< సంఖ్యాకాండము 5 >

1 తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు.
Un Tas Kungs runāja uz Mozu un sacīja:
2 “ఇశ్రాయేలు ప్రజలకి ఇలా ఆజ్ఞాపించు. చర్మంలో అంటువ్యాధి కలిగిన వాణ్ణీ, శరీరంలో నుండి స్రావం అవుతున్న వాణ్ణీ, శవాన్ని ముట్టుకుని అపవిత్రుడైన వాణ్ణి శిబిరంలో నుండి బయటికి పంపివేయాలి.
Pavēli Israēla bērniem, ka tiem no lēģera būs izraidīt visus spitālīgos, un visus, kam miesa pil, un visus, kas palikuši nešķīsti pie miroņa.
3 వారు ఆడవారైనా మగవారైనా శిబిరం నుండి బయటకు పంపించి వేయాలి. వారు శిబిరాన్ని కలుషితం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను శిబిరంలో వారి మధ్య నివసిస్తున్నాను.”
Tāpat vīrus kā sievas tev būs izraidīt; ārā no lēģera tev tos būs izraidīt, ka tie neapgāna savus lēģerus, kur Es dzīvoju viņu starpā.
4 ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అలాంటి వారిని శిబిరం బయటకు వెళ్ళగొట్టారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు విధేయత చూపారు.
Un Israēla bērni tā darīja un tos izraidīja no lēģera ārā; kā Tas Kungs uz Mozu bija runājis, tā Israēla bērni darīja.
5 యెహోవా మరోసారి మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు.
Un Tas Kungs runāja uz Mozu un sacīja:
6 పురుషుడు గానీ స్త్రీ గానీ ఏదన్నా పాపం చేసి నాకు ద్రోహం చేస్తే ఆ వ్యక్తి అపరాధి అవుతాడు.
Runā uz Israēla bērniem: ja vīrs vai sieva padara kaut kādu cilvēku grēku, noziegdamies pret To Kungu, un šī dvēsele paliek vainīga,
7 అప్పుడు అతడు తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. తాను చేసిన పాపం వల్ల కలిగిన నష్టాన్ని అతడు చెల్లించాలి. ఆ రుసుముకి అదనంగా దానిలో ఐదో వంతు కలిపి చెల్లించాలి. తాను ఎవరికి విరోధంగా పాపం చేసాడో వారికి దాన్ని చెల్లించాలి.
Tad tiem būs izsūdzēt savu grēku, ko tie darījuši, un savu noziegumu atlīdzināt ar pilnu maksu, un piekto daļu pielikt klāt un tam dot, pret ko tie noziegušies.
8 ఆ అపరాధ చెల్లింపుని తీసుకోడానికి ఆ వ్యక్తికి దగ్గర బంధువు ఎవరూ లేకుంటే అతడు ఆ సొమ్మును యాజకుడి ద్వారా నాకు చెల్లించాలి. దాంతోపాటు ఒక పొట్టేలును తన పరిహారం కోసం అర్పించాలి. ఆ సొమ్ముతో పాటు పొట్టేలు కూడా యాజకునిదవుతుంది.
Bet ja tam vīram nav izpircēja, kam to noziegumu varētu maksāt, tad lai tas maksājamais parāds pieder Tam Kungam priekš priestera, bez tā salīdzināšanas auna, kas tam par salīdzināšanu.
9 ఇశ్రాయేలు ప్రజలు యాజకునికి సమర్పించేదీ, నా కోసం ప్రతిష్టించినదీ ఏదైనా యాజకునికే చెందుతుంది.
Tāpat visi cilājamie upuri no visādām lietām, ko Israēla bērni svētī un pie priestera nes, lai viņam pieder.
10 ౧౦ ప్రతిష్టిత వస్తువులు ఎవరి దగ్గర ఉన్నా అవి యాజకునికే చెందుతాయి. యాజకునికి ఇచ్చింది యాజకునికే చెందుతుంది.”
Un ikkatra svētīta lieta lai viņam krīt; ja kas priesterim ko laba dod, tas lai viņam pieder.
11 ౧౧ యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు.
Un Tas Kungs runāja uz Mozu un sacīja:
12 ౧౨ “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారికి ఇలా చెప్పు. ఎవరైనా ఒకడి భార్య దారి తప్పి అతడికి ద్రోహం చేసినప్పుడు,
Runā uz Israēla bērniem un saki tiem: ja sieva no sava vīra novēršas un noziegdamies pret to noziedzās.
13 ౧౩ అంటే వేరే వ్యక్తి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడనుకోండి. అప్పుడు ఆమె అపవిత్రం అయినట్టే. ఆ విషయాన్ని ఆమె భర్త చూడకపోయినా, అతనికి తెలియక పోయినా, ఆ కార్యం చేస్తుండగా ఎవరూ పట్టుకోకపోయినా, ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయినా ఆమె పట్టుబడదు.
Un ja viens vīrs pie viņas guļ un to pieguļ, un viņas vīram tas būtu nezināms, un tā to būtu slēpusi, ka apgānījusies, un liecinieka pret viņu nebūtu, un viņa nebūtu pieķerta,
14 ౧౪ కానీ ఆ భర్త మనస్సులో రోషం పుట్టి తన భార్య అపవిత్రమైన సంగతి గ్రహిస్తే, లేదా ఆమె అపవిత్రం కాకపోయినా అలాంటిదే అనుమానం అతని మనస్సులో కలిగితే అతడు చేయాల్సింది ఇది.”
Un neuzticības kaislība viņu pārņemtu un viņš neuzticētu savai sievai, un tā ir apgānījusies, vai ja tā neuzticības kaislība viņu pārņemtu un viņš neuzticētu savai sievai, un tā nav apgānījusies, -
15 ౧౫ అలాంటి విషయంలో ఆ వ్యక్తి తన భార్యను యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. ఆమెతో పాటు తూమెడు యవల పిండిలో పదో వంతు కూడా తీసుకు రావాలి. దానిమీద నూనె పోయకూడదు. సాంబ్రాణి వేయకూడదు. ఎందుకంటే అది రోషాన్ని సూచించే నైవేద్యం. పాపాన్ని సూచించడానికి చేస్తున్న నైవేద్యం.
Tad tam vīram savu sievu būs vest pie priestera un atnest upuri priekš viņas, desmito tiesu no ēfas miežu miltu; tam nebūs eļļu uzliet, nedz vīraka uzlikt, jo tas ir viens kaislības upuris, piemiņas ēdamais upuris, atgādināt noziegumu.
16 ౧౬ యాజకుడు ఆమెను యెహోవా సమక్షానికి తీసుకురావాలి.
Un priesterim viņu būs pievest un nostādīt Tā Kunga priekšā.
17 ౧౭ తరువాత యాజకుడు మట్టికుండలో పవిత్రజలం తీసుకోవాలి. మందిరం నేలపైనుండి కొంత ధూళి తీసుకుని ఆ నీళ్ళలో కలపాలి.
Un priesterim būs ņemt svētu ūdeni mālu traukā, un pīšļus no tā dzīvokļa grīdas priesterim būs ņemt un ielikt tai ūdenī.
18 ౧౮ తరువాత యాజకుడు యెహోవా సమక్షంలో ఆ స్త్రీని నిలబెట్టాలి. ఆ స్త్రీ తలపై ముసుగుని తీసి ఆమె జుట్టు జడలు విప్పాలి. రోషం కారణంగా చేసిన నైవేద్యాన్ని అంటే పాపానికి సూచనగా ఉన్న నైవేద్యాన్ని యాజకుడు ఆమె చేతుల్లో ఉంచాలి. ఇది రోషం కారణంగా చేసిన నైవేద్యం. ఆ సమయంలో శాపాన్ని కలిగించే చేదు నీళ్ళు యాజకుడి చేతిలో ఉండాలి.
Tad priesterim to sievu būs nostādīt Tā Kunga priekšā un atsegt tās sievas galvu un to piemiņas upuri likt viņas rokās, tas ir viens kaislības upuris; un tas rūgtais lāsta ūdens lai ir priestera rokā.
19 ౧౯ అప్పుడు యాజకుడు ఆ స్త్రీతో ఒట్టు పెట్టించి ఇలా చెప్పాలి. “ఏ పురుషుడూ నీతో లైంగికంగా కలవక పొతే, నువ్వు దారి తప్పి అపవిత్ర కార్యం చేయకపోతే శాపాన్ని కలిగించే ఈ చేదు నీళ్ళు నీపై ప్రభావం చూపించవు.
Un priesterim būs to sievu zvērināt un uz to sacīt: ja neviens vīrs pie tevis nav gulējis, un ja tu neesi novērsusies no sava vīra uz nešķīstību, tad tu paliksi vesela no šī rūgtā lāsta ūdens.
20 ౨౦ కానీ భర్త ఆధీనంలో ఉన్న నువ్వు దారి తప్పి ఉంటే, అపవిత్రురాలివైతే, వేరే వ్యక్తి నీతో సంబంధం పెట్టుకుంటే”
Bet ja tu no sava vīra esi novērsusies un apgānījusies, un cits vīrs pie tevis gulējis, un ne tavs vīrs vien,
21 ౨౧ ఇక్కడ యాజకుడు ఆమె పైకి శాపం వచ్చేట్లు ఆమెతో ఒట్టు పెట్టించాలి. తరువాత తన మాటలు కొనసాగించాలి. “యెహోవా నీ ప్రజల్లో అందరికీ తెలిసేలా నిన్ను శాపానికి గురిచేస్తాడు గాక. నీ తొడలు బలహీనమై నీ కడుపు ఉబ్బిపోతుంది.
Un priesterim būs to sievu zvērināt ar to lāsta zvērestu un sacīt uz to sievu: lai Tas Kungs tevi dara par lāstu un zvērestu starp taviem ļaudīm, ka Tas Kungs tavai ciskai liek izdilt un tavam vēderam uztūkt;
22 ౨౨ శాపాన్ని కలిగించే ఈ నీళ్ళు నీ కడుపులోకి వెళ్లి నీ పొత్తికడుపు ఉబ్బిపోయేలా చేసి నీ తొడలను బలహీనం చేస్తాయి.” యాజకుడు ఇలా చెప్పిన తరువాత ఆ స్త్రీ “నేను దోషినైతే అలాగే జరగాలి” అని చెప్పాలి.
Un šis lāsta ūdens tavās iekšās lai ieiet un dara, ka vēders uztūkst un ciska izdilst. Tad tai sievai būs sacīt: Āmen, Āmen.
23 ౨౩ యాజకుడు అప్పుడు ఆ శాపాలను ఒక పత్రం పైన రాయాలి. రాసిన ఆ శాపాలను చేదు నీళ్ళతో తుడిచి వేయాలి.
Un priesterim šos lāstus būs rakstīt grāmatā un noskalot ar to rūgto ūdeni.
24 ౨౪ తరువాత యాజకుడు శాపాన్ని కలిగించే ఆ చేదు నీళ్ళని ఆమెతో తాగించాలి. శాపాన్ని కలిగించే ఆ నీళ్ళు ఆమెలో చేదును పుట్టిస్తాయి.
Un to rūgto lāsta ūdeni viņam tai sievai būs dot dzert, ka tas lāsta ūdens viņai ieiet ar rūgtumu.
25 ౨౫ తరువాత యాజకుడు రోషం కారణంగా అర్పించిన నైవేద్యాన్ని ఆమె చేతిలోనుండి తీసుకుని యెహోవా సమక్షంలో పైకి ఎత్తి, ఊపి దాన్ని బలిపీఠం దగ్గరకి తీసుకురావాలి.
Un priesterim no tās sievas rokas būs ņemt to kaislības upuri un to līgot priekš Tā Kunga un likt uz altāri.
26 ౨౬ తరువాత యాజకుడు ఆ నైవేద్యంలో నుండి ఓ గుప్పెడు తీసి బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఆ తరువాత ఆ నీళ్ళను ఆమెకు తాగించాలి.
Un priesterim no tā ēdamā upura būs ņemt pilnu sauju par piemiņas upuri, un to iededzināt uz altāra, un tad viņam to ūdeni tai sievai būs dot dzert.
27 ౨౭ యాజకుడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించినప్పుడు ఒకవేళ ఆమె అపవిత్రురాలై తన భర్తకి ద్రోహం చేసి ఉంటే శాపం కలుగజేసే ఆ నీళ్ళు ఆమె కడుపులోకి వెళ్ళి చేదు అవుతాయి. ఆమె పొత్తి కడుపు వాచి ఉబ్బుతుంది. ఆమె తొడలు బలహీనం అవుతాయి. ఆమె తన ప్రజల్లో శాపగ్రస్తురాలవుతుంది.
Kad nu viņš tai to ūdeni būs devis dzert, tad notiks: ja tā ir sagānījusies un pret savu vīru noziegdamies ir noziegusies, ka tas lāsta ūdens viņai paliks par rūgtumu un viņas vēders uztūks un viņas ciska izdils, un tā sieva būs par lāstu starp saviem ļaudīm.
28 ౨౮ ఒకవేళ ఆ స్త్రీ అపవిత్రం కాకుండా పవిత్రంగా ఉంటే విడుదల పొందుతుంది. ఆమె సంతానం పొందడానికి యోగ్యురాలవుతుంది.
Bet ja tā sieva nav sagānījusies, bet šķīsta, tad viņa paliks vesela un auglīga.
29 ౨౯ అనుమానం గురించిన చట్టం ఇది. భర్త ఆధీనంలో ఉన్న ఏ స్త్రీ అయినా దారి తప్పి అపవిత్రురాలైనప్పుడు పాటించాల్సిన చట్టం ఇది.
Šis ir tas bauslis par neuzticības kaislību, kad laulāta sieva ir novērsusies no sava vīra un sagānījusies,
30 ౩౦ ఒకవేళ భర్తకు తన భార్యపై అనుమానం కలిగినా ఇదే చట్టం పాటించాలి. అతడు ఆమెను యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. ఈ అనుమానం గురించిన చట్టం వివరించిన వాటన్నిటినీ యాజకుడు ఆమె విషయంలో జరిగించాలి.
Vai kad vīru pārņem neuzticības kaislība un viņš neuztic savai sievai, tad tam tā sieva jāved Tā Kunga priekšā, un priesterim jādara pēc visa šī baušļa.
31 ౩౧ అప్పుడు ఆ వ్యక్తి తన భార్యను యాజకుడి దగ్గరకి తీసుకు వచ్చిన నేరం నుండి విముక్తుడవుతాడు. ఆ స్త్రీ ఏదన్నా అపరాధం చేస్తే ఆ శిక్ష భరించాలి.
Un tas vīrs būs nenoziedzīgs pie tā nozieguma, bet tā sieva nesīs savu noziegumu.

< సంఖ్యాకాండము 5 >