< యెహెజ్కేలు 44 >

1 ఆ మనిషి నన్ను తూర్పువైపు తిరిగి ఉన్న పరిశుద్ధ స్థలం బయటి ప్రవేశద్వారానికి తీసుకువచ్చాడు. ఆ గుమ్మం మూసి ఉంది.
Afei, ɔbarima no sane de me baa kronkronbea no abɔntenpono no a ɛkyerɛ apueeɛ fam no ano, na wɔato mu.
2 అప్పుడు యెహోవా నాతో ఈ మాట చెప్పాడు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మంలో నుండి లోపలికి ప్రవేశించాడు కాబట్టి ఏ మనిషీ ప్రవేశింపకుండేలా అది గట్టిగా మూసి ఉంది. ఇక అది ఎన్నటికీ తీయకూడదు.
Na Awurade ka kyerɛɛ me sɛ, “Ɛsɛ sɛ ɛpono a wɔato mu yi tena hɔ saa ara. Ɛnsɛ sɛ wɔbue. Obiara mmfa hɔ nhyɛne mu. Ɛnsɛ sɛ wɔbue, ɛfiri sɛ Awurade, Israel Onyankopɔn afa hɔ ahyɛne mu.
3 ఇశ్రాయేలు పాలకుడు ఆహారం భుజించేటప్పుడు యెహోవా సన్నిధిలో అక్కడ కూర్చుంటాడు. అయితే అతడు ఈ ద్వారం వసారాగుండా ప్రవేశించి వసారా గుండా బయటికి వెళ్ళాలి.”
Ɔhene no ankasa nko ara na ɔbɛtumi atena abɔntenpono no ano na wadidi wɔ Awurade anim. Ɔno na ɔtumi fa abɔntenpono no ntwonoo mu hyɛne mu, na ɔfa hɔ ara firi adi.”
4 తరవాత అతడు నన్ను ఉత్తర ప్రవేశద్వారం గుండా మందిరం ముందు భాగానికి తీసుకు వచ్చాడు. అంతలో మందిరం యెహోవా మహిమ తేజస్సుతో నిండి ఉండడం చూసి నేను సాగిలపడ్డాను.
Afei, ɔbarima no de me faa atifi fam abɔntenpono no mu de me baa asɔredan no anim. Mehwɛeɛ na mehunuu Awurade animuonyam sɛ ahyɛ Awurade asɔredan no ma, na mebutuu hɔ.
5 యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, యెహోవా మందిరం గురించిన కట్టడలు, విధులు అన్నిటిని నేను నీకు తెలియజేస్తున్నాను, నీవు శ్రద్ధగా గమనించు. ఈ సంగతులన్నిటిని నీ కళ్ళతో చూసి చెవులతో ఆలకించు. మందిరం బయటికి పోయే, లోపలి వచ్చే మార్గాలను గూర్చి ఆలోచించు.
Na Awurade ka kyerɛɛ me sɛ, “Onipa ba, hwɛ adeɛ yie, tie no yie, na ma wʼani nku biribiara a mɛka akyerɛ wo a ɛfa nhyehyɛeɛ a ɛwɔ Awurade asɔredan no ho nyinaa. Ma wʼani nku asɔredan no ɛpono ne mmeaeɛ a wɔfa firi adi firi kronkronbea hɔ nyinaa.
6 తిరుగుబాటు చేసే ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించు, ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘ఇశ్రాయేలీయులారా, ఇంతవరకూ మీరు చేసిన అకృత్యాలు చాలు.
Ka kyerɛ Israel efie atuatefoɔ no sɛ, ‘Sei na Awurade seɛ: Mo akyiwadeɛ no adɔɔso, Ao Israel efie!
7 మీరు నాకు ఆహారం, కొవ్వు, రక్తం, అర్పించే సమయాల్లో హృదయంలో శరీరంలో సున్నతి లేని అన్యులను నా పరిశుద్ధ స్థలంలోకి తీసుకువచ్చారు. వారు మీ అకృత్యాలను ఆధారం చేసుకుని దాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగపరిచారు.
Mo akyiwadeɛ a aka no nyinaa akyi no, mode ananafoɔ a wɔyɛ akoma mu ne honam fam momonotofoɔ aba me kronkronbea de agu mʼasɔredan ho fi, ɛberɛ a mode aduane, sradeɛ ne mogya brɛɛ me na mosɛee mʼapam.
8 నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన ఆవరణను మీరు కాపాడకపోగా, ఆ బాధ్యతను అన్యులకు అప్పగించారు.’
Sɛ mobɛyɛ mo adwuma a ɛfa mʼakronkronneɛ ho no, mo maa afoforɔ bɛhwɛɛ me kronkronbea so mmom.
9 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తూ ఉండి హృదయంలో, శరీరంలో సున్నతి లేని అన్యుల్లో ఎవరూ నా పరిశుద్ధస్థలాల్లో ప్రవేశింపకూడదు.
Yei ne deɛ Otumfoɔ Awurade seɛ: Ɔnanani a ɔyɛ akoma mu ne honam fam momonoto biara nni ɛkwan sɛ ɔhyɛne me kronkronbea hɔ. Ananafoɔ a wɔte Israelfoɔ mu mpo nni ɛkwan saa.
10 ౧౦ ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహాలను అనుసరించినప్పుడు, వారితోబాటు నాకు దూరమైన లేవీయులు తమ దోషాన్ని భరించాలి.
“‘Lewifoɔ a wɔfirii me nkyɛn kɔɔ akyirikyiri ɛberɛ a Israel fom ɛkwan ne wɔn a wɔtwee wɔn ho firii me ho kɔdii wɔn ahoni akyi no, ɛsɛ sɛ wɔn bɔne so asodie bɛda wɔn so.
11 ౧౧ వారు నా పరిశుద్ధ స్థలాల్లో పరిచర్య చేసేవారు, నా మందిరానికి ద్వారపాలకులుగా మందిర పరిచర్య జరిగించేవారు, ప్రజల పక్షంగా వారే దహనబలి పశువులను వధించి, బలులు అర్పించేవారు. పరిచర్య చేయడానికి ప్రజల సమక్షంలో నిలిచేవారు వారే.
Wɔbɛtumi asom wɔ me kronkronbea hɔ ɛberɛ a wɔhwɛ asɔredan no apono so na wɔsom wɔ mu; wɔbɛtumi akum ɔhyeɛ afɔrebɔdeɛ na wɔabɔ afɔdeɛ ama nnipa no, na wɔagyina nnipa no anim asom wɔn.
12 ౧౨ అయితే విగ్రహాల ఎదుట ప్రజలకు పరిచారకులై ఇశ్రాయేలీయులు పడిపోయి పాపం చేయడానికి వారు కారకులయ్యారు కాబట్టి నేను వారికి విరోధినయ్యాను. కాబట్టి వారు తమ దోషాన్ని భరిస్తారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Nanso, ɛsiane sɛ wɔsomm wɔn wɔ wɔn ahoni no mu na wɔmaa Israel efie kɔɔ bɔne mu enti, mama me nsa so aka ntam sɛ, ɛsɛ sɛ wɔn bɔne so asodie bɛda wɔn so. Otumfoɔ Awurade asɛm nie
13 ౧౩ “వారు యాజకత్వం జరిగించడానికి నా సన్నిధికి రాకూడదు, పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. దానికి బదులు వారు చేసిన అకృత్యాలకు కలిగే అవమానాన్ని, శిక్షను వారనుభవిస్తారు.
Ɛnsɛ sɛ wɔbɛn me sɛ wɔrebɛsom me sɛ asɔfoɔ anaasɛ wɔbɛn mʼakronkronneɛ mu biara anaa mʼafɔrebɔdeɛ kronkron; ɛsɛ sɛ wɔn akyiwadeɛ ahodoɔ ho aniwuo ka wɔn.
14 ౧౪ అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని, దానిలో జరుగు పనులన్నిటిని పర్యవేక్షిస్తూ దాన్ని కాపాడేవారిగా నేను వారిని నియమిస్తున్నాను.
Nanso mede asɔredan no mu dwumadie bɛhyɛ wɔn nsa. Wɔbɛyɛ ɛho som biara wɔ mu.
15 ౧౫ ఇశ్రాయేలీయులు నన్ను తోసిపుచ్చినపుడు నా పరిశుద్ధ స్థలాన్ని కాపాడి కనిపెట్టే లేవీయులైన సాదోకు సంతతి యాజకులు పరిచర్య చేయడానికి నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో నిలబడి, కొవ్వును, రక్తాన్ని నాకు అర్పిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
“‘Na mmom asɔfoɔ a wɔyɛ Lewifoɔ ne Sadok asefoɔ a wɔyɛɛ adwuma nokorɛm wɔ me kronkronbea ɛberɛ a Israelfoɔ fom ɛkwan no bɛtumi abɛn me na wɔasom wɔ mʼanim; ɛsɛ sɛ wɔgyina mʼanim na wɔbrɛ me sradeɛ ne mogya afɔrebɔdeɛ, Otumfoɔ Awurade asɛm nie.
16 ౧౬ వారే నా పరిశుద్ధస్థలంలో ప్రవేశిస్తారు. వారే నా బల్ల దగ్గరికి వచ్చి పరిచర్య చేస్తారు. వారే నేనప్పగించిన దాన్ని కాపాడతారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Wɔn nko ara na wɔwɔ ho ɛkwan sɛ wɔhyɛne me kronkronbea hɔ; wɔn nko ara na wɔwɔ ho ɛkwan sɛ wɔtwi bɛn me ɛpono, bɛsom wɔ mʼanim na wɔyɛ me som nnwuma.
17 ౧౭ “వారు లోపలి ఆవరణ గుమ్మాల్లోకి వచ్చేటప్పుడు జనపనార బట్టలు ధరించుకోవాలి. వారు ఆ గుమ్మాల గుండా మందిరంలో ప్రవేశించి పరిచర్య చేసేటప్పుడు బొచ్చుతో చేసిన బట్టలు ధరింపకూడదు.
“‘Sɛ wɔwura apono a ɛkɔ mfimfini adihɔ no mu a, ɛsɛ sɛ wɔhyɛ nwera ntadeɛ. Ɛnsɛ sɛ wɔhyɛ kuntu atadeɛ ɛberɛ a wɔresom wɔ apono a ɛkɔ mfimfini adihɔ hɔ anaasɛ asɔredan no mu.
18 ౧౮ అవిసెనార పాగాలు ధరించుకుని నడుములకు జనప నారబట్ట కట్టుకోవాలి. చెమట పుట్టించేది దేనినీ వారు ధరింపకూడదు.
Ɛsɛ sɛ wɔbɔ nwera abotire na wɔhyehyɛ nwera ntadeɛ wɔ wɔn ase. Ɛnsɛ sɛ wɔhyehyɛ biribiara a ɛbɛma wɔate fifire.
19 ౧౯ బయటి ఆవరణంలోని ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు తమ ప్రతిష్ఠిత వస్త్రాలు తీసివేసి, వాటిని ప్రతిష్టితమైన గదుల్లో ఉంచి వేరే వస్త్రాలు ధరించాలి. ఆ విధంగా వారి ప్రతిష్టిత వస్త్రాలను తాకిన ప్రజలు కూడా ప్రతిష్ఠితం కాకుండా ఉంటారు.
Sɛ wɔkɔ mfikyire adihɔ, faako a nnipa no wɔ no a, ɛsɛ sɛ wɔyi ntadeɛ a wɔhyɛ de someeɛ no na wɔgya de gu adan kronkron no mu, na wɔhyehyɛ ntadeɛ foforɔ, sɛ ɛbɛyɛ a wɔmmfa wɔn dwumadie ntadeɛ no nnwira nnipa no ho.
20 ౨౦ వారు తమ తలలు క్షౌరం చేయించుకోకూడదు. తలవెండ్రుకలు పొడవుగా పెరగనియ్యకుండా వాటిని కత్తిరించాలి.
“‘Ɛnsɛ sɛ wɔbɔ tikwa anaasɛ wɔma wɔn tirinwi fu kuhaa, mmom ɛsɛ sɛ wɔbubu so fɛfɛɛfɛ.
21 ౨౧ లోపలి ఆవరణంలో ప్రవేశించేటపుడు ఏ యాజకుడూ ద్రాక్షారసం తాగకూడదు.
Ɔsɔfoɔ biara nnnom bobesa ɛberɛ a wahyɛne mfimfini adihɔ hɔ.
22 ౨౨ వారు విధవరాళ్ళనైనా భర్త విడిచిపెట్టినవారినైనా పెళ్ళి చేసుకోకూడదు. ఇశ్రాయేలీయుల వంశాల్లోని కన్యలనైనా, యాజకులకు భార్యలై విధవరాళ్ళుగా ఉన్నవారినైనా చేసుకోవచ్చు.
Ɛnsɛ sɛ wɔware akunafoɔ anaa mmaa awaregyaefoɔ. Wɔtumi ware mmaabunu a wɔyɛ Israelfoɔ asefoɔ anaa akunafoɔ a na anka wɔn kununom yɛ asɔfoɔ.
23 ౨౩ ప్రతిష్ఠితమైన దానికి, ప్రతిష్టితం కానిదానికి మధ్య, పవిత్రమైనదానికి, అపవిత్రమైనదానికి మధ్య తేడా ఏమిటో వారు నా ప్రజలకు నేర్పాలి.
Wɔnkyerɛkyerɛ me nkurɔfoɔ nsonsonoeɛ a ɛda adeɛ a ɛyɛ kronkron ne adeɛ a ɛyɛ kwasafo deɛ ntam, na wɔmma wɔn nhunu deɛ ɛma biribi yɛ adeɛ a ɛho nteɛ anaasɛ ɛho teɛ.
24 ౨౪ ప్రజల వ్యాజ్యాల్లో వారు నా విధులను బట్టి వారికి తీర్పు తీరుస్తారు. నేను నియమించిన విధులను బట్టి, కట్టడలను బట్టి, నా పండగలను జరుపుతారు. నా విశ్రాంతి దినాలను ఆచరిస్తారు.
“‘Akasa akasa biara mu no, asɔfoɔ na wɔbɛyɛ atemmufoɔ agyina me mmaransɛm so abu atɛn. Ɛsɛ sɛ wɔdi me mmara ne mʼahyɛdeɛ a ɛfa mʼafahyɛ ahodoɔ no so, na wɔyɛ me home nna kronkron.
25 ౨౫ తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె, సోదరుడు, పెళ్ళి కాని సోదరి, వీరి శవాలు తప్ప మరే ఇతర శవాలను ముట్టినా వారు అపవిత్రులవుతారు.
“‘Ɛnsɛ sɛ ɔsɔfoɔ kɔ funu ho na ɔde gu ne ho fi; gye sɛ funu no yɛ nʼagya, ne maame, ne ba, ne nuabarima anaa ne nuabaa a ɔnwareeɛ; ne saa deɛ a, ɔtumi kɔ ho de gu ne ho fi.
26 ౨౬ ఒక యాజకుడు ఆ విధంగా మైల పడితే ప్రజలు ఏడు రోజులు లెక్కించాలి.
Na sɛ wɔdwira ne ho a, ɛsɛ sɛ ɔtwɛn nnanson.
27 ౨౭ అతడు పరిచర్య చేయడానికి లోపలి ఆవరణంలోని పరిశుద్ధస్థలానికి రావడానికి ముందు అతడు తనకోసం పాప పరిహారార్థబలి అర్పించాలి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Ɛda a ɔbɛkɔ kronkronbea no mfimfini adihɔ hɔ akɔsom wɔ kronkronbea hɔ no, ɛsɛ sɛ ɔbɔ bɔne afɔdeɛ ma ne ho, Otumfoɔ Awurade asɛm nie.
28 ౨౮ వారికి స్వాస్థ్యం ఇదే. నేనే వారికి స్వాస్థ్యం. ఇశ్రాయేలీయుల్లో వారికెంత మాత్రం స్వాస్థ్యం ఇవ్వకూడదు. నేనే వారికి స్వాస్థ్యం.
“‘Me nko ara ne agyapadeɛ a asɔfoɔ no wɔ. Ɛnsɛ sɛ moma wɔn kyɛfa biara wɔ Israel. Mɛyɛ wɔn kyɛfa.
29 ౨౯ నైవేద్యాలు, పాప పరిహారార్థ బలిమాంసం, అపరాధ పరిహారార్థ బలిమాంసం వారికి ఆహారమవుతాయి. ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్టించే వస్తువులన్నీ వారివే.”
Wɔbɛdi aduane afɔrebɔdeɛ, bɔne afɔrebɔdeɛ, afɔdie afɔrebɔdeɛ, na biribiara a wɔahyira so ama Awurade wɔ Israel no bɛyɛ wɔn dea.
30 ౩౦ “మీ ప్రతిష్ఠితార్పణల్లో, తొలిచూలు వాటిలో, ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైనవి యాజకులవి అవుతాయి. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలిగేలా మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వాలి.
Mo nnuaba a ɛdi ɛkan no mu deɛ ɛdi mu ne mo akyɛdeɛ sononko no nyinaa bɛyɛ asɔfoɔ no dea. Ɛsɛ sɛ mode mo mmɔre a ɛdi ɛkan no ma wɔn na nhyira atena mo afie mu.
31 ౩౧ పక్షుల్లో, పశువుల్లో దానికదే చచ్చినది గాని, మృగాలు చీల్చి చంపినవి గానీ యాజకులు తినకూడదు.”
Ɛnsɛ sɛ asɔfoɔ no we aboa biara a wawu nam, sɛ ɛyɛ anomaa anaa wiram aboa biara.’”

< యెహెజ్కేలు 44 >