< యోబు~ గ్రంథము 25 >

1 అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు. 2 అధికారం, భీకరత్వం ఆయనవి. ఆయన పరలోక స్థలాల్లో క్రమం నెలకొల్పుతాడు. 3 ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయించకుండా ఉంటుందా? 4 మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు? 5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రాలు పవిత్రమైనవి కావు. 6 మరి నిశ్చయంగా పురుగు-పురుగులాంటి నరుడు అంతే కదా.

< యోబు~ గ్రంథము 25 >