ గ్రంథము 132 >