< లూకా 11 >

1 ఆయన ఒకసారి ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, “ప్రభూ, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు” అని ఆయనను అడిగాడు.
Issi gallas Yesussay issi son woossides, woossa wursishin iza kaallizaytappe issay Godo xamaqiza Yanisay bena kaallizayta woossa tamaarsidaysatho nekka nuna woossa tamaarsa gides.
2 అందుకు ఆయన, “మీరు ప్రార్థన చేసేటప్పుడు, ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఎంచబడు గాక, నీ రాజ్యం వచ్చుగాక,
Izikka istas woosishe hizgidi woosite nu aawo ne sunthi anjjetto ne kawotethi haayo.
3 మాకు కావలసిన అనుదిన ఆహారం ప్రతిరోజూ మాకు దయచెయ్యి,
Hachsi gidiza quma nuus imma.
4 మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు’ అని పలకండి” అని చెప్పాడు.
Nuna qohidayta nu maariza mala nuna maara paacenkka nuna gelthofa
5 తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు. “మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి. అర్థరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ‘మిత్రమా, నాకు మూడు రొట్టెలు బదులివ్వు.
Qassekka hiz gides “intefe issi uras laggey diikko giidi giddoth he laggezaso biiddi taas issi imathi ogeppe yin muzana kath bayndda gish heezzu buddennay diikko taas tal7arikii?” gides.
6 నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ దారిలో నా దగ్గరికి వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు’ అని చెప్పారనుకోండి.
7 అతడు లోపలే ఉండి, ‘నన్ను తొందర పెట్టవద్దు. తలుపు వేసేశాను. చిన్న పిల్లలు నిద్ర పోతున్నారు. నేను లేచి ఇవ్వలేను’ అని చెబుతాడా?
Laggezikka zaaridi tana waysoppa, kareyykka gordettides, tanikka naytara zin7akichadis ha7i denddada immanas danda7ikke gaandee?
8 మీరు తన స్నేహితుడని కాకపోయినా సిగ్గు విడిచి అదేపనిగా అడగడం వల్లనైనా లేచి కావలసినవన్నీ ఇస్తాడని మీకు చెబుతున్నాను.
Taka intes yootays laggetetha gish dendidi immonta agikkokka izi oychchon salethida gish denddidi koyizaysa wursi immides.
9 అలాగే మీరు కూడా దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తాడు. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి. మీకు తెరుచుకుంటుంది.
Hessa gish tani intes gizay woosite intes imistana, koyite inte demmna, kare qoxxite intes doyettana.
10 ౧౦ అడిగే ప్రతి వ్యక్తికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టేవాడికి తలుపు తెరుచుకుంటుందని మీకు చెబుతున్నాను.
Ays giiko woosizay wuri ekkana, koyizayka demmna kare qoxxizadeska doyettana.
11 ౧౧ “మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపకోసం అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా?
Intefe aawa gidi uttidi izi yelida nay mole oychchiko shooshu immizay daandee?
12 ౧౨ గుడ్డు అడిగితే తేలునిస్తాడా?
Woyko phuuphuule oychchiko masmaso immizay daandee?
13 ౧౩ కాబట్టి మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి విషయాలనే ఇవ్వాలని అనుకుంటుంటే పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను కచ్చితంగా అనుగ్రహిస్తాడు కదా” అని చెప్పాడు.
Inte iitata gidishe inte naytas lo7o imota imo erikko salon diza inte aaway bena woosizaytaas Xillo Ayaanaan wosit darisi immennee?
14 ౧౪ ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం వదలిపోయిన తరవాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు.
Issi gallas Yesussay haasa7isonta mume dayiddanth kessides. dayiddanthazikka kezidappe guye duuna mume addezzi haasa7ides, beydda asatikka darsi malalettida.
15 ౧౫ అయితే వారిలో కొందరు, “వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అని చెప్పుకున్నారు.
Gido attin issi issi asati bi7eela zebula geetettiza dayiddanthata halaqan dayiddanthata kesses gida.
16 ౧౬ మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు.
Issi issi asay iza paacanaas saloppe malaata bessa gidi oychchida.
17 ౧౭ ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు, “తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది.
Gido attin Yesussay ista qofa eridi hiz gides “ba garsan shaaketiza kawotethi wuri dhayanan, ba giddon sigay bayndda keethikka kundanna.
18 ౧౮ సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరైపోతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది?
Inte tana bi7eel zubula dayiddanthata kesses giidi haasi7ista shin xalla7eykka ba giddon issay issafe shaaketikko iza kawotethi waani minnannee?
19 ౧౯ నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అంటున్నారే, మరి మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నారు? దీని వలన మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు.
Histtikko tani dayiddanthata bi7eel zubula kessiko inte nayti oonani kesaneeshaa? Hessa gish inte nayti inte bolla firdizayta gidana.
20 ౨౦ అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం, దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరికి వచ్చిందనే.
Gido attin tani dayiddanthata kessizay Xoossa wolqan gakkides Xoossa kawotethay inteko matidaro erite.
21 ౨౧ బలవంతుడు ఆయుధాలు ధరించుకుని, తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది.
Mino uray lo7ethi gixettidi ba keeth naagikko keeththan diza miishshi lo7oon naagetes.
22 ౨౨ అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుంటాడు.
Gido attin izappe hara mino uray yiidi xoonikko izi amanettidda ola massara wothi ekkidi izas diza haarozakka wursi haras gishanna.
23 ౨౩ నా వైపు ఉండని వాడు నాకు విరోధి. నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే.
Tanara gidontay tanara eqettes, tanarakka shiishshonta uray laalles,
24 ౨౪ “అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరవాత విశ్రాంతి కోసం వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. దానికెక్కడా విశ్రాంతి దొరకదు. అందుకని అది ‘నా పాత ఇంటికే మళ్ళీ వెళతాను’ అనుకుంటుంది.
Tuna ayaanaay asappe kezida wode shemppo koyishe haathi bayndda mela son wayetesi, shempo soy dhaykko tani kase kezidaso guye simana gees.
25 ౨౫ అది వచ్చి, ఆ ఇల్లు ఊడ్చి, అమర్చి ఉండడం చూసి
Izappe simmidi yishin kase izi aggi bida keethay pitettidinne giigi utidaysa demmes.
26 ౨౬ తిరిగి వెళ్ళి, తన కంటే చెడ్డవైన మరో ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకువస్తుంది. అవి ఆ ఇంట్లో చొరబడి ఇక అక్కడే నివాసముంటాయి. కాబట్టి ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వాన్నంగా ఉంటుంది” అని చెప్పాడు.
Hessafe simmidi biiddi izappe iitiza hara laappun dayiddanthata benara ekkidi yes, istikka gelidi heen dana, he uraskka koyroysafe guyyeys keehi iita gidana.”
27 ౨౭ ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది.
Yesussay hessa haasa7iza wode asa giddofe issi maccash dizara ba qaala dhoqqu oothada nena tookkida qanthinne ne dhammida dhanthati anjjettidayta gadus.
28 ౨౮ దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు.
Gido attin izi anjjettidayti Xoossa qaala siiyidi azazettizayta gides.
29 ౨౯ ప్రజలంతా గుంపులుగా ఉన్నప్పుడు ఆయన వారికి ఇలా చెప్పాడు, “ఈ తరం చెడ్డది. వీరు సూచన అడుగుతున్నారు. అయితే యోనా సూచన తప్పించి మరి ఏ సూచనా వీరికి చూపడం జరగదు.
Daro derey Yesussako shiiqida wode Yesussay hizgides “haysi ha yellistay iita yellista, gita malaata beyana koyees. Gido attin Yoonassa malaatappe hara dumma malaatay imetenna.
30 ౩౦ యోనా నీనెవె పట్టణ వాసులకు ఎలా సూచనగా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు.
Gaassoyka Yoonassay Nanawe asas malaata gidida mala asa nay tani ha yellistaas malaata gidana.
31 ౩౧ దక్షిణ దేశం రాణి తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వీరి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞాన వాక్కులు వినడానికి సుదూర దేశం నుండి వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
Duge baga dere macca kawoya Solomone erateth beyanas biitta gaxappe denddada yida gish pirda wode iza ha yellistara denddada pirdana heko Solomoneppe aadhdhizaddey han dees.
32 ౩౨ నీనెవె ప్రజలు తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతారు. ఎందుకంటే వారు యోనా బోధ విని మారుమనస్సు పొందారు. యోనా కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు.
Yoonassay sabbakishin siiyidi Nanawe asay ba naggarappe maaretethan gelida gish ha yellistara issife dendidi pirdana.
33 ౩౩ “ఎవరూ దీపాన్ని వెలిగించి చాటుగానో బుట్ట కిందనో పెట్టరు, లోపలికి వచ్చేవారికి వెలుగు కనబడాలని దీపస్తంభం పైనే పెడతారు.
Xomppe oythidi kareppe geliza asas poo7ana mala qoncceson wothetes attin geemason wothiza asi deenna.
34 ౩౪ నీ దేహానికి దీపం నీ కన్నే. నీ కన్ను మంచిదైతే నీ శరీరమంతా వెలుగు ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహం చీకటి మయమై ఉంటుంది.
Ne asatetha poo7oy ne ayfe ne ayfey paxa gidiko ne kumetha asatethay poo7o gidana ne ayfey sakettikko ne kumetha asatethay dhuma gidana.
35 ౩౫ కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో.
Hessa gish nenan diza poo7oy dhumonta mala naageista.
36 ౩౬ నీ దేహంలో ఏ భాగమూ చీకటిలో లేకుండా నీ దేహం అంతా వెలుగే ఉన్నట్టయితే, దీపం కాంతి నీపై ప్రసరించినప్పుడు ఎలా ఉంటుందో అలాగే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది.”
Histikko ne asatethay poo7o gidikko dhumida asatethi deenna agikko ne kumetha asatethay xomppe lo7ethi po7iza mala lo7i beettanna.
37 ౩౭ ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని ఆయనను ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజనం వరసలో కూర్చున్నాడు.
Yesussay haasa7a wursida mala issi parsawey benara quma maanaas Yesussa xeygides.
38 ౩౮ ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు.
Yesussay quma maana kushe mecetonta agiddayssa beyidi malalettida.
39 ౩౯ అది చూసి ప్రభువిలా అన్నాడు, “పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతో, చెడుతనంతో నిండి ఉంది.
Goday izas hizgides ha7i inte parsaweti xu7asinne keres bollabbagga meeci geeshista inte garssa bagaz uuzetethaninne iitatethan kumides.
40 ౪౦ అవివేకులారా, బయటి భాగాన్ని చేసినవాడే లోపలి భాగాన్ని కూడా చేశాడు కదా!
Inteno eeyato kare baga medhdhiday garssa baga medhibeynee?
41 ౪౧ మీకు ఉన్నవాటిని పేదలకు ధర్మం చేయండి. అప్పుడు మీకు అన్నీ శుభ్రంగా ఉంటాయి.
Yohon gidiko giddon dizaysa muxaata immite he wode wurikka intes geesh gidana.
42 ౪౨ అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన. మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి ఆకు కూరలోనూ పదోభాగం దేవునికి చెల్లిస్తారు గానీ దేవుని ప్రేమనూ, న్యాయాన్నీ వదిలేస్తున్నారు. మిగిలిన వాటిని చేస్తూనే న్యాయంగా నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి.
Inteno Farsaweto intes ayye anugappenne xalotappe qassekka dumma dumma kaththafe tamappe isino kessista. Gido attin tuma firdane Xoossa dosanaysa aggi aadhdheetta. Yohon gidiko inte aggi aadhdhannas beesena. Hankoysa aggonta inte oothanna bessizayttikka haayta.
43 ౪౩ అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన, మీరు సమాజ మందిరాల్లో అగ్ర స్థానాలూ, వ్యాపార వీధుల్లో ప్రజల నుండి వందనాలూ కోరుకుంటారు.
Inteno Farsaweto intes ayye mukuraben uttana boncho oydde koyyista giya giddonka asay inte sinthan hokana mala doseista.
44 ౪౪ అయ్యో, మీరు కనిపించని సమాధుల్లా ఉన్నారు. అవి సమాధులని తెలియని మనుషులు వాటి మీదే నడుస్తారు.”
Asi eronta iza bollara biza qoteti diza duufo inte milatiza gish intena ayye.
45 ౪౫ అప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, “బోధకుడా. ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు” అని ఆయనతో అన్నాడు.
Muse woga erizaytappe issay zaaridi tamarisizayso ne hessaththo haasa7iza wode nunaka cayaassa gides.
46 ౪౬ అందుకు యేసు, “అయ్యో, ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీకు యాతన. మీరు మనుషులపై మోయలేని బరువులు మోపుతారు. మీరు మాత్రం ఒక వేలితో కూడా ఆ బరువులను తాకరు.
Yesussaykka zaaridi inteno Muse woga erizayto inteskka ayye asi tookanaas dandda7onta deexo toho asa toosista inte gidikko intes biradhdhe xeeranika bochchekkista.
47 ౪౭ అయ్యో, మీకు యాతన, మీ పూర్వీకులు ప్రవక్తలను చంపారు. మీరు చనిపోయిన ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు.
Inte aawati wodhida nabeta duufo inte lo7ethiza gish intes ayye.
48 ౪౮ దీన్నిబట్టి మీరు సాక్షులై మీ పూర్వీకులు చేసిన పనులకు సమ్మతి తెలుపుతున్నారు. వారు ప్రవక్తలను చంపారు. మీరు సమాధులు కడుతున్నారు. ఈ కారణం చేత దేవుని జ్ఞానం చెప్పేదేమిటంటే, ‘నేను వారి దగ్గరికి ప్రవక్తలనూ, అపొస్తలులనూ పంపుతాను.
Histtikko inte inte aawata ootho minnithiza markata istinabista wodhida intekka ista duufo lo7etheista.
49 ౪౯ వారు కొంత మందిని చంపుతారు. కొంతమందిని హింసిస్తారు.’
Hessa gish Xoossa erateth hizgadus nabetanne hawarista ta istas yeddana isttikka istafe issa issa wodhana haratakka gooddanna.
50 ౫౦ కాబట్టి లోకారంభం నుండీ అంటే హేబెలు రక్తం నుండి బలిపీఠానికీ దేవాలయానికీ మధ్య హతమైన జెకర్యా రక్తం వరకూ చిందిన ప్రవక్తలందరి రక్తం కోసం ఈ తరం వారిపై విచారణ జరుగుతుందని మీకు కచ్చితంగా చెబుతున్నాను.
Hessa gish ha yellistay biittay medhetosooppe ha7i gakkanaas gukida nabeta wurso suutha gish oychistana.
51 ౫౧
Aabelle suuthafe oykkidi yarshiza sooppene Xoossa keeththa giddon gukida Zakarasa suutha gakkanaas koyetes Ee ta intes gizay ha yellistay hayssas oychchistana.
52 ౫౨ అయ్యో, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే మీరు జ్ఞానం తాళం చెవిని తీసుకు పోయారు. మీరు లోపల ప్రవేశించరు. ప్రవేశించే వారిని అడ్డుకుంటారు” అని చెప్పాడు.
Inteno woga erizayto intena ayye eratetha qulfe wolqara wothi ekkidi inteskka gelibeykista gelanaytaka digeista.
53 ౫౩ ఆయన అక్కడ నుండి వెళ్ళి పోయిన తరువాత ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఆయన మీద పగ పట్టి ఆయన మీద నేరం మోపడానికై ఆయన మాటల్లో తప్పు పట్టుకోడానికి చూస్తూ ఆయనతో వాదిస్తూ వచ్చారు.
Yesussay heeppe kezidappe guye Xafetinne Farsaweti eqettishe oychchan shemppo diggida.
54 ౫౪
Iza duunappe keziza qaalan iza qaxi oykkanas naagettida.

< లూకా 11 >