< కీర్తనల~ గ్రంథము 126 >

1 యాత్రల కీర్తన సీయోను నగరవాసులను యెహోవా చెరలో నుండి తిరిగి రప్పించినప్పుడు మనం కల కంటున్నవాళ్ళ వలే ఉన్నాం. 2 మన నోరు నవ్వుతో నిండిపోయింది. మన నాలుక ఆనంద గీతాలు ఆలపిస్తుంది. అప్పుడు యెహోవా వీళ్ళ కోసం గొప్పకార్యాలు జరిగించాడు, అని అన్యజనులు చెప్పుకున్నారు. 3 మనకి ఎంత ఆనందం! ఎందుకంటే యెహోవా మన కోసం ఘన కార్యాలు చేశాడు. 4 దక్షిణ ప్రాంతపు సెలయేరులవలే యెహోవా, మా అదృష్టాన్ని తిరిగి చిగురింపజెయ్యి. 5 కన్నీళ్లు కారుస్తూ విత్తనాలు చల్లేవాళ్ళు కేరింతలతో పంట కోస్తారు. 6 విత్తనాలు చేతబట్టుకుని ఏడుస్తూ చల్లేవాడు సంబరంగా పనలు మోసుకుంటూ తిరిగి వస్తాడు.

< కీర్తనల~ గ్రంథము 126 >