< యెషయా~ గ్రంథము 5 >

1 నా ప్రియుణ్ణి గురించి పాడతాను వినండి. అతని ద్రాక్షతోట విషయమై నాకు ఇష్టమైన వాణ్ణి గురించి గానం చేస్తాను. వినండి. సారవంతమైన నేల గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్షతోట ఉంది.
אשירה נא לידידי שירת דודי לכרמו כרם היה לידידי בקרן בן שמן
2 ఆయన దాన్ని బాగా దున్ని రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించాడు. దాని మధ్య కావలి గోపురం ఒకటి కట్టించి ద్రాక్షలు తొక్కే తొట్టి తొలిపించాడు. ద్రాక్షపండ్లు కాయాలని ఎదురు చూశాడు గానీ అది పిచ్చి ద్రాక్షకాయలు కాసింది.
ויעזקהו ויסקלהו ויטעהו שרק ויבן מגדל בתוכו וגם יקב חצב בו ויקו לעשות ענבים ויעש באשים
3 కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, నా ద్రాక్షతోట విషయం నాకు న్యాయం చెప్పమని మీకు విన్నవించుకుంటున్నాను.
ועתה יושב ירושלם ואיש יהודה--שפטו נא ביני ובין כרמי
4 నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే మరి ఇంకా ఏమి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాస్తుందని నేను ఎదురు చూస్తే అది పిచ్చి ద్రాక్షలు ఎందుకు కాసింది?
מה לעשות עוד לכרמי ולא עשיתי בו מדוע קויתי לעשות ענבים ויעש באשים
5 ఆలోచించండి, నేను నా ద్రాక్షతోటకు చేయబోయే దాన్ని మీకు వివరిస్తాను. దాన్ని పశువులు మేసేలా దాని కంచెను కొట్టి వేస్తాను. అందరూ దాన్ని తొక్కేలా దాని గోడను పడగొట్టి పాడుచేస్తాను.
ועתה אודיעה נא אתכם את אשר אני עשה לכרמי הסר משוכתו והיה לבער פרץ גדרו והיה למרמס
6 ఎవరూ దాన్ని బాగు చెయ్యరు. పారతో త్రవ్వరు. దానిలో గచ్చపొదలు ముళ్ళ చెట్లు పెరుగుతాయి. దాని మీద కురవవద్దని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను.
ואשיתהו בתה לא יזמר ולא יעדר ועלה שמיר ושית ועל העבים אצוה מהמטיר עליו מטר
7 ఇశ్రాయేలు వంశం సేనల ప్రభువైన యెహోవా ద్రాక్షతోట. యూదా ప్రజలు ఆయనకిష్టమైన వనం. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది. నీతి కోసం చూస్తే రోదనం వినబడింది.
כי כרם יהוה צבאות בית ישראל ואיש יהודה נטע שעשועיו ויקו למשפט והנה משפח לצדקה והנה צעקה
8 స్థలం మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించేలా ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకుంటూ పోతున్న మీకు బాధ.
הוי מגיעי בית בבית--שדה בשדה יקריבו עד אפס מקום והושבתם לבדכם בקרב הארץ
9 నేను చెవులారా వినేలా సేనల ప్రభువు యెహోవా స్పష్టంగా ఈ మాట నాకు చెప్పాడు. నిజంగా గొప్పవి, అందమైన చాలా ఇళ్ళు వాటిలో నివాసముండే వారు లేక పాడైపోతాయి.
באזני יהוה צבאות אם לא בתים רבים לשמה יהיו--גדלים וטובים מאין יושב
10 ౧౦ పది ఎకరాల ద్రాక్షతోట ఇరవై లీటర్ల రసం మాత్రం ఇస్తుంది. పది కిలోల గింజలు చల్లగా పండిన పంట ఒక కిలో అవుతుంది.
כי עשרת צמדי כרם יעשו בת אחת וזרע חמר יעשה איפה
11 ౧౧ మద్యం తాగుదామని తెల్లారే లేచి తమకు మంట పుట్టించే దాకా చాలా రాత్రి వరకూ ద్రాక్షారసం తాగే వారికి బాధ.
הוי משכימי בבקר שכר ירדפו מאחרי בנשף יין ידליקם
12 ౧౨ వారు సితారా, స్వరమండలం, తంబుర, సన్నాయి వాయిస్తూ ద్రాక్షారసం తాగుతూ విందు చేస్తారు గానీ యెహోవా పని గురించి ఆలోచించరు. ఆయన తన చేతితో చేసిన వాటిని లక్ష్యపెట్టరు.
והיה כנור ונבל תף וחליל ויין--משתיהם ואת פעל יהוה לא יביטו ומעשה ידיו לא ראו
13 ౧౩ అందువల్ల నా ప్రజలు జ్ఞానం లేక చెరలోకి వెళ్లిపోతున్నారు. వారిలో ఘనులు పస్తులుంటున్నారు. సామాన్యులు దాహంతో అలమటిస్తున్నారు.
לכן גלה עמי מבלי דעת וכבודו מתי רעב והמונו צחה צמא
14 ౧౪ అందుకనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని తన నోరు బార్లా తెరుస్తున్నది. వారిలో గొప్పవారు, సామాన్య ప్రజలు, నాయకులు, తమలో విందులు చేసుకుంటూ సంబరాలు చేసుకునే వారు పాతాళానికి దిగిపోతారు. (Sheol h7585)
לכן הרחיבה שאול נפשה ופערה פיה לבלי חק וירד הדרה והמונה ושאונה ועלז בה (Sheol h7585)
15 ౧౫ సామాన్యుడు మట్టి కరుస్తాడు. గొప్పవాడు తగ్గిపోతాడు. ఘనత పొందిన వారు తమ కళ్ళు నేలకు దించుకుంటారు.
וישח אדם וישפל איש ועיני גבהים תשפלנה
16 ౧౬ సేనల ప్రభువు యెహోవాయే తన న్యాయాన్ని బట్టి ఘనత పొందుతాడు. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన పరిశుద్ధతను కనపరుస్తాడు.
ויגבה יהוה צבאות במשפט והאל הקדוש נקדש בצדקה
17 ౧౭ అప్పుడు ధనికుల స్థలాలు గొర్రెలకు మేత బీడుగా ఉంటాయి. వారి శిథిలాల్లో గొర్రెపిల్లలు మేస్తాయి.
ורעו כבשים כדברם וחרבות מחים גרים יאכלו
18 ౧౮ శూన్యత తాళ్ళతో అతిక్రమాన్ని లాక్కుంటూ ఉండే వారికి బాధ. మోకులతో పాపాన్ని లాగే వారికి బాధ.
הוי משכי העון בחבלי השוא וכעבות העגלה חטאה
19 ౧౯ “దేవుడు త్వరపడాలి. ఆయన వెంటనే పని జరిగించాలి, మేము ఆయన కార్యాలు చూడాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలిసేలా అది కార్యరూపం దాల్చాలి” అనే వారికి బాధ.
האמרים ימהר יחישה מעשהו--למען נראה ותקרב ותבואה עצת קדוש ישראל--ונדעה
20 ౨౦ కీడును మేలనీ మేలును కీడనీ చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా ఎంచే వారికి బాధ. చేదును తీపి అనీ తీపిని చేదు అనీ భావించే వారికి బాధ.
הוי האמרים לרע טוב ולטוב רע שמים חשך לאור ואור לחשך שמים מר למתוק ומתוק למר
21 ౨౧ తమ దృష్టికి తాము జ్ఞానులమనీ తమ అంచనాలో తాము బుద్ధిమంతులమనీ ఊహించుకునే వారికి బాధ.
הוי חכמים בעיניהם ונגד פניהם נבנים
22 ౨౨ ద్రాక్షారసం తాగడంలో పేరు తెచ్చుకున్న వారికి, మద్యం కలపడంలో చాతుర్యం గల వారికి బాధ.
הוי גבורים לשתות יין ואנשי חיל למסך שכר
23 ౨౩ వారు లంచం పుచ్చుకుని దుర్మార్గుణ్ణి వదిలేస్తారు. నిర్దోషి హక్కులు హరిస్తారు.
מצדיקי רשע עקב שחד וצדקת צדיקים יסירו ממנו
24 ౨౪ అగ్నిజ్వాల చెత్త పరకలను కాల్చివేసినట్టు, ఎండిన గడ్డి మంటలో భస్మమై పోయినట్టు వారి వేరు కుళ్లి పోతుంది. వారి పువ్వు ధూళివలె కొట్టుకుపోతుంది. ఎందుకంటే వారు సేనల ప్రభువు యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపెట్టారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్కును కొట్టి పారేసారు.
לכן כאכל קש לשון אש וחשש להבה ירפה שרשם כמק יהיה ופרחם כאבק יעלה כי מאסו את תורת יהוה צבאות ואת אמרת קדוש ישראל נאצו
25 ౨౫ దాన్నిబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టాడు. పర్వతాలు వణుకుతున్నాయి. వీధుల్లో వారి శవాలు చెత్తలాగా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు. కొట్టడానికి ఆయన చెయ్యి ఇంకా చాపి ఉంది.
על כן חרה אף יהוה בעמו ויט ידו עליו ויכהו וירגזו ההרים ותהי נבלתם כסוחה בקרב חוצות בכל זאת לא שב אפו ועוד ידו נטויה
26 ౨౬ ఆయన దూర ప్రజలకు సంకేతంగా జెండా ఎత్తుతాడు. భూమి కొనల నుండి వారిని రప్పించడానికి ఈల వేస్తాడు. అదిగో, వారు ఆలస్యం లేకుండా వేగంగా వస్తున్నారు.
ונשא נס לגוים מרחוק ושרק לו מקצה הארץ והנה מהרה קל יבוא
27 ౨౭ వారిలో అలసిపోయిన వాడు గానీ తొట్రు పడేవాడు గానీ లేడు. వారిలో ఎవడూ నిద్రపోడు, కునికిపాట్లు పడడు. వారి నడికట్టు వదులు కాదు. వారి చెప్పుల వారు తెగిపోదు.
אין עיף ואין כושל בו לא ינום ולא יישן ולא נפתח אזור חלציו ולא נתק שרוך נעליו
28 ౨౮ వారి బాణాలు పదునైనవి. వారి విల్లులన్నీ ఎక్కుపెట్టి ఉన్నాయి. వారి గుర్రాల డెక్కలు చెకుముకిరాళ్ల వంటివి. వారి రథచక్రాలు తుఫాను లాంటివి.
אשר חציו שנונים וכל קשתתיו דרכות פרסות סוסיו כצר נחשבו וגלגליו כסופה
29 ౨౯ సింహం గర్జించినట్టు వారు గర్జిస్తారు. సింహం కూనలాగా గర్జిస్తారు. వేటను నోట కరుచుకుని యధేచ్ఛగా ఈడ్చుకుపోతారు. విడిపించగల వారెవరూ ఉండరు.
שאגה לו כלביא ושאג (ישאג) ככפירים וינהם ויאחז טרף ויפליט ואין מציל
30 ౩౦ వారు ఆ దినాన సముద్ర ఘోష వలె తమ ఎరపై గర్జన చేస్తారు. ఒకడు దేశం కేసి చూస్తే అంధకారం, దురవస్థ కనిపిస్తాయి. మేఘాలు కమ్మి వెలుగంతా చీకటై పోతుంది.
וינהם עליו ביום ההוא כנהמת ים ונבט לארץ והנה חשך צר ואור חשך בעריפיה

< యెషయా~ గ్రంథము 5 >