< సామెతలు 27 >

1 రేపటి రోజును గూర్చి డంబాలు పలక వద్దు. ఏ రోజున ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు?
Nelielies ar rītdienu; jo tu nezini, ko diena atnesīs.
2 నీ నోరు కాదు, వేరొకరు ఎవరన్నా, నీ స్వంత పెదవులు కాదు ఇతరులే నిన్ను పొగడాలి.
Lai cits tevi slavē un ne paša mute, svešs un ne paša lūpas.
3 రాయి బరువు ఇసక భారం గదా. మూర్ఖుడి కోపం ఆ రెంటికంటే బరువు.
Akmens ir grūts un smiltis smagas, bet ģeķa sēras sūrākas nekā abi.
4 క్రోధం క్రూరమైనది. కోపం వరదలాగా ముంచెత్తుతుంది. రోషం ఎదుట నిలవ గలిగేది ఎవరు?
Nežēlība ir briesmīga lieta un bardzība ir kā plūdi; bet priekš skaudības, kas tur pastāvēs!
5 లోలోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.
Labāki skaidri pārmācīt, nekā mīlestība, ko nedabū redzēt.
6 స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. శత్రువు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు.
Drauga sitieni nāk no labas sirds, bet viltīga ir nīdētāja skūpstīšana.
7 కడుపు నిండిన వాడు తేనెపట్టునైనా సరే కాళ్ళతో తొక్కేస్తాడు. ఆకలి వేసిన వాడికి చేదు పదార్థమైనా తియ్యగా ఉంటుంది.
Paēdis arī tīru medu min pa kājām, bet izsalkušam ikviens rūgtums ir salds.
8 తన సొంత ఇల్లు విడిచిపెట్టి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం.
Kā putns, kas savu ligzdu atstājis, tāds ir cilvēks, no dzimtenes aizgājis.
9 పరిమళం, సుగంధం హృదయాన్ని సంతోషపెడుతుంది. అలాగే మిత్రుడి హృదయంలో నుండి వచ్చే మధుర వాక్కులు హృదయాన్ని సంతోషపెడతాయి.
Eļļa un kvēpināšana iepriecina sirdi; tāds mīlīgs ir draugs, kas padomu dod no sirds.
10 ౧౦ నీ స్నేహితుడినైనా నీ తండ్రి స్నేహితుడినైనా విడిచి పెట్టవద్దు. నీ ఆపద దినాన నీ అన్నదమ్ముల ఇళ్ళకు వెళ్లకు. దూరంగా ఉన్న సోదరుడి కంటే దగ్గరున్న పొరుగువాడే మంచిది.
Neatstāj savu draugu, nedz sava tēva draugu, un savā bēdu laikā neej sava brāļa namā; labāks ir kaimiņš tuvumā, nekā brālis tālumā.
11 ౧౧ కుమారా, జ్ఞానం సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాటలాడతాను.
Esi gudrs, mans dēls, tad mana sirds priecāsies, un es varēšu atbildēt saviem nievātājiem.
12 ౧౨ బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. జ్ఞానం లేనివారు నిర్లక్ష్యంగా ఆపదలో పడతారు.
Gudrais paredz nelaimi un paglābjās; bet neprāta ļaudis skrien vien un dabū ciest.
13 ౧౩ ఎదుటి మనిషి విషయంలో హామీ ఉండే వాడి నుంచి అతని వస్త్రం తీసుకో. ఇతరుల కోసం పూచీ తీసుకున్న వాడిచేత వాడి వస్తువులు తాకట్టు పెట్టించు.
„Atņem tam drēbi; jo viņš priekš sveša galvojis, un tā nezināmā vietā ķīlā to.“
14 ౧౪ పొద్దున్నే లేచి పెద్ద గొంతుకతో తన స్నేహితుణ్ణి దీవించే వాడి దీవెన అతని పాలిట శాపమే.
Ja arī cilvēks no paša rīta skaņā balsī savu tuvāko svētī, to viņam tomēr var pārgriezt par lāstiem.
15 ౧౫ ముసురు పట్టిన రోజున ఏక ధారగా కురుస్తూ ఉండే నీళ్లు, గయ్యాళి ఇల్లాలు ఒకటే.
Bez gala pil, kad lietus līst, un rējēja sieva tāda pat.
16 ౧౬ ఆమెను ఆపాలని ప్రయత్నించేవాడు గాలిని ఆపాలని ప్రయత్నించే వాడితో సమానం. తన కుడిచేతిలో నూనె పట్టుకోవాలని ప్రయత్నించడంతో సమానం.
Kas tādu grib valdīt, tas valda vēju un tur eļļu savā rokā.
17 ౧౭ ఇనుము చేత ఇనుము పదును అవుతుంది. అలాగే ఒక మనిషి తన సాటి మనిషికి పదును పెడతాడు.
Dzelzs trinās pie dzelzs un cilvēks trinās pie cilvēka.
18 ౧౮ అంజూరు చెట్టు పెంచేవాడు దాని పండ్లు తింటాడు. తన యజమానిని గౌరవించే వాడు ఘనత పొందుతాడు.
Kas vīģes koku kopj, ēdīs viņa augļus, un kas par savu kungu gādā, taps godā.
19 ౧౯ నీటిలో ముఖానికి ముఖం కనబడినట్టు ఒకడి మనస్సుకు మరొకడి మనస్సు కనబడుతుంది.
Kā vaigam vaigs atspīd ūdenī, tā cilvēka sirds cilvēkam.
20 ౨౦ పాతాళానికి, అగాధానికి తృప్తి ఉండదు. అలానే మనిషి కోరికలకు ఎప్పటికీ తృప్తి ఉండదు. (Sheol h7585)
Elle un bezdibenis nav pildāmi, tāpat cilvēka acis nav pildāmas. (Sheol h7585)
21 ౨౧ మూసతో వెండిని కొలిమితో బంగారాన్ని తాను పొందిన కీర్తితో మనిషిని పరీక్షించి చూడ వచ్చు.
Kausējams katls sudrabam, ceplis zeltam, un vīrs pēc savas slavas.
22 ౨౨ మూర్ఖుడిని గోదుమలలోబాటు రోకలితో దంచినా వాడి మూఢత వాణ్ణి వదలిపోదు.
Ja tu ģeķi piestā ar piestalu putraimos sagrūstu, ģeķība no viņa neatstāsies.
23 ౨౩ నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసుకో. నీ మందల మీద మనస్సు ఉంచు.
Liec labi ziņā savus sīkos lopus un ņem vērā savus ganāmos,
24 ౨౪ డబ్బు శాశ్వతం కాదు. కిరీటం తరతరాలు ఉంటుందా?
Jo mantas nepaliek mūžīgi, nedz ķēniņa kronis uz radu radiem.
25 ౨౫ ఎండిన గడ్డి వామి వేస్తారు. పచ్చిక ఇక కనిపించడం లేదు. మొలకలు వస్తున్నాయి. ఆలమందల కోసం కొండగడ్డి కోసుకొస్తున్నారు.
(Bet) kad siens nopļauts, un jauns zaļums nācis, un zāles uz kalniem salasītas,
26 ౨౬ నీకు వెచ్చటి బట్టల కోసం గొర్రెపిల్లలున్నాయి. ఒక చేను కొనడానికి మేకలు సరిపోతాయి.
Tad tev jēri būs apģērbam, un āži par tīruma maksu,
27 ౨౭ నీ ఆహారానికి, నీ కుటుంబం తినే ఆహారానికి, నీ దాసదాసీల పోషణకు మేకపాలు ఉంటాయి.
Un kazu piena būs diezgan tev un tavam namam par barību un par uzturu tavām kalponēm.

< సామెతలు 27 >