< లేవీయకాండము 10 >

1 నాదాబు అబీహులు అహరోను కొడుకులు. వీళ్ళు తమ ధూపం వేసే పాత్రల్లో నిప్పులు ఉంచి వాటిపై ధూప ద్రవ్యాన్ని వేశారు. యెహోవా ఆదేశించని వేరే అగ్నిని ఆయన సమక్షంలోకి తీసుకు వచ్చారు.
तब नादाब और अबीहू नामक हारून के दो पुत्रों ने अपना-अपना धूपदान लिया, और उनमें आग भरी, और उसमें धूप डालकर उस अनुचित आग को जिसकी आज्ञा यहोवा ने नहीं दी थी यहोवा के सम्मुख अर्पित किया।
2 దాంతో యెహోవా సమక్షంలో నుండి మంటలు వచ్చి వాళ్ళని కాల్చి వేశాయి. యెహోవా సమక్షంలోనే వాళ్ళు చనిపోయారు.
तब यहोवा के सम्मुख से आग निकली और उन दोनों को भस्म कर दिया, और वे यहोवा के सामने मर गए।
3 అప్పుడు మోషే అహరోనుతో “నాకు సమీపంగా ఉన్నవారికి నా పవిత్రతని చూపిస్తాను. ప్రజలందరి ముందూ నేను మహిమ పొందుతాను అని యెహోవా చెప్పిన మాటకి అర్థం ఇదే” అన్నాడు. అహరోను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు.
तब मूसा ने हारून से कहा, “यह वही बात है जिसे यहोवा ने कहा था, कि जो मेरे समीप आए अवश्य है कि वह मुझे पवित्र जाने, और सारी जनता के सामने मेरी महिमा करे।” और हारून चुप रहा।
4 అప్పుడు మోషే అహరోను బాబాయి ఉజ్జీయేలు కొడుకులు మీషాయేలునూ, ఎల్సాఫానునూ పిలిపించి వాళ్ళకిలా చెప్పాడు. “మీరు ఇక్కడికి రండి. ప్రత్యక్ష గుడారం ఎదుట నుండి మీ సోదరులను శిబిరం బయటకు తీసుకుపొండి.”
तब मूसा ने मीशाएल और एलसाफान को जो हारून के चाचा उज्जीएल के पुत्र थे बुलाकर कहा, “निकट आओ, और अपने भतीजों को पवित्रस्थान के आगे से उठाकर छावनी के बाहर ले जाओ।”
5 వాళ్ళింకా యాజకుల అంగీలు వేసుకునే ఉన్నారు. అలాగే మోషే ఆదేశించినట్టు వాళ్ళు వచ్చి శిబిరం బయటకు వీళ్ళని మోసుకు వెళ్ళారు.
मूसा की इस आज्ञा के अनुसार वे निकट जाकर उनको अंगरखों सहित उठाकर छावनी के बाहर ले गए।
6 అప్పుడు మోషే అహరోనుతో అతని కొడుకులైన ఎలియాజరు, ఈతామారులతో “మీరు చావకుండా ఉండాలన్నా, యెహోవా ఈ సమాజం పైన కోపగించుకోకుండా ఉండాలన్నా మీరు మీ తలల పైని జుట్టు విరబోసుకోకూడదు. మీ బట్టలు చింపుకోకూడదు. అయితే యెహోవా వారిని కాల్చివేసినందుకు వారి కోసం మీ సోదరులు, ఇశ్రాయేలు సమాజమంతా ఏడవవచ్చు.
तब मूसा ने हारून से और उसके पुत्र एलीआजर और ईतामार से कहा, “तुम लोग अपने सिरों के बाल मत बिखराओ, और न अपने वस्त्रों को फाड़ो, ऐसा न हो कि तुम भी मर जाओ, और सारी मण्डली पर उसका क्रोध भड़क उठे; परन्तु इस्राएल के सारे घराने के लोग जो तुम्हारे भाई-बन्धु हैं वह यहोवा की लगाई हुई आग पर विलाप करें।
7 యెహోవా అభిషేకపు నూనె మీపైన ఉంది. కాబట్టి మీరు మాత్రం ప్రత్యక్ష గుడారం నుండి బయటకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మీరు చనిపోతారు” అని చెప్పాడు. వాళ్ళు మోషే మాట ప్రకారం చేశారు.
और तुम लोग मिलापवाले तम्बू के द्वार के बाहर न जाना, ऐसा न हो कि तुम मर जाओ; क्योंकि यहोवा के अभिषेक का तेल तुम पर लगा हुआ है।” मूसा के इस वचन के अनुसार उन्होंने किया।
8 తరువాత యెహోవా అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పాడు.
फिर यहोवा ने हारून से कहा,
9 “నువ్వూ నీతో ఉండే నీ కొడుకులూ ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించే సమయంలో ద్రాక్ష మద్యాన్ని గానీ, ఇంకే మత్తు పానీయాలు గానీ తాగవద్దు. అలా చేస్తే మీరు చనిపోతారు.
“जब जब तू या तेरे पुत्र मिलापवाले तम्बू में आएँ तब-तब तुम में से कोई न तो दाखमधु पीए हो न और किसी प्रकार का मद्य, कहीं ऐसा न हो कि तुम मर जाओ; तुम्हारी पीढ़ी-पीढ़ी में यह विधि प्रचलित रहे,
10 ౧౦ మీ రాబోయే తరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం. ప్రతిష్ట చేసిన దాన్ని లౌకికమైన దాని నుండీ, పవిత్రమైన దాన్ని అపవిత్రమైన దాని నుండీ వేరు చెయ్యాలి.
१०जिससे तुम पवित्र और अपवित्र में, और शुद्ध और अशुद्ध में अन्तर कर सको;
11 ౧౧ యెహోవా మోషే ద్వారా ఆదేశించిన శాసనాలను ఇశ్రాయేలు ప్రజలందరికీ మీరు బోధించాలి.”
११और इस्राएलियों को उन सब विधियों को सिखा सको जिसे यहोवा ने मूसा के द्वारा उनको बता दी हैं।”
12 ౧౨ అప్పుడు మోషే అహరోనుతోనూ, మిగిలి ఉన్న అతని కొడుకులు ఎలియాజరు ఈతామారులతోనూ మాట్లాడాడు. “యెహోవాకు అర్పించిన దహనబలి నుండి మిగిలిన నైవేద్యాన్ని తీసుకుని పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినండి. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైంది.
१२फिर मूसा ने हारून से और उसके बचे हुए दोनों पुत्र एलीआजर और ईतामार से भी कहा, “यहोवा के हव्य में से जो अन्नबलि बचा है उसे लेकर वेदी के पास बिना ख़मीर खाओ, क्योंकि वह परमपवित्र है;
13 ౧౩ దాన్ని మీరు ఒక పరిశుద్ధ స్థలం లో తినాలి. ఎందుకంటే యెహోవాకు చేసిన దహనబలి అర్పణల్లో అది నీకూ, నీ కొడుకులకూ రావాల్సిన భాగం. మీకు ఈ సంగతి చెప్పాలనే ఆజ్ఞ నేను పొందాను.
१३और तुम उसे किसी पवित्रस्थान में खाओ, वह यहोवा के हव्य में से तेरा और तेरे पुत्रों का हक़ है; क्योंकि मैंने ऐसी ही आज्ञा पाई है।
14 ౧౪ తరువాత కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్నీ, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడ భాగాన్నీ దేవుడు అంగీకరించిన ఒక పవిత్రమైన స్థలంలో మీరు తినాలి. వీటినీ నువ్వూ, నీ కొడుకులూ, నీ కూతుళ్ళూ తినాలి. ఎందుకంటే అవి ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతిబలుల్లో నీకూ, నీ కొడుకులకూ రావాల్సిన భాగం.
१४तब हिलाई हुई भेंट की छाती और उठाई हुई भेंट की जाँघ को तुम लोग, अर्थात् तू और तेरे बेटे-बेटियाँ सब किसी शुद्ध स्थान में खाओ; क्योंकि वे इस्राएलियों के मेलबलियों में से तुझे और तेरे बच्चों का हक़ ठहरा दी गई हैं।
15 ౧౫ కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్నీ, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడ భాగాన్నీ దహనబలిగా అర్పించిన కొవ్వుతో పాటు వాళ్ళు తీసుకురావాలి. వాటిని యెహోవా ఎదుట పైకెత్తి కదిలించే అర్పణగా తీసుకు రావాలి. యెహోవా ఆజ్ఞాపించినట్టు అవి శాశ్వతంగా నీకూ నీ కొడుకులకూ చెందిన భాగం. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం.”
१५चर्बी के हव्यों समेत जो उठाई हुई जाँघ और हिलाई हुई छाती यहोवा के सामने हिलाने के लिये आया करेंगी, ये भाग यहोवा की आज्ञा के अनुसार सर्वदा की विधि की व्यवस्था से तेरे और तेरे बच्चों के लिये हैं।”
16 ౧౬ అప్పుడు మోషే పాపం కోసం బలి కావాల్సిన మేకను గూర్చి అడిగాడు. కానీ అది అప్పటికే దహనమైపోయిందని తెలుసుకున్నాడు. కాబట్టి అతడు తక్కిన అహరోను కొడుకులు ఎలియాజరు, ఈతామారులపై కోప్పడ్డాడు.
१६फिर मूसा ने पापबलि के बकरे की खोजबीन की, तो क्या पाया कि वह जलाया गया है, इसलिए एलीआजर और ईतामार जो हारून के पुत्र बचे थे उनसे वह क्रोध में आकर कहने लगा,
17 ౧౭ “మీరు పాపం కోసం బలి అయిన పశువు మాంసాన్ని పవిత్ర స్థలం లో ఎందుకు తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. సమాజం పాపాలను తీసివేయడానికీ, ఆయన ఎదుట పరిహారం చేయడానికీ యెహోవా దాన్ని మీకు ఇచ్చాడు కదా.
१७“पापबलि जो परमपवित्र है और जिसे यहोवा ने तुम्हें इसलिए दिया है कि तुम मण्डली के अधर्म का भार अपने पर उठाकर उनके लिये यहोवा के सामने प्रायश्चित करो, तुम ने उसका माँस पवित्रस्थान में क्यों नहीं खाया?
18 ౧౮ చూడండి, దాని రక్తాన్ని పరిశుద్ధ స్థలం లోకి తీసుకు రాలేదు. నేను ఆజ్ఞాపించినట్టే మీరు దాని మాంసాన్ని పరిశుద్ధ స్థలం లో కచ్చితంగా తినాల్సిందే” అని మందలించాడు.
१८देखो, उसका लहू पवित्रस्थान के भीतर तो लाया ही नहीं गया, निःसन्देह उचित था कि तुम मेरी आज्ञा के अनुसार उसके माँस को पवित्रस्थान में खाते।”
19 ౧౯ అప్పుడు అహరోను మోషేతో “చూడు, ఈ రోజు వీళ్ళు పాపం కోసం తమ బలులూ, దహన బలులూ యెహోవా ఎదుట అర్పించారు. అయినా ఈ రోజే నాకు ఈ విపత్తు జరిగింది. పాపం కోసం చేసిన బలిమాంసం నేను తింటే యెహోవా దృష్టికి అది సరైనదవుతుందా?” అన్నాడు.
१९इसका उत्तर हारून ने मूसा को इस प्रकार दिया, “देख, आज ही उन्होंने अपने पापबलि और होमबलि को यहोवा के सामने चढ़ाया; फिर मुझ पर ऐसी विपत्तियाँ आ पड़ी हैं! इसलिए यदि मैं आज पापबलि का माँस खाता तो क्या यह बात यहोवा के सम्मुख भली होती?”
20 ౨౦ మోషే ఆ మాట విని ఒప్పుకున్నాడు.
२०जब मूसा ने यह सुना तब उसे संतोष हुआ।

< లేవీయకాండము 10 >