< న్యాయాధిపతులు 14 >

1 సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు.
I siðe Samson u Tamnat, i vidje ondje jednu djevojku izmeðu kæeri Filistejskih.
2 అతడు ఇంటికి తిరిగి వచ్చి “తిమ్నాతులో ఒక ఫిలిష్తీ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయండి” అని తన తల్లిదండ్రులను అడిగాడు.
I vrativši se kaza ocu svojemu i materi svojoj govoreæi: vidjeh djevojku u Tamnatu izmeðu kæeri Filistejskih; oženite me njom.
3 వారు “నీ బంధువుల్లో గానీ మన సొంత జాతిలో గానీ అమ్మాయిలు లేరనా సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని భార్యగా తెచ్చుకోడానికి వెళ్తున్నావు?” అని అతణ్ణి అడిగారు. అందుకు సంసోను “ఆమె నాకు నచ్చింది. నా కోసం ఆమెను తెప్పించు” అని తన తండ్రితో అన్నాడు.
A otac i mati rekoše mu: zar nema djevojke meðu kæerima tvoje braæe u svem narodu mom, da ideš da se oženiš izmeðu Filisteja neobrezanijeh? A Samson odgovori ocu svojemu: njom me oženi, jer mi je ona omiljela.
4 అయితే ఫిలిష్తీయులకు కీడు చేయడానికి యెహోవాయే అతణ్ణి పురిగొల్పుతున్నాడని అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు.
A otac i mati njegova ne znadijahu da je to od Gospoda, i da traži zadjevicu s Filistejima; jer u ono vrijeme Filisteji vladahu sinovima Izrailjevijem.
5 తరువాత సంసోను తన తల్లిదండ్రులతో కలసి తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహం భీకరంగా గర్జిస్తూ అతని మీదికి వచ్చింది.
I tako side Samson s ocem svojim i s materom svojom u Tamnat, i kad doðoše do vinograda Tamnatskih, gle, mlad lav rièuæi sukobi ga.
6 యెహోవా ఆత్మ అకస్మాత్తుగా అతణ్ణి ఆవరించాడు. దాంతో చేతిలో ఏమీ లేక పోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి వేశాడు. కాని తాను చేసినదాన్ని తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.
I duh Gospodnji side na nj, te rastrže lava kao jare nemajuæi ništa u ruci: i ne kaza ocu ni materi šta je uèinio.
7 అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనికి నచ్చింది.
I tako došavši govori s djevojkom, i ona omilje Samsonu.
8 కొంతకాలం గడచిన తరువాత ఆమెను తీసుకుని రావడానికి తిరిగి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ సింహం కళేబరం చూడడానికి పక్కకు తిరిగాడు. ఆ సింహపు అస్థిపంజరంలో అతనికి ఒక తేనెటీగల గుంపూ తేనే కనిపించాయి.
A poslije nekoliko dana iduæi opet da je odvede, svrne da vidi mrtvoga lava; a gle, u mrtvom lavu roj pèela i med.
9 అతడు ఆ తేనె తీసి చేతిలో పట్టుకుని తింటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారికీ కొంత తేనె ఇచ్చాడు. వారూ దాన్ని తిన్నారు. అయితే తాను ఆ తేనెను సింహం కళేబరం నుండి తీశానని వారికి చెప్పలేదు.
I izvadi ga u ruku, i poðe putem jeduæi; i kad doðe k ocu i materi, dade im te jedoše; ali im ne reèe da je iz mrtvoga lava izvadio med.
10 ౧౦ సంసోను తండ్రి ఆ స్త్రీని చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సంసోను అక్కడి సంప్రదాయం ప్రకారం ఒక విందు ఏర్పాటు చేశాడు.
I tako doðe otac njegov k onoj djevojci, i Samson uèini ondje veselje, jer tako èinjahu momci.
11 ౧౧ ఆమె బంధువులు అతణ్ణి చూడగానే అతనితో ఉండటానికి ముప్ఫై మంది స్నేహితులను తీసుకుని వచ్చారు.
I kad ga vidješe Filisteji, izabraše trideset druga da budu s njim.
12 ౧౨ అప్పుడు సంసోను వారితో “మీకిష్టమైతే మీకో పొడుపు కథ చెప్తాను. ఈ విందు జరిగే ఏడు రోజుల్లోగా మీలో ఎవరైనా ఈ పొడుపు కథ విప్పి నాకు చెప్పగలిగితే నేను ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీకు ఇస్తాను.
I reèe im Samson: ja æu vam zagonenuti zagonetku, pa ako mi je odgonenete za sedam dana dok je veselje i pogodite, daæu vam trideset košulja i tridesetore sveèane haljine.
13 ౧౩ ఒకవేళ మీరు ఆ పొడుపు కథ విప్పలేకపోతే ఆ ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీరు నాకు ఇవ్వాలి” అన్నాడు. దానికి వారు “ఆ పొడుపు కథ ఏమిటో చెప్పు. వింటాం.” అన్నారు.
Ako li ne odgonenete, vi æete dati meni trideset košulja i tridesetore sveèane haljine. A oni mu rekoše: zagoneni zagonetku svoju, da èujemo.
14 ౧౪ అప్పుడు వారితో సంసోను ఇలా చెప్పాడు, “తినే దాంట్లోనుండి తిండి వచ్చింది. బలమైన దాంట్లోనుండి తీపి వచ్చింది.” అన్నాడు. అతని అతిథులు మూడు రోజులైనా ఆ పొడుపు కథ విప్పలేక పోయారు.
Tada im reèe: od onoga koji jede izide jelo, i od ljutoga izide slatko. I ne mogoše odgonenuti zagonetke tri dana.
15 ౧౫ ఏడవ రోజున వాళ్ళు సంసోను భార్యతో “మమ్మల్ని నిరుపేదలుగా చేయడానికే ఆహ్వానించారా? ఎలాగైనా నీ భర్త దగ్గర ఈ పొడుపు కథ భావాన్ని రాబట్టి మాకు చెప్పు. లేకపోతే నిన్నూ నీ తండ్రి ఇంటి వాళ్ళనూ తగలబెట్టేస్తాం” అన్నారు.
I sedmi dan rekoše ženi Samsonovoj: nagovori muža svojega da nam kaže zagonetku, ili æemo spaliti ognjem tebe i dom oca tvojega. Jeste li nas zato pozvali da nam uzmete imanje? je li tako?
16 ౧౬ సంసోను భార్య అతని ఎదుట ఏడవడం మొదలు పెట్టింది “నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు గానీ ప్రేమించడం లేదు. నువ్వు మా వాళ్లకు ఒక పొడుపు కథ చెప్పావు. కానీ దానినెలా విప్పాలో నాకు చెప్పలేదు” అంది. దానికతడు “నేను మా అమ్మానాన్నలకే చెప్పలేదు నీకెలా చెప్తాను” అన్నాడు. ఆమె విందు జరిగిన ఏడు రోజులూ అతని దగ్గర ఏడుస్తూనే ఉంది.
I stade plakati žena Samsonova pred njim govoreæi: ti mrziš na me, i ti me ne ljubiš; zagonenuo si zagonetku sinovima naroda mojega, a neæeš meni da je kažeš. A on joj reèe: gle, ni ocu svojemu ni materi svojoj nijesam je kazao, a tebi da je kažem?
17 ౧౭ ఏడో రోజు ఆమె అతణ్ణి బాగా ఒత్తిడి చేయడం వల్ల ఆ పొడుపు కథ ఎలా విప్పాలో ఆమెకు చెప్పేశాడు. ఆమె తన వాళ్లకు పొడుపు కథ అర్థం తెలియచేసింది.
I ona plaka pred njim za sedam dana dokle trajaše veselje. A sedmi dan kaza joj, jer bješe navalila na nj; a ona kaza zagonetku sinovima naroda svojega.
18 ౧౮ ఏడో రోజున సూర్యాస్తమయం ముందే ఆ ఊరి వాళ్ళు సంసోనుతో “తేనె కన్నా తీపి అయినదేది? సింహం కన్నా బలమైనదేది?” అన్నారు. సంసోను వారితో ఇలా అన్నాడు “మీరు నా దూడతో దున్నకపోయి ఉంటే నా పొడుపుకథను విప్పగలిగేవారు కాదు” అన్నాడు.
Tada mu rekoše ljudi grada onoga sedmi dan dok sunce ne zaðe: šta je slaðe od meda, i šta je ljuæe od lava? A on im reèe: da nijeste orali na mojoj junici, ne biste pogodili moje zagonetke.
19 ౧౯ యెహోవా ఆత్మ అతని మీదికి మళ్ళీ బలంగా వచ్చాడు. అప్పుడు అతడు అష్కెలోనుకు వెళ్లి అక్కడివారిలో ముప్ఫై మందిని చంపి వారిని దోచుకున్నాడు. ఆ సొమ్ముతో తన పొడుపు కథను విప్పిన వారికి దుస్తులు ఇచ్చాడు. కోపంతో మండిపడుతూ తన తండ్రి ఇంటికి వెళ్లి పోయాడు.
I doðe na nj duh Gospodnji, te siðe u Askalon, i pobi ondje trideset ljudi, i uze odijelo s njih i dade sveèane haljine onima koji odgonenuše zagonetku; i rasrdi se vrlo i otide kuæi oca svojega.
20 ౨౦ సంసోను భార్యను అతని స్నేహితుడికి ఇచ్చి వేశారు.
A žena Samsonova udade se za druga njegova, s kojim se bijaše udružio.

< న్యాయాధిపతులు 14 >