< లూకా 18 >

1 తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్ల వేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు.
அபரஞ்ச லோகைரக்லாந்தை ர்நிரந்தரம்’ ப்ரார்த²யிதவ்யம் இத்யாஸ²யேந யீஸு²நா த்³ரு’ஷ்டாந்த ஏக​: கதி²த​: |
2 “ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు.
குத்ரசிந்நக³ரே கஸ்²சித் ப்ராட்³விவாக ஆஸீத் ஸ ஈஸ்²வராந்நாபி³பே⁴த் மாநுஷாம்’ஸ்²ச நாமந்யத|
3 ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని దగ్గరికి తరచుగా వచ్చి ‘నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి’ అని అడుగుతూ ఉండేది.
அத² தத்புரவாஸிநீ காசித்³வித⁴வா தத்ஸமீபமேத்ய விவாதி³நா ஸஹ மம விவாத³ம்’ பரிஷ்குர்வ்விதி நிவேத³யாமாஸ|
4 అతడు ఆమెకు న్యాయం చేయడానికి చాలాకాలం వరకూ ఇష్టపడలేదు. కాని ఆ తరువాత ఇలా అనుకున్నాడు, ‘నేను దేవుడికి భయపడను, మనుషులనూ లెక్కచెయ్యను.
தத​: ஸ ப்ராட்³விவாக​: கியத்³தி³நாநி ந தத³ங்கீ³க்ரு’தவாந் பஸ்²சாச்சித்தே சிந்தயாமாஸ, யத்³யபீஸ்²வராந்ந பி³பே⁴மி மநுஷ்யாநபி ந மந்யே
5 కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది. కాబట్టి ఆమె మాటిమాటికీ వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను’ అనుకున్నాడు.”
ததா²ப்யேஷா வித⁴வா மாம்’ க்லிஸ்²நாதி தஸ்மாத³ஸ்யா விவாத³ம்’ பரிஷ்கரிஷ்யாமி நோசேத் ஸா ஸதா³க³த்ய மாம்’ வ்யக்³ரம்’ கரிஷ்யதி|
6 ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా!
பஸ்²சாத் ப்ரபு⁴ரவத³த்³ அஸாவந்யாயப்ராட்³விவாகோ யதா³ஹ தத்ர மநோ நித⁴த்⁴வம்’|
7 తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా? వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా?
ஈஸ்²வரஸ்ய யே (அ)பி⁴ருசிதலோகா தி³வாநிஸ²ம்’ ப்ரார்த²யந்தே ஸ ப³ஹுதி³நாநி விலம்ப்³யாபி தேஷாம்’ விவாதா³ந் கிம்’ ந பரிஷ்கரிஷ்யதி?
8 ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?”
யுஷ்மாநஹம்’ வதா³மி த்வரயா பரிஷ்கரிஷ்யதி, கிந்து யதா³ மநுஷ்யபுத்ர ஆக³மிஷ்யதி ததா³ ப்ரு’தி²வ்யாம்’ கிமீத்³ரு’ஸ²ம்’ விஸ்²வாஸம்’ ப்ராப்ஸ்யதி?
9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు.
யே ஸ்வாந் தா⁴ர்ம்மிகாந் ஜ்ஞாத்வா பராந் துச்சீ²குர்வ்வந்தி ஏதாத்³ரு’க்³ப்⁴ய​: , கியத்³ப்⁴ய இமம்’ த்³ரு’ஷ்டாந்தம்’ கத²யாமாஸ|
10 ౧౦ “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు.
ஏக​: பி²ரூஸ்²யபர​: கரஸஞ்சாயீ த்³வாவிமௌ ப்ரார்த²யிதும்’ மந்தி³ரம்’ க³தௌ|
11 ౧౧ పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
ததோ(அ)ஸௌ பி²ரூஸ்²யேகபார்ஸ்²வே திஷ்ட²ந் ஹே ஈஸ்²வர அஹமந்யலோகவத் லோட²யிதாந்யாயீ பாரதா³ரிகஸ்²ச ந ப⁴வாமி அஸ்ய கரஸஞ்சாயிநஸ்துல்யஸ்²ச ந, தஸ்மாத்த்வாம்’ த⁴ந்யம்’ வதா³மி|
12 ౧౨ వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ஸப்தஸு தி³நேஷு தி³நத்³வயமுபவஸாமி ஸர்வ்வஸம்பத்தே ர்த³ஸ²மாம்’ஸ²ம்’ த³தா³மி ச, ஏதத்கதா²ம்’ கத²யந் ப்ரார்த²யாமாஸ|
13 ౧౩ అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.
கிந்து ஸ கரஸஞ்சாயி தூ³ரே திஷ்ட²ந் ஸ்வர்க³ம்’ த்³ரஷ்டும்’ நேச்ச²ந் வக்ஷஸி கராகா⁴தம்’ குர்வ்வந் ஹே ஈஸ்²வர பாபிஷ்ட²ம்’ மாம்’ த³யஸ்வ, இத்த²ம்’ ப்ரார்த²யாமாஸ|
14 ౧౪ పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.
யுஷ்மாநஹம்’ வதா³மி, தயோர்த்³வயோ ர்மத்⁴யே கேவல​: கரஸஞ்சாயீ புண்யவத்த்வேந க³ணிதோ நிஜக்³ரு’ஹம்’ ஜகா³ம, யதோ ய​: கஸ்²சித் ஸ்வமுந்நமயதி ஸ நாமயிஷ்யதே கிந்து ய​: கஸ்²சித் ஸ்வம்’ நமயதி ஸ உந்நமயிஷ்யதே|
15 ౧౫ తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు.
அத² ஸி²ஸூ²நாம்’ கா³த்ரஸ்பர்ஸா²ர்த²ம்’ லோகாஸ்தாந் தஸ்ய ஸமீபமாநிந்யு​: ஸி²ஷ்யாஸ்தத்³ த்³ரு’ஷ்ட்வாநேத்ரு’ந் தர்ஜயாமாஸு​: ,
16 ౧౬ అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు. “పిల్లలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆటంకపెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే.
கிந்து யீஸு²ஸ்தாநாஹூய ஜகா³த³, மந்நிகடம் ஆக³ந்தும்’ ஸி²ஸூ²ந் அநுஜாநீத்⁴வம்’ தாம்’ஸ்²ச மா வாரயத; யத ஈஸ்²வரராஜ்யாதி⁴காரிண ஏஷாம்’ ஸத்³ரு’ஸா²​: |
17 ౧౭ చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
அஹம்’ யுஷ்மாந் யதா²ர்த²ம்’ வதா³மி, யோ ஜந​: ஸி²ஸோ²​: ஸத்³ரு’ஸோ² பூ⁴த்வா ஈஸ்²வரராஜ்யம்’ ந க்³ரு’ஹ்லாதி ஸ கேநாபி ப்ரகாரேண தத் ப்ரவேஷ்டும்’ ந ஸ²க்நோதி|
18 ౧౮ ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. (aiōnios g166)
அபரம் ஏகோதி⁴பதிஸ்தம்’ பப்ரச்ச², ஹே பரமகு³ரோ, அநந்தாயுஷ​: ப்ராப்தயே மயா கிம்’ கர்த்தவ்யம்’? (aiōnios g166)
19 ౧౯ అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు.
யீஸு²ருவாச, மாம்’ குத​: பரமம்’ வத³ஸி? ஈஸ்²வரம்’ விநா கோபி பரமோ ந ப⁴வதி|
20 ౨౦ వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.
பரதா³ராந் மா க³ச்ச², நரம்’ மா ஜஹி, மா சோரய, மித்²யாஸாக்ஷ்யம்’ மா தே³ஹி, மாதரம்’ பிதரஞ்ச ஸம்’மந்யஸ்வ, ஏதா யா ஆஜ்ஞா​: ஸந்தி தாஸ்த்வம்’ ஜாநாஸி|
21 ౨౧ దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు.
ததா³ ஸ உவாச, பா³ல்யகாலாத் ஸர்வ்வா ஏதா ஆசராமி|
22 ౨౨ యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు.
இதி கதா²ம்’ ஸ்²ருத்வா யீஸு²ஸ்தமவத³த், ததா²பி தவைகம்’ கர்ம்ம ந்யூநமாஸ்தே, நிஜம்’ ஸர்வ்வஸ்வம்’ விக்ரீய த³ரித்³ரேப்⁴யோ விதர, தஸ்மாத் ஸ்வர்கே³ த⁴நம்’ ப்ராப்ஸ்யஸி; தத ஆக³த்ய மமாநுகா³மீ ப⁴வ|
23 ౨౩ అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు.
கிந்த்வேதாம்’ கதா²ம்’ ஸ்²ருத்வா ஸோதி⁴பதி​: ஸு²ஸோ²ச, யதஸ்தஸ்ய ப³ஹுத⁴நமாஸீத்|
24 ౨౪ యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం.
ததா³ யீஸு²ஸ்தமதிஸோ²காந்விதம்’ த்³ரு’ஷ்ட்வா ஜகா³த³, த⁴நவதாம் ஈஸ்²வரராஜ்யப்ரவேஸ²​: கீத்³ரு’க்³ து³ஷ்கர​: |
25 ౨౫ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు.
ஈஸ்²வரராஜ்யே த⁴நிந​: ப்ரவேஸா²த் ஸூசேஸ்²சி²த்³ரேண மஹாங்க³ஸ்ய க³மநாக³மநே ஸுகரே|
26 ౨౬ ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు
ஸ்²ரோதார​: பப்ரச்சு²ஸ்தர்ஹி கேந பரித்ராணம்’ ப்ராப்ஸ்யதே?
27 ౨౭ అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు.
ஸ உக்தவாந், யந் மாநுஷேணாஸ²க்யம்’ தத்³ ஈஸ்²வரேண ஸ²க்யம்’|
28 ౨౮ అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.”
ததா³ பிதர உவாச, பஸ்²ய வயம்’ ஸர்வ்வஸ்வம்’ பரித்யஜ்ய தவ பஸ்²சாத்³கா³மிநோ(அ)ப⁴வாம|
29 ౨౯ అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి,
தத​: ஸ உவாச, யுஷ்மாநஹம்’ யதா²ர்த²ம்’ வதா³மி, ஈஸ்²வரராஜ்யார்த²ம்’ க்³ரு’ஹம்’ பிதரௌ ப்⁴ராத்ரு’க³ணம்’ ஜாயாம்’ ஸந்தாநாம்’ஸ்²ச த்யக்தவா
30 ౩౦ ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. (aiōn g165, aiōnios g166)
இஹ காலே ததோ(அ)தி⁴கம்’ பரகாலே (அ)நந்தாயுஸ்²ச ந ப்ராப்ஸ்யதி லோக ஈத்³ரு’ஸ²​: கோபி நாஸ்தி| (aiōn g165, aiōnios g166)
31 ౩౧ ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. ప్రవక్తలు మనుష్య కుమారుణ్ణి గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి.
அநந்தரம்’ ஸ த்³வாத³ஸ²ஸி²ஷ்யாநாஹூய ப³பா⁴ஷே, பஸ்²யத வயம்’ யிரூஸா²லம்நக³ரம்’ யாம​: , தஸ்மாத் மநுஷ்யபுத்ரே ப⁴விஷ்யத்³வாதி³பி⁴ருக்தம்’ யத³ஸ்தி தத³நுரூபம்’ தம்’ ப்ரதி க⁴டிஷ்யதே;
32 ౩౨ ఆయనను యూదేతరులకు పట్టిస్తారు. వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు.
வஸ்துதஸ்து ஸோ(அ)ந்யதே³ஸீ²யாநாம்’ ஹஸ்தேஷு ஸமர்பயிஷ்யதே, தே தமுபஹஸிஷ்யந்தி, அந்யாயமாசரிஷ்யந்தி தத்³வபுஷி நிஷ்டீ²வம்’ நிக்ஷேப்ஸ்யந்தி, கஸா²பி⁴​: ப்ரஹ்ரு’த்ய தம்’ ஹநிஷ்யந்தி ச,
33 ౩౩ ఆయనను కొరడాలతో కొడతారు, చంపివేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పాడు.
கிந்து த்ரு’தீயதி³நே ஸ ஸ்²மஸா²நாத்³ உத்தா²ஸ்யதி|
34 ౩౪ వారికి ఈ మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఈ సంగతి వారికి మర్మంగా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతు బట్టలేదు.
ஏதஸ்யா​: கதா²யா அபி⁴ப்ராயம்’ கிஞ்சித³பி தே போ³த்³து⁴ம்’ ந ஸே²கு​: தேஷாம்’ நிகடே(அ)ஸ்பஷ்டதவாத் தஸ்யைதாஸாம்’ கதா²நாம் ஆஸ²யம்’ தே ஜ்ஞாதும்’ ந ஸே²குஸ்²ச|
35 ౩౫ ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు.
அத² தஸ்மிந் யிரீஹோ​: புரஸ்யாந்திகம்’ ப்ராப்தே கஸ்²சித³ந்த⁴​: பத²​: பார்ஸ்²வ உபவிஸ்²ய பி⁴க்ஷாம் அகரோத்
36 ౩౬ పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి, “ఏం జరుగుతోంది?” అని అడిగాడు.
ஸ லோகஸமூஹஸ்ய க³மநஸ²ப்³த³ம்’ ஸ்²ருத்வா தத்காரணம்’ ப்ரு’ஷ்டவாந்|
37 ౩౭ నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు.
நாஸரதீயயீஸு²ர்யாதீதி லோகைருக்தே ஸ உச்சைர்வக்துமாரேபே⁴,
38 ౩౮ అప్పుడు వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని కేకలు వేయడం మొదలు పెట్టాడు.
ஹே தா³யூத³​: ஸந்தாந யீஸோ² மாம்’ த³யஸ்வ|
39 ౩౯ ముందు నడుస్తున్నవారు, “నోరు మూసుకో” అని గద్దించారు. కానీ వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని మరింత బిగ్గరగా కేకలు వేశాడు.
ததோக்³ரகா³மிநஸ்தம்’ மௌநீ திஷ்டே²தி தர்ஜயாமாஸு​: கிந்து ஸ புநாருவந் உவாச, ஹே தா³யூத³​: ஸந்தாந மாம்’ த³யஸ்வ|
40 ౪౦ అప్పుడు యేసు నిలబడి, వాణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు.
ததா³ யீஸு²​: ஸ்த²கி³தோ பூ⁴த்வா ஸ்வாந்திகே தமாநேதும் ஆதி³தே³ஸ²|
41 ౪౧ వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, “నీ కోసం నేనేంచేయాలని కోరుతున్నావు?” అని అడిగాడు. దానికి వాడు, “ప్రభూ, నాకు చూపు కావాలి” అన్నాడు.
தத​: ஸ தஸ்யாந்திகம் ஆக³மத், ததா³ ஸ தம்’ பப்ரச்ச², த்வம்’ கிமிச்ச²ஸி? த்வத³ர்த²மஹம்’ கிம்’ கரிஷ்யாமி? ஸ உக்தவாந், ஹே ப்ரபோ⁴(அ)ஹம்’ த்³ரஷ்டும்’ லபை⁴|
42 ౪౨ దానికి యేసు, “చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.
ததா³ யீஸு²ருவாச, த்³ரு’ஷ்டிஸ²க்திம்’ க்³ரு’ஹாண தவ ப்ரத்யயஸ்த்வாம்’ ஸ்வஸ்த²ம்’ க்ரு’தவாந்|
43 ౪౩ వెంటనే వాడు చూపు పొందాడు. దేవుణ్ణి కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు. ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు.
ததஸ்தத்க்ஷணாத் தஸ்ய சக்ஷுஷீ ப்ரஸந்நே; தஸ்மாத் ஸ ஈஸ்²வரம்’ த⁴ந்யம்’ வத³ந் தத்பஸ்²சாத்³ யயௌ, ததா³லோக்ய ஸர்வ்வே லோகா ஈஸ்²வரம்’ ப்ரஸ²ம்’ஸிதும் ஆரேபி⁴ரே|

< లూకా 18 >