< కీర్తనల~ గ్రంథము 112 >

1 యెహోవాను స్తుతించండి. యెహోవా పట్ల భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలనుబట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు.
הללו יה אשרי איש ירא את יהוה במצותיו חפץ מאד׃
2 అతని సంతానం భూమిమీద బలవంతులౌతారు. యథార్థవంతుల వంశం దీవెనలు పొందుతారు.
גבור בארץ יהיה זרעו דור ישרים יברך׃
3 కలిమి, సంపద అతని ఇంట్లో ఉంటాయి. అతని నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.
הון ועשר בביתו וצדקתו עמדת לעד׃
4 యథార్థవంతులకు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. వారు కృపాభరితులు, దయాపరులు, న్యాయవంతులు.
זרח בחשך אור לישרים חנון ורחום וצדיק׃
5 జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు.
טוב איש חונן ומלוה יכלכל דבריו במשפט׃
6 అలాటి వారు ఎన్నటికీ స్థిరంగా ఉండిపోతారు. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.
כי לעולם לא ימוט לזכר עולם יהיה צדיק׃
7 అతడు దుర్వార్తకు జడిసి పోడు. అతడు యెహోవాను నమ్ముకుని నిబ్బరంగా ఉంటాడు.
משמועה רעה לא יירא נכון לבו בטח ביהוה׃
8 అతని మనస్సు స్థిరంగా ఉంటుంది. తన శత్రువులపై గెలిచేదాకా అతడు భయపడడు.
סמוך לבו לא יירא עד אשר יראה בצריו׃
9 అతడు ఉదారంగా పేదలకు దానం చేస్తాడు. అతని నీతి నిత్యం నిలిచి ఉంటుంది. అతడు ఘనత పొందుతాడు.
פזר נתן לאביונים צדקתו עמדת לעד קרנו תרום בכבוד׃
10 ౧౦ భక్తిహీనులు అది చూసి కోపం తెచ్చుకుంటారు. వారు పళ్ళు కొరుకుతూ క్షీణించి పోతారు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది.
רשע יראה וכעס שניו יחרק ונמס תאות רשעים תאבד׃

< కీర్తనల~ గ్రంథము 112 >