< సామెతలు 13 >

1 తండ్రి క్రమశిక్షణకు లోబడిన కుమారుడు వివేకం గలవాడు. బుద్ధి లేనివాడు దిద్దుబాటుకు తల వంచడు.
A wise son accepts his father's discipline, but a mocker doesn't listen to correction.
2 మనిషి తన నోటి నుంచి వచ్చే మాటల వలన ప్రతిఫలం పొందుతాడు. నమ్మకద్రోహులు తమ దుష్ట క్రియల చేత నాశనం తెచ్చుకుంటారు.
You'll be rewarded for saying good things, but dishonest people want violence.
3 తన నోటిని అదుపులో ఉంచుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. వ్యర్థంగా మాట్లాడే వాడు నాశనం కొని తెచ్చుకుంటాడు.
Watch what you say and save your life—saying too much leads to disaster.
4 సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు.
Lazy people want a lot, but get nothing; if you work hard you'll be well rewarded.
5 నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు.
Good people hate lies, but the wicked cause a stink and bring disgrace.
6 నిజాయితీపరులకు వారి యథార్థ ప్రవర్తన కాపుదలగా ఉంటుంది. పాపులు తమ భక్తిహీనత వల్ల నాశనమౌతారు.
Goodness protects those who live right, but sin overcomes the wicked.
7 తాము ధనవంతులమని చెప్పుకునే పేదలు ఉన్నారు. దరిద్రులమని చెప్పుకునే ధనవంతులు కూడా ఉన్నారు.
Some pretend to be rich, but don't have anything, while others pretend to be poor and are very rich.
8 ఒకడి సంపద అతని ప్రాణాన్ని విడిపిస్తుంది. దరిద్రుడు హెచ్చరిక మాటలు లక్ష్యపెట్టడు.
The rich can pay a ransom to save their lives, but the poor aren't troubled in this way.
9 నీతిమంతుల వెలుగు ప్రకాశిస్తుంది. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది.
The life of good people shines brightly, but the lamp of the wicked will be snuffed out.
10 ౧౦ గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది.
Pride only causes conflict; but those who take advice are wise.
11 ౧౧ మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు.
Wealth gained by fraud quickly disappears, but those who gather bit by bit prosper.
12 ౧౨ కోరుకున్నది జరగకపోతే హృదయం క్షీణిస్తుంది. తీరిన కోరిక జీవవృక్షం వంటిది.
Hope that's delayed makes you feel sick, but a wish that comes true revives you.
13 ౧౩ హితబోధను తిరస్కరించేవాడు దాన్ని బట్టి శిక్షకు పాత్రుడౌతాడు. ఆజ్ఞల పట్ల భయభక్తులు చూపి వాటిని ఆచరించేవాడు తగిన ఫలం పొందుతాడు.
If you despise words of advice, you'll pay for it; but if you respect what you're told, you'll be rewarded.
14 ౧౪ జ్ఞానుల ఉపదేశం జీవం కలిగించే ఊట. మనుషులు దాని మూలంగా మరణ బంధకాల నుండి తప్పించుకుంటారు.
The teaching of the wise is like a fountain of life, so you can avoid the snares of death.
15 ౧౫ మంచి బుద్ధి కలిగి ఉంటే దయాగుణం అలవడుతుంది. నమ్మకద్రోహుల మార్గం కష్టాల కడలి.
Good sense earns appreciation, but the way of the unfaithful is hard.
16 ౧౬ వివేకం గలవారు తెలివిగా తమ పనులు జరిగిస్తారు. బుద్ధిహీనులు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటారు.
All wise people act intelligently, but stupid people demonstrate their stupidity.
17 ౧౭ దుర్మార్గుడైన ప్రతినిధి కష్టాల పాలవుతాడు. సమర్ధుడైన రాయబారి తన వారికి క్షేమం కలిగిస్తాడు.
A bad messenger creates trouble, but a faithful representative brings healing.
18 ౧౮ క్రమశిక్షణను లక్ష్యపెట్టని వాడికి అవమానం, దరిద్రం దాపురిస్తాయి. మందలింపును శిరసావహించేవాడు గౌరవం పొందుతాడు.
Poverty and disgrace come to those who ignore instruction, but those who accept correction are honored.
19 ౧౯ కోరిక నెరవేరితే ప్రాణానికి ఊరట కలుగుతుంది. చెడుతనాన్ని విడిచి పెట్టడం మూర్ఖులకు ఏవగింపు.
It's nice to see a wish come true, but stupid people hate to turn away from evil to achieve this.
20 ౨౦ జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు.
Being friends with wise people will make you wise, but being friends with stupid people will only cause you problems.
21 ౨౧ కీడు పాపులను వెంటాడుతుంది. నీతిమంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది.
Tragedy chases after the sinner, but prosperity rewards the good.
22 ౨౨ న్యాయవంతుడు తన మనుమలకు ఆస్తి సమకూరుస్తాడు. పాపాత్ముల సంపాదన నీతిమంతుల వశం అవుతుంది.
Good people leave an inheritance to their grandchildren, but the sinner's wealth is saved for those who live right.
23 ౨౩ పేదవాళ్ళు సేద్యం చేసిన భూమి విస్తారంగా పండుతుంది. అక్రమ క్రియలు జరిగించిన వాళ్ళు నాశనమైపోతారు.
The unploughed ground of the poor could produce a lot of food, but it's stolen through injustice.
24 ౨౪ బెత్తం వాడకుండా తన కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టకుండా ఉన్న తండ్రి అతనికి శత్రువు వంటివాడు. ప్రేమించే తండ్రి తన కుమారుణ్ణి తప్పకుండా శిక్షిస్తాడు.
People who don't discipline their children hate them. Those who love their children carefully discipline them.
25 ౨౫ ఉత్తముడు కడుపునిండా భోజనం చేస్తాడు. భక్తిహీనులు తినడానికి ఏమీ మిగలదు.
The good eat until they're full; but the belly of the wicked is empty.

< సామెతలు 13 >