< కీర్తనల~ గ్రంథము 116 >

1 యెహోవా నా మొర, నా విన్నపాలు ఆలకించాడు. నేనాయన్ని ప్రేమిస్తున్నాను.
אהבתי כי ישמע יהוה את קולי תחנוני׃
2 ఆయన నా మాటలు శ్రద్ధగా విన్నాడు. కాబట్టి నా జీవితకాలమంతా నేనాయనకు మొర్ర పెడతాను.
כי הטה אזנו לי ובימי אקרא׃
3 మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. బాధ, దుఃఖం నాకు కలిగింది. (Sheol h7585)
אפפוני חבלי מות ומצרי שאול מצאוני צרה ויגון אמצא׃ (Sheol h7585)
4 అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని యెహోవా నామాన్నిబట్టి నేను మొర్రపెట్టాను.
ובשם יהוה אקרא אנה יהוה מלטה נפשי׃
5 యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.
חנון יהוה וצדיק ואלהינו מרחם׃
6 యెహోవా సాధుజీవులను కాపాడేవాడు. నేను క్రుంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు.
שמר פתאים יהוה דלותי ולי יהושיע׃
7 నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేశాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు.
שובי נפשי למנוחיכי כי יהוה גמל עליכי׃
8 మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు.
כי חלצת נפשי ממות את עיני מן דמעה את רגלי מדחי׃
9 సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను.
אתהלך לפני יהוה בארצות החיים׃
10 ౧౦ నేను అలా మాట్లాడి నమ్మకం ఉంచాను. నేను చాలా బాధపడిన వాణ్ణి.
האמנתי כי אדבר אני עניתי מאד׃
11 ౧౧ నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను.
אני אמרתי בחפזי כל האדם כזב׃
12 ౧౨ యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనాయనకేమి చెల్లిస్తాను?
מה אשיב ליהוה כל תגמולוהי עלי׃
13 ౧౩ రక్షణపాత్రను ఎత్తి పట్టుకుని యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను.
כוס ישועות אשא ובשם יהוה אקרא׃
14 ౧౪ యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను.
נדרי ליהוה אשלם נגדה נא לכל עמו׃
15 ౧౫ యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది.
יקר בעיני יהוה המותה לחסידיו׃
16 ౧౬ యెహోవా, నేను నిజంగా నీ సేవకుణ్ణి. నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి. నీవు నా కట్లు విప్పావు.
אנה יהוה כי אני עבדך אני עבדך בן אמתך פתחת למוסרי׃
17 ౧౭ నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను
לך אזבח זבח תודה ובשם יהוה אקרא׃
18 ౧౮ ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను.
נדרי ליהוה אשלם נגדה נא לכל עמו׃
19 ౧౯ యెహోవా మందిర ఆవరణాల్లో, యెరూషలేమా, నీ మధ్యనే నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి.
בחצרות בית יהוה בתוככי ירושלם הללו יה׃

< కీర్తనల~ గ్రంథము 116 >