< కీర్తనల~ గ్రంథము 108 >

1 లలిత గీతం. దావీదు కీర్తన దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడుతూ నా ఆత్మతో స్తుతిగానం చేస్తాను.
שיר מזמור לדוד נכון לבי אלהים אשירה ואזמרה אף כבודי׃
2 స్వరమండలమా, సితారా, మేలు మేలుకోండి. నేను వేకువనే లేస్తాను.
עורה הנבל וכנור אעירה שחר׃
3 ప్రజలమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.
אודך בעמים יהוה ואזמרך בל אמים׃
4 యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తయినది. నీ సత్యం మేఘాలంత ఎత్తుగా ఉంది.
כי גדול מעל שמים חסדך ועד שחקים אמתך׃
5 దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకో.
רומה על שמים אלהים ועל כל הארץ כבודך׃
6 నీ ప్రభావం భూమి అంతటిమీదా కనబడనియ్యి. నీకు ఇష్టమైన వారు విమోచన పొందేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబియ్యి.
למען יחלצון ידידיך הושיעה ימינך וענני׃
7 తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చాడు. నేను హర్షిస్తాను. షెకెమును పంచిపెడతాను. సుక్కోతు లోయను కొలిపిస్తాను.
אלהים דבר בקדשו אעלזה אחלקה שכם ועמק סכות אמדד׃
8 గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజ దండం.
לי גלעד לי מנשה ואפרים מעוז ראשי יהודה מחקקי׃
9 మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోముపైకి నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియనుబట్టి జయోత్సవం చేశాను.
מואב סיר רחצי על אדום אשליך נעלי עלי פלשת אתרועע׃
10 ౧౦ కోటగల పట్టణంలోకి నన్ను ఎవరు తోడుకుపోతారు? ఎదోములోకి నన్నెవరు నడిపిస్తారు?
מי יבלני עיר מבצר מי נחני עד אדום׃
11 ౧౧ దేవా, నీవు మమ్మల్ని విడనాడావు గదా? దేవా, మా సేనలతో నీవు కూడా బయలుదేరడం చాలించుకున్నావు గదా?
הלא אלהים זנחתנו ולא תצא אלהים בצבאתינו׃
12 ౧౨ మనుష్యుల సహాయం వ్యర్థం. శత్రువులను జయించడానికి నీవు మాకు సహాయం చెయ్యి.
הבה לנו עזרת מצר ושוא תשועת אדם׃
13 ౧౩ దేవుని వలన మేము శూరకార్యాలు జరిగిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే.
באלהים נעשה חיל והוא יבוס צרינו׃

< కీర్తనల~ గ్రంథము 108 >