< యోబు~ గ్రంథము 28 >

1 వెండికి గని ఉంది. బంగారం పుటం వేసే స్థలం ఉంది.
Da, srebro ima žice, i zlato ima mjesto gdje se topi.
2 ఇనుమును భూమిలోనుండి తీస్తారు. రాళ్లు కరగించి రాగి తీస్తారు.
Gvožðe se vadi iz praha, i iz kamena se topi mjed.
3 మనిషి చీకటిని అంతమొందిస్తాడు. సుదూర స్థలాల్లో అన్వేషిస్తాడు. గాఢాంధకారంలో అంతు తెలియని తావుల్లో విలువైన రాళ్ళను వెతుకుతాడు.
Mraku postavlja meðu, i sve istražuje èovjek do kraja, i kamenje u tami i u sjenu smrtnom.
4 మనుషుల నివాసాలకు, మనిషి పాదాలు సంచరించే స్థలాలకు దూరంగా అతడు సొరంగం తవ్వుతాడు. అక్కడ అతడు మానవులకు దూరంగా ఇటు అటు తిరుగులాడుతుంటాడు.
Rijeka navre s mjesta svojega da joj niko ne može pristupiti; ali se odbije i odlazi trudom èovjeèjim.
5 భూమి విషయానికొస్తే అందులోనుండి ఆహారం పుడుతుంది. భూగర్భం అగ్నిమయం.
Iz zemlje izlazi hljeb, i pod njom je drugo, kao oganj.
6 దాని రాళ్లు నీలరతనాల పుట్టిల్లు. దాని ధూళిలో బంగారం ఉంది.
U kamenju je njezinu mjesto safiru, a ondje je prah zlatni.
7 వేటాడే ఏ పక్షికైనా ఆ దారి తెలియదు. డేగ కళ్ళు దాన్ని చూడలేదు.
Te staze ne zna ptica, niti je vidje oko kragujevo;
8 గర్వంగా సంచరించే మృగాలు ఆ దారి తొక్కలేదు. క్రూర సింహం ఆ దారిలో నడవలేదు.
Ne ugazi je mlado zvijerje, niti njom proðe lav.
9 మనిషి చెకుముకి రాళ్ళను పట్టుకుంటాడు. పర్వతాలను వాటి కుదుళ్లతో సహా బోర్లా పడదోస్తాడు.
Na kremen diže ruku svoju; prevraæa gore iz dna.
10 ౧౦ శిలల్లో అతడు కాలువలు ఏర్పరుస్తాడు. అతని కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుంది.
Iz stijene izvodi potoke, i svašta dragocjeno vidi mu oko.
11 ౧౧ నీళ్లు పొర్లి పోకుండా జలధారలకు ఆనకట్ట కడతాడు. అగోచరమైన వాటిని అతడు వెలుగులోకి తెస్తాడు.
Ustavlja rijeke da ne teku, i što je sakriveno iznosi na vidjelo.
12 ౧౨ అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?
Ali mudrost gdje se nalazi? i gdje je mjesto razumu?
13 ౧౩ మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు.
Ne zna joj èovjek cijene, niti se nahodi u zemlji živijeh.
14 ౧౪ అగాధం “అది నాలో లేదు” అంటుంది. “నా దగ్గర లేదు” అని సముద్రం అంటుంది.
Bezdana veli: nije u meni; i more veli: nije kod mene.
15 ౧౫ బంగారం దానికి సాటి కాదు. దాని వెల కట్టడానికి వెండిని తూచడం పనికి రాదు.
Ne može se dati èisto zlato za nju, niti se srebro izmjeriti u promjenu za nju.
16 ౧౬ అది ఓఫీరు బంగారంతోగానీ ప్రశస్తమైన గోమేధికంతో, నీలంతోగానీ కొనగలిగింది కాదు.
Ne može se cijeniti zlatom Ofirskim, ni dragim onihom ni safirom.
17 ౧౭ సువర్ణమైనా స్ఫటికమైనా దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలు ఇచ్చి దాన్ని తీసుకోలేము.
Ne može se izjednaèiti s njom ni zlato ni kristal, niti se može promijeniti za zaklade zlatne.
18 ౧౮ పగడాల, ముత్యాల పేర్లు దాని ఎదుట అసలు ఎత్తకూడదు. నిజంగా జ్ఞానానికున్న విలువ కెంపుల కన్నా గొప్పది.
Od korala i bisera nema spomena, jer je vrijednost mudrosti veæa nego dragom kamenju.
19 ౧౯ కూషు దేశపు పుష్యరాగం దానికి సాటి రాదు. మేలిమి బంగారంతో దానికి వెల కట్టలేము.
Ne može se s njom izjednaèiti topaz Etiopski, niti se može cijeniti èistijem zlatom.
20 ౨౦ అలాగైతే జ్ఞానం ఎక్కడనుండి వస్తుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?
Otkuda dakle dolazi mudrost? i gdje je mjesto razumu?
21 ౨౧ అది జీవులందరి కన్నులకు కనిపించదు. ఆకాశ పక్షులకు అది అగమ్యగోచరం.
Sakrivena je od oèiju svakoga živoga, i od ptica nebeskih zaklonjena.
22 ౨౨ “మేము మా చెవులతో దాన్ని గురించి విన్నాము” అని నాశనం, మరణం అంటాయి.
Pogibao i smrt govore: ušima svojima èusmo slavu njezinu.
23 ౨౩ దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు.
Bog zna put njezin, i poznaje mjesto njezino.
24 ౨౪ ఆయన భూమి కొనల వరకూ చూస్తున్నాడు. ఆకాశం కింద ఉన్న దానినంతటినీ చూస్తున్నాడు.
Jer gleda do krajeva zemaljskih i vidi sve što je pod svijem nebom.
25 ౨౫ గాలికి ఇంత వేగం ఉండాలని ఆయన నియమించినప్పుడు, జలరాసుల కొలత నిర్ణయించినప్పుడు,
Kad davaše vjetru težinu, i mjeraše vodu mjerom,
26 ౨౬ వర్షానికి అదుపాజ్ఞలు ఏర్పరచినప్పుడు, ఉరుము మెరుపులకు దోవ చూపినప్పుడు,
Kad postavljaše zakon daždu i put munji gromovnoj.
27 ౨౭ ఆయన జ్ఞానాన్ని చూసి దాన్ని ప్రకటించాడు. దాన్ని స్థాపించి దాన్ని పరిశోధించాడు.
Još je onda vidje i oglasi je, uredi je i pretraži je.
28 ౨౮ యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు.
A èovjeku reèe: gle, strah je Božji mudrost, i uklanjati se oda zla jest razum.

< యోబు~ గ్రంథము 28 >