< కీర్తనల~ గ్రంథము 110 >

1 దావీదు కీర్తన యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో.
לדוד מזמור נאם יהוה לאדני שב לימיני עד אשית איביך הדם לרגליך׃
2 యెహోవా అంటున్నాడు, సీయోనులోనుండి నీ పరిపాలన దండాన్ని చాపు. నీ శత్రువులపై పరిపాలన చెయ్యి.
מטה עזך ישלח יהוה מציון רדה בקרב איביך׃
3 నీవు నీ వైభవాన్ని ప్రదర్శించేటప్పుడు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీతో వస్తారు. అరుణోదయ గర్భంలో నుండి కురిసే మంచులాగా నీ యవ్వనం ఉంటుంది.
עמך נדבת ביום חילך בהדרי קדש מרחם משחר לך טל ילדתיך׃
4 మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉంటావు, అని యెహోవా ప్రమాణం చేశాడు. ఆయన మాట తప్పనివాడు.
נשבע יהוה ולא ינחם אתה כהן לעולם על דברתי מלכי צדק׃
5 ప్రభువు నీ కుడిచేతి వైపున ఉండి తన కోపదినాన రాజులను హతమారుస్తాడు.
אדני על ימינך מחץ ביום אפו מלכים׃
6 అన్యజాతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన లోయలను శవాలతో నింపుతాడు. అనేక దేశాల నేతలను ఆయన హతమారుస్తాడు.
ידין בגוים מלא גויות מחץ ראש על ארץ רבה׃
7 దారిలో ఏటి నీళ్లు పానం చేస్తాడు. విజయగర్వంతో తన తల పైకెత్తుతాడు.
מנחל בדרך ישתה על כן ירים ראש׃

< కీర్తనల~ గ్రంథము 110 >